National

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కుట్ర భగ్నం

Submitted by chandram on Sun, 11/11/2018 - 10:26

మరో 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పొలింగ్‌ ఉండగా మావోయిస్టులు భారీ విధ్వంసానికి సిద్ధమయ్యారు. కూంబింగ్ బలగాలే లక్ష్యంగా దంతేవాడ జిల్లాలో భారీ కుట్రకు వ్యూహరచన చేశారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు గుర్తించడంతో మావోయిస్టుల కుట్రభగ్నమైంది. దంతేవాడ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ బలగాలే లక్ష్యంగా  పదడుగులు గొయ్యి తవ్వి భారీగా మందుపాతరలను ఏర్పాటు చేశారు. కాలి బాటలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు భారీ మట్టి కుప్ప కనిపించడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. సమీపంలో భారీ గొయ్యిని పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు ఉండటంతో నిపుణుల సాయంతో నిర్వీర్యం చేశారు.

దూసుకొస్తున్న మరో తుఫాను.. ఆ ప్రాంతాలకు హెచ్చరిక..

Submitted by nanireddy on Sun, 11/11/2018 - 09:31

ఇప్పటికే టిట్లి తుఫాను మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు.. ఈ తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లా వాసులు కొంతమంది సర్వం కోల్పోయారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచివుందని వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది.  ఆగ్నేయ బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న వాయుగుండం శనివారం సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చించి. శనివారం రాత్రికి ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1140, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 1180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది ఆదివారం మరింత బలపడి  తుపానుగా మారనుంది.

మీకు తెలుసా..? మనదేశంలో తొలి ఓటు వేసింది ఈయనే..

Submitted by nanireddy on Sun, 11/11/2018 - 09:11

బ్రిటిష్ వారి పాలన పోయి దేశానికీ స్వాతంత్ర వచ్చిన తరువాత తొలిసారిగా  భారత దేశానికీ లోక్‌సభ ఎన్నికలు 1951-52 కాలంలో జరిగాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే 5 నెలల ముందే హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మంచు ప్రభావిత ప్రాంతం కావడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ముందస్తుగా అక్కడ పోలింగ్ జరిగింది.  అప్పట్లో తొలి ఓటువేసిన పౌరుడి పేరు శ్యామ్‌ శరణ్‌ నేగి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కల్ప జిల్లాకు చెందిన నేగి 1917 జూలై 1న జన్మించారు.

బెంగళూరు పోలీసులకు లొంగిపోయిన గాలి జనార్దన్ రెడ్డి

Submitted by arun on Sat, 11/10/2018 - 16:45

బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి అజ్ఞాతం వీడారు. బెంగళూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కి వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తాను పరారీలో లేనన్నారు. తాను విచారణకు సహకరిస్తానని తెలిపారు. జనార్దన రెడ్డి తనతో పాటు న్యాయవాదులను కూడా  తీసుకొచ్చారు. అంబిడెంట్‌ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలిని పోలీసులు విచారించనున్నారు. అంబిడెంట్‌ స్కామ్‌లో ఈడీ అధికారికి గాలి జనార్దన్‌రెడ్డి లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడీ రైడ్స్‌ నుంచి అంబిడెంట్‌ కంపెనీని రక్షించేందుకు భారీ డీల్‌ కుదుర్చుకున్న గాలి....

ఢిల్లీకి అసమ్మతి సెగలు

Submitted by arun on Sat, 11/10/2018 - 13:08

కాంగ్రెస్‌ నేతల నిరసనలతో ఢిల్లీ మార్మోగుతోంది.తెలంగాణ భవన్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ఆశావహులు ఆందోళనకు దిగారు.  సీట్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని  నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో నల్గొండ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌యాదవ్‌,  ఓబీసీ సెల్‌ కన్వీనర్‌ అశోక్‌గౌడ్‌, పీసీసీ మాజీ కార్యదర్శి రాపోలు జయప్రకాశ్‌, యూత్‌ కాంగ్రెస్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ సతీష్‌గౌడ్‌ పాల్గొన్నారు. బీసీలకు 40 సీట్లు, బీసీ నేతలకే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తృటిలో తప్పిన ప్రమాదం : విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Submitted by nanireddy on Sat, 11/10/2018 - 09:30

76మంది ప్రయాణీకులతో బయలుదేరిన  ఇండిగో విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దాంతో కోలకతా విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు  ఎమర్జెన్సీ  ల్యాండ్‌ అయింది. శుక్రవారం గువహటికి వెళ్లా‍ల్సిన విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. టేకాఫ్‌ తీసుకున్నకొన్నినిమిషాల్లోనే ఫైలెట్లకు ఈ విషయం అర్ధమైంది. దాంతో  అత్యవసరం ల్యాండ్‌ కు ఉపక్రమించారు. ఈ విషయాన్నీ  కోలకతా నేతాజీ సుభాష్ చంద్రబోస్  అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు దృవీకరించారు.  కాక్‌పిట్లో పొగ అలారం మోగడంతో లోపాన్ని గుర్తించినట్టు వారు చెప్పారు. పైలట్‌ల అప్రతమత్తతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

మళ్లీ పెరిగిన సిలిండర్‌ ధర

Submitted by nanireddy on Sat, 11/10/2018 - 08:53

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు వినియోగదారులు. ఈ క్రమంలో వంటగ్యాస్ ధర సైతం మండుతోంది. సిలిండర్‌ ధర ఈ నెలలో  కేవలం 9 రోజుల వ్యవధిలోనే రెండవసారి పెరిగింది. ఎల్‌పీజీ డీలర్లకు ఇచ్చే కమిషన్‌ను ప్రభుత్వం పెంచడంతో వంటగ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ఇంధన సరఫరాదారులు తెలిపారు. తాజా పెంపుతో ఒక్కో సిలిండర్‌ ధర రూ. 507.42కు చేరింది. ప్రస్తుతం వంటగ్యాస్‌ డీలర్లకు 14.2కేజీల సిలిండర్‌కు రూ.48.89 ఇస్తుండగా..  5కేజీల సిలిండర్‌కు రూ. 24.20 చొప్పున కమిషన్‌ ఇస్తున్నారు. అయితే దీన్ని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది చమురు మంత్రిత్వ శాఖ.

డీఎంకే అధినేత స్టాలిన్‌తో చంద్రబాబు భేటీ

Submitted by chandram on Fri, 11/09/2018 - 20:22

డీఎంకే అధినేత స్టాలిన్ తో ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు భేటీ అయ్యారు. మహాకూటమి ఏర్పాటులో భాగంగా చర్చకు చెన్నైవెళ్లిన చంద్రబాబు. విమానశ్రయం నుంచి నేరుగా స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్టాలిన్, కనిమొళితో పాటు డీఎంకే సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చన్ని అందించారు. సీఎం చంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర వెళ్లారు. అనంతరం రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు జరపనున్నారు.

ఏటా 18 లక్షల మంది మృత్యుఒడికి...

Submitted by chandram on Fri, 11/09/2018 - 18:20

రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏకంగా బడులకు సెలవులు ప్రకటించేఅంతగా. ఇంటి నుండి బయటికి రాకుండా ఇంటికే పరిమితం కావాలని పిల్లలకు ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారిచేసింది. ఇక ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులైతే కాలుష్యం నుండి కొద్దిపాటి ఉపశమనం కోసం మెడికల్ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారి చేశారు. అసలు వాతావరణ కాలుష్యానికి అంతా ఇంత కాదు ఒక్క భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా ఏటా 18లక్షల మంది నవాజాత శిశువులు, పసిపిల్లులు మరణిస్తున్నరని లాన్ సెట్ మాగజైన్ నివేదిక వెల్లడించింది.

లక్ష్యం అదే.. నేడు స్టాలిన్ తో చంద్రబాబు భేటీ..

Submitted by nanireddy on Fri, 11/09/2018 - 07:43

బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా.. కూటమి ఏర్పాటే లక్షంగా సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన బాబు.. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ సమావేశం అయ్యారు. అలాగే నిన్న(గురువారం) కర్ణాటక సీఎం కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవగౌడను కలిసిన చంద్రబాబు.. మోడీ ప్రభుత్వనికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఇవాళ చెన్నై వెళ్లనున్నారు. అక్కడ డిఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. మోడీ విధానాలు, రాష్ట్రా ప్రభుత్వాలపై కేంద్రం పెత్తనం తదితర అంశాలపై  స్టాలిన్‌తో చర్చలు జరపనున్నారు.