Kodandaram

జనగామపై కొనసాగుతోన్న సస్పెన్స్‌

Submitted by arun on Wed, 11/14/2018 - 16:10

65మందితో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ మరో పది మందితో సెకండ్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. అయితే రెండో జాబితాలో కూడా పలువురు సీనియర్ల పేర్లు కనిపించలేదు. కనీసం సెకండ్‌ లిస్ట్‌లోనైనా తమ పేరు ఉంటుందని ఆశించిన సీనియర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. ముఖ్యంగా జనగామ సీటు ఆశించి మొదటి లిస్టులో భంగపడిన టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు రెండో జాబితాలోనూ రిక్త హస్తమే ఎదురైంది. అలాగే సనత్‌‌నగర్ సీటు ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌‌రెడ్డి పేరు కూడా లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.  

త్వరలోనే టీజేఎస్ ఖాళీ అవుతుంది - హరీష్‌రావు

Submitted by chandram on Mon, 11/12/2018 - 16:38

టీజేఎస్ అధినేత కోదండరామ్ టార్గెట్‌గా మంత్రి హరీష్‌ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యమాన్ని అవహేళన పార్టీలతో నాలుగు సీట్ల కోసం కోదండరామ్‌ జతకట్టారన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన తమను మాత్రం శత్రువులుగా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌, టీడీపీలు కోదండరామ్‌ను ఎలా అవమానించారో గుర్తు చేసుకోవాలంటూ సూచించారు. కాంగ్రెస్, టీడీపీ నేతల నుంచి కోదండరామ్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్న చరిత్ర టీఆర్ఎస్‌దేన్నారు. సంగారెడ్డి జిల్లా టీజేఎస్ నేతలకు పార్టీ కండువ కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. కోదండరామ్ పార్టీ త్వరలోనే ఖాళీ అవుతుందంటూ జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ 95..టీడీపీ 14..మరి టీజేఎస్‌కు ఎన్ని?

Submitted by arun on Fri, 11/02/2018 - 10:38

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయినట్టే కనిపిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. టీడీపీతో 14 సీట్లకు సర్దుబాటు కుదిరిందని స్ఫష్టం చేశారు. టీజేఎస్, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. అభ్యర్థుల జాబితాను ఈ నెల 8 లేదా 9న ప్రకటిస్తామని తెలిపారు.  

చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు...ఉత్తమ్ తీరుపై టీజేఎస్ అసంతృప్తి

Submitted by arun on Thu, 10/25/2018 - 12:41

మహాకూటమిలో లుకలుకలు, సీట్ల కేటాయింపులో నిత్య వాయిదాల నేపధ్యంలో భవిష్యత్‌పై టీజేఎస్ దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలతో అధ్యక్షుడు కోదండరామ్ చర్చలు జరిపారు.  పొత్తుల విషయంలో తేల్చక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు కాంగ్రెస్‌ను చంద్రబాబే నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ అధినేతకు సూచించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా ఉందామన్న నేతలు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చిచెప్పారు.

కోదండరామ్‌కు డిప్యూటీ హోదా?

Submitted by arun on Mon, 10/15/2018 - 12:48

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేయరా..? ఆయన్ని కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకుంటారా..? మహాకూటమిలో పెద్ద తలకాయగా ఉన్న కోదండరామ్‌ రాజకీయ భవిష్యత్తుపై.. అప్పుడే నిర్ణయం తీసుకున్నారా..? కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ.. టీజేఎస్‌పై తీసుకున్న నిర్ణయాలు.. చర్చనీయాంశంగా మారాయి. 

ఏ అమరుడు చెప్పాడని కోదండరామ్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు: కేటీఆర్‌

Submitted by arun on Tue, 09/25/2018 - 11:04

ఢిల్లీ గులాములుగా ఉండాలా? అమరావతి బానిసల్లా ఉండాలా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన తరుణమిదన్నారు మంత్రి కేటీఆర్‌. అమరవీరుల గురించి మాట్లాడుతున్న కోదండరామ్‌... ఏ అమరుడు చెప్పాడని కోదండరామ్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. రైతులను కాల్చి చంపిన రాబందులు ఒక్కటయ్యాయన్న కేటీఆర్‌... టీఆర్‌ఎస్‌... మోడీకో, రాహుల్‌కో భయపడే పార్టీ కాదన్నారు.

కోదండరామ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?

Submitted by arun on Fri, 07/27/2018 - 11:13

తెలంగాణ ఉద్యమ సమయంలో కార్యకర్తలకు బలన్నిచ్చారు రాష్ట్ర సాధన తర్వాత ఇక బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్నా నంటున్నారు ఇన్నాళ్లూ ఉద్యమాలకే పరిమితమైన ఆ ప్రొఫెసర్ ఇప్పుడో రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు ఇంతకీ ఆయన పోటీ చేసేదెక్కడ నుంచి?

ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ పార్టీలు

Submitted by arun on Tue, 04/10/2018 - 11:19

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తెలంగాణలో రాజకీయ పార్టీలు తమ బల ప్రదర్శన చేసే పనిలో పడ్డాయి. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యర్థులకు సవాల్ విసరాలని డిసైడయ్యాయి. ఇటీవల కొత్తగా  పురుడు పోసుకున్న తెలంగాణ జన సమితి, అధికార పార్టీ ఒకేరోజు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. 

మిలియన్‌ మార్చ్‌: కోదండరాం వర్సెస్‌ పోలీస్‌

Submitted by arun on Sat, 03/10/2018 - 09:54

పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా మిలియన్‌ మార్చ్ నిర్వహించేందుకు కోదండరాం రెడీ అవుతున్నారు. టీజేఏసీ నేతలు కోదండరాం ఇంటికి చేరుకుంటున్నారు. అయితే కోదండరాం ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కోదండరాం ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

ట్యాంక్‌ బండ్‌ఫై మిలియన్‌ మార్చ్‌‌కు అనుమతి ఇవ్వకపోవడంపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలనకు ఇదే నిదర్శనమన్న ఆయన నాటి మిలియన్ మార్చ్‌ జ్ఞాపకాలు ఇంకా కళ్లముందు కదులుతూనే ఉన్నాయన్నారు. 2011లో ఎన్ని ఆంక్షలు ఉన్నా మిలియన్‌ మార్చ్‌ను విజయవంతం చేసుకున్నామని కోదండరాం గుర్తు చేశారు. 

నాగంకు గాలం వేయనున్న ప్రొఫెస‌ర్ కోదండ‌రాం

Submitted by arun on Fri, 02/23/2018 - 11:10

తెలంగాణ రాజకీయ బరిలోకి మరో కొత్త పార్టీ వస్తోంది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేస్తున్న ఈ పార్టీ పనులు ఢిల్లీలో వేగంగా సాగుతున్నాయి. జాక్ చైర్మన్ ప్రొ. కోదండరాం కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర తన అనుచరుల ద్వారా పార్టీ నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఈసీ ముందు మూడు పేర్లు, పార్టీ గుర్తు ఉంచినట్టు తెలిసింది.