JUNIOR NTR

వచ్చేవరకూ ఆగు.. లేదంటే చంపేస్తా

Submitted by arun on Sat, 07/14/2018 - 16:13

సెలెక్ట్ మొబైల్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ‘‘నేను రభస షూటింగ్‌లో స్విట్జర్లాండ్‌లో ఉన్నా. ప్రణతికి డెలివరీ టైమ్. ఎప్పుడు ఏం జరిగినా హాస్పిటల్‌కు వచ్చేయండి అని చెప్పా. ఒకరోజు షూటింగ్ గ్యాప్‌లో మా ఆవిడతో మాట్లాడుతుంటే తేడాగా ఉంది. వెంటనే నిన్ను నేను చంపేస్తాను. నేనిక్కడ ఉన్నాను. నువ్వు అప్పుడే కనేయకు నేనొచ్చేవరకూ ఆగు అన్నాను. ‘లేదులే బాగానే ఉంటుంది’ అంది.

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎన్టీఆర్..

Submitted by arun on Wed, 06/27/2018 - 17:52

నాని హోస్ట్ గా వ్యహరిస్తున్న బిగ్ బాస్ 2 షో విజయవంతంగా సాగుతోంది. 16 మంది సభ్యులు కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. వారిలో సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2 ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ సాగుతోంది. మొదట బిగ్‌బాస్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ షోను చాలా మంది చూస్తున్నట్టు తేలింది. కానీ టీఆర్పీ రేటింగ్స్ విషయంలో నాని.. ఎన్టీఆర్ కన్నా కాస్త వెనుకబడ్డట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో ఆ షో టీఆర్పీ అమాంతం పెరిగిపోయింది. కానీ తొలి సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు కొంచెం వెనుకపడిందని టాక్.

తారక్‌ను రావొద్దని చెప్పా: కల్యాణ్‌రామ్

Submitted by arun on Sat, 03/24/2018 - 13:03

నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా ఎమ్మెల్యే ప్రి రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తాడనే టాక్ బయట బాగా నడిచింది. కానీ ఆయన దీనికి హాజరు కాలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ స్పందించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తారక్‌ను తానే వద్దని చెప్పానని కల్యాణ్ రామ్ తెలిపాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం కోసం కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నాడని, అది అభిమానులకు సర్‌ప్రైజ్‌ అని.. ఒకవేళ ఇప్పుడు ఫంక్షన్‌కు వస్తే ఆ లుక్ బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే వద్దని చెప్పానని పేర్కొన్నాడు. ఇక ఫంక్షన్‌కు వచ్చేముందు కూడా ఎన్టీఆర్‌ను కలిసే వచ్చానని..

ఎన్టీఆర్ ను చూసి పూజా హెగ్డే భయపడుతోంది

Submitted by arun on Fri, 03/16/2018 - 14:29

పూజా హెగ్డే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు దిగుమతి అవడమే కాదు.. స్టార్ హీరోలకు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ అయిపోయింది. డీజే సినిమాలో అందాల ఆరబోతతో.. వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమాలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలో ఆమే.. హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు.. ప్రభాస్ తోనూ కమిట్ అయ్యింది.

తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు : ఎన్టీఆర్‌

Submitted by arun on Sun, 02/25/2018 - 08:40

శ్రీదేవి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘‘ఆమె వచ్చింది.. ఆమె చూసింది. ఆమె అందరినీ తన వశం చేసుకుంది. తను ఎక్కడినుంచైతే వచ్చిందో ఆ స్వర్గానికే తిరిగి వెళ్లిపోయింది. శ్రీదేవిగారి ఆత్మకు శాంతి కలగాలి. ఆమె లేని లోటు పూడ్చలేనిది’’ అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ట్వీట్‌కు వర్మ రిప్లై ఇచ్చారు. ‘ఎప్పటికీ మరచిపోలేని అత్యంత అందమైన సోల్’ అని పేర్కొన్నారు వర్మ. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌ని షేర్ చేసిన అనుపమా పరమేశ్వరన్.. ‘ఇది నమ్మలేకపోతున్నాను’ అని రీ ట్వీట్ చేసింది.