National

మధ్యప్రదేశ్‌ 18వ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ ‌

Submitted by chandram on Thu, 12/13/2018 - 21:23

మధ్యప్రదేశ్‌ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్ పీఠాన్ని అధిష్టించనున్నారు. సుదీర్ఘ మంతనాల తర్వాత పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కమల్ నాథ్‌వైపే మొగ్గు చూపారు. దీంతో కమల్ నాథ్‌కు లైన్ క్లియర్ అయింది.  మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలుండగా కాంగ్రెస్ 114 చోట్ల, బీజేపీ 109, బీఎస్పీ 2, సమాజ్‌వాదీ పార్టీ 1, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. అధికారం చేపట్టాలంటే 116 సీట్లు రావాలి. దీంతో మాయావతి కాంగ్రెస్‌తో జత కలిసేందుకు సిద్ధమయ్యారు. అలాగే సమాజ్‌వాది పార్టీ కూడా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.  

భావోద్వేగానికి గురైన ముఖేష్‌ అంబానీ

Submitted by nanireddy on Thu, 12/13/2018 - 21:13

ఆకాశమంత పందిరి - భూదేవంత అరుగు, అతిథులు - ఆర్భటాలు, విందులు - వినోదాల మధ్య భారతదేశ ప్రఖ్యాత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహం ఆనంద్‌ పిరమిల్‌ తో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు.. విదేశీ అతిథుల హాజరయ్యారు. మూడు ముళ్ల బంధంతో ఇషా - ఆనంద్‌లు ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుకలో ముకేశ్ అంబానీ కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లు అపురూపంగా పెంచుకున్న తన కూతురు మెట్టినింటికి వెళుతుండడంతో ఆయన ఆనందబాష్పలతో భావోద్వేగానికి గురయ్యారు. ఎంత అపరకుబేరుడైన ఆయన కూడా ఓ ఆడపిల్లకు తండ్రేగా..

సచిన్ పైలట్‌కు నిరాశ.. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్?

Submitted by chandram on Thu, 12/13/2018 - 20:55

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పీఠం సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌కు దక్కే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. యువకుడై సచిన్ పైలెట్‌ కంటే సీనియర్ అయిన గెహ్లాట్‌ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ సీఎంగా ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ మద్దతుదారులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. రాహుల్ గాంధీ ఫైనల్ కాల్ చేస్తానని తనతో చెప్పారని అశోక్ గెహ్లోట్ తన వర్గీయులతో చెప్పినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలుండగా 199 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఊహించినట్టే కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం బీజేపీ 73, ఇతరులు 27 స్థానాలు సాధించారు.

ఆ ముగ్గురు సీఎంలు ఎవరో?

Submitted by chandram on Thu, 12/13/2018 - 20:21

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, చత్తీస్ గడ్ వంటి కీలక 3 రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసే ప్రక్రియ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిణామాలు సర్వసాధారణమే అయినప్పటీ ప్రస్తుత పరిణామాలు మరింత ఉత్కంఠను కలిగిస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు కొనసాగుతోంది.  సీఎం ఆశావహులతో రాహుల్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించనున్నారు. 

ఐసీఐసీఐ బంపర్‌ ఆఫర్‌

Submitted by nanireddy on Thu, 12/13/2018 - 19:30

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ..  తన సంస్థలో పనిచేసే బ్యాంక్‌ ఉదోగినులకు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. భారతదేశంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు  ఉచిత బీమా  క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్లు అలాగే అన్‌లిమిటెడ్‌ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌ లాంటి ఆఫర్లను అందిస్తోంది. ‘అడ్వాంటేజ్ ఉమన్ ఔరా సేవింగ్స్ అకౌంట్‌’  పేరుతో ఉద్యోగినులకు ప్రత్యేక ఖాతాను అందిస్తోంది. ఈ అకౌంట్‌ తీసుకున్న వారికి డెబిట్‌ కార్డ్‌ వాడకంపై నెలకు రూ.750 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. లాకర్‌ చార్జీలపై 50 శాతం డిస్కౌంట్‌, గృహ రుణాల ప్రాసెసింగ్‌ ఫీజులో డిస్కౌంట్‌.

పార్లమెంటులో టీడీపీ, వైసీపీ నిరసనల హోరు..

Submitted by nanireddy on Thu, 12/13/2018 - 19:05

ఏపీకి ప్రత్యేక హోదాకోసం టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. హోదా ఇవ్వనందుకు నిరసనగా ధర్మపోరాటాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేస్తోంది. అంతేకాదు పార్లమెంట్‌ లో టీడీపీ ఎంపీల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని.. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంజీవని అయిన ప్రత్యేక హోదాను ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడు వినూత్న వేషధారణతో నిరసన తెలిపే టీడీపీ ఎంపీ శివప్రసాద్‌.. ఈసారి కూడా మరో కొత్త వేషధారణతో ఆకట్టుకున్నారు. గారడి ప్రదర్శకుడి వేషధారణలో నిరసన తెలిపారు శివప్రసాద్‌. పొట్టకూటి కోసం మాయలు చేసేవాడు ఒకరైతే..

జమ్మూకశ్మీర్‌ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Submitted by nanireddy on Thu, 12/13/2018 - 18:48

 జమ్మూకాశ్మీర్‌ మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు కూంబింగ్‌ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు ఎదురు కాల్పులతో ధీటుగా సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్య హోరా హోరీగా సాగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మంది ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. కాగా హతమైన ఉగ్రవాదుల సంస్థ, వారి స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కోసం భద్రతా దళాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ సాయంత్రం కేంద్ర హోమ్ మంత్రి కూడా సిబ్బందితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే గతనెల షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ధ్యానంలో సన్యాసి.. చంపేసిన చిరుతలు..

Submitted by nanireddy on Thu, 12/13/2018 - 18:28

మహారాష్ట్ర అడవిలో విషాదం చోటుచేసుకుంది.  ధ్యానంలో ఉన్న బౌద్ధ సన్యాసిని దారుణంగా  చంపేశాయి చిరుతపులి. ఈ ఘటన చంద్రాపూర్ జిల్లా రాండెగి ప్రాంతానికి అడవిలో జరిగింది. రాహుల్ వాల్కే (35) అనే సన్యాసి నిత్యం ధ్యానంలోనే గడిపేవారు. ఈ క్రమంలో రాండెగి సమీపంలోని అడవిలో చరిత్రాత్మక బౌద్ధ దేవాలయం పక్కన చెట్టు కింద ధ్యానం చేసుకుంటుంటారు. ఆయనకు ఇద్దరు శిష్యులు రోజు భోజనం తెచ్చేవారు. అయితే నెల రోజుల కిందట రాహుల్ వాల్కే కనిపించకుండా పోయారు. ఈ విషయంపై ఇద్దరు శిష్యులు పోలీసులకు సమాచారం ఫిర్యాదు చేశారు.

రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపై స్పందించిన యోగి!

Submitted by chandram on Thu, 12/13/2018 - 18:24

తాజాగా ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ గట్టి ఎదురుదెబ్బె తగిలిందని తెలిసిందే. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీకి ఘోరపరజయం చవిచూసింది. ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ తన సత్తా చాటుకుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ విజయాలపై ఎట్టకేలకు తాజాగా బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామిలతోనే గెలిచిందన్నారు. కాంగ్రెస్ అడిన అబద్దాలు అతి త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. వీళ్ల అబద్దాలే త్వరలో బీజేపీ భవిష్యత్తు ఎన్నికల్లో తప్పకుండ లాభపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

కేవ‌లం 3 ఓట్ల తేడాతో..

Submitted by chandram on Thu, 12/13/2018 - 17:35

తాజాగా ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓ అభ్యర్ధి కేవలం మూడంటే మూడే ఓట్ల తేడాతో విజయం తన సొంతం చేసుకున్నారు. మిజోరం నేష‌న‌ల్ ఫ్రంట్‌కు చెందిన లాల్‌చంద‌మా ర‌త్లే తువ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు జెండా ఎగరవేశారు. కేవ‌లం మూడు ఓట్ల తేడాతో నెగ్గడమే విశేషం. లాల్‌చంద‌మాకు 5207 ఓట్లు పోల‌వ్వగా, ఆయ‌న ప్రత్యర్థి ఆర్ఎల్ ప‌న్వామియాకు 5204 ఓట్లు పోల‌య్యాయి.