Actor Kamal Haasan

కమల్‌హాసన్ రాజకీయ యాత్ర ప్రారంభం

Submitted by arun on Wed, 02/21/2018 - 09:43

తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది.  విలక్షణ నటుడు కమలహాసన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ ఉదయం రామేశ్వరంలోని అబ్దుల్ కలామ్ స్వగృహం నుంచి కమల్ తొలి అడుగు వేశారు. కలామ్ కు నివాళులు అర్పించిన ఆయన, రామేశ్వరం, పరమకొడి, మధురై ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు చివరిగా జరిగే మధురై సభలో తన పార్టీ పేరు, జెండా తదితర వివరాలను కమల్ స్వయంగా వెల్లడించనున్నారు. ఇక ఇవాళ కమల్ మధురైలో నిర్వహించే సభకు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా పాల్గొననుండటం విశేషం.