AP special status fight

ఆయన విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ‌

Submitted by arun on Wed, 04/11/2018 - 15:40

టీడీపీ ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కడుపు నిండా తిని స్పీకర్ లేని సమయంలో ఆ రూంలో దొర్లుతారుగానీ, పక్కనే ఉన్న ప్రధాని నరేంద్రమోడీ రూంకు వెళ్లే ధైర్యం లేదని మండిపడ్డారు. కిలో మీటర్ దూరం ముందు నుంచే మోడీ ఇంటిపై దాడి అంటూ మీడియాకు, పోలీసులకు సమాచారం ఇచ్చి బస్సుల్లో ఎక్కేసి..పోలీసులు తమను బస్సుల్లో కుక్కేశారని చెబుతున్నారని విమర్శించారు. మీడియా కోసం ధర్నాలు చేసి, భోజనం సమయానికి పరుగెడతారని, వీళ్లు మా ఎంపీలను విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

విజయమ్మ 'పాదనమస్కారం'పై లోకేష్ కౌంట‌ర్

Submitted by lakshman on Wed, 04/11/2018 - 04:36

ప్ర‌త్యేక‌హోదాపై వైసీపీ - టీడీపీ - బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది.మైలేజ్ కోసం ఒక‌రిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. టీడీపీ బీజేపీని విమ‌ర్శిస్తూ త్వ‌ర‌లో జ‌రిగే క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటువేయాల‌ని పిలుపునిచ్చింది. క‌ర్నాట‌క‌లో తెలుగువారికి టీడీపీ ఇచ్చిన‌పిలుపుతో ఆ పార్టీ కాంగ్రెస్ కి అనుకూలం, బీజేపీకి వ్య‌తిరేకం అని అర్ధం వ‌చ్చిన‌ట్లు ప‌లువురు క‌మ‌లం నేత‌లు భావిస్తున్నారు. ఇక టీడీపీ - వైసీపీలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాక‌పుట్టిస్తున్నాయి. 

టీడీపీ సరికొత్త వ్యూహం

Submitted by arun on Mon, 04/09/2018 - 17:14

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు. రేపు మధ్యాహ్నం టీడీపీ అధికార ప్రతినిధులతో బాబు సమావేశం కానున్నారు. 2,3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీల బస్సు యాత్ర కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

హోదాపోరులో భాగంగా మేధావులు, వివిధ సంఘాలతో సమావేశం కావాలని.. జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా సైకిల్ యాత్రలు నిర్వహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

హోదా కోసం వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష

Submitted by arun on Fri, 04/06/2018 - 15:54

ప్రత్యేక హోదా పోరు ఉధృతమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఐదుగురు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డి ఏపీ భవన్‌ వేదికగా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. మధ్యాహ్నం 2 గంటలకు దీక్ష ప్రారంభమైంది. 

చంద్రబాబుకు జగన్‌ సవాల్‌

Submitted by arun on Fri, 04/06/2018 - 13:21

తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, ముందుగా చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాలను నేడు స్పీకర్ కు సమర్పించారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, ‘మేం చెప్పిందే చేశాం. మా ఎంపీలు రాజీనామా లేఖలు సమర్పించారు. చంద్రబాబుకు నేను సవాల్‌ విసురుతున్నా. మీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించండి. ఏపీ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం అందరం ఐక్యమత్యంగా నిలబడదామ’ని ట్విటర్‌లో రాసుకొచ్చారు వైఎస్‌ జగన్‌.

రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించిన వైసీపీ ఎంపీలు

Submitted by arun on Fri, 04/06/2018 - 12:47

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. శుక్రవారం పార్లమెంట్‌ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. కేంద్రం తీరు మారకపోతే తమ ఎంపీలు పార్లమెంటు సమావేశాల చివరిరోజు మూకుమ్మడిగా రాజీనామానాలు చేస్తారని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ అధినేత ఆదేశం మేరకు ఈరోజు లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే ఎంపీలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు అందజేశారు.

రాజీనామా లేఖలు సిద్ధం చేసిన వైసీపీ ఎంపీలు

Submitted by arun on Fri, 04/06/2018 - 10:59

వైసీపీ ఎంపీలు రాజీనామా లేఖలతో పార్లమెంట్‌కు వచ్చారు. సభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే స్పీకర్‌కు రాజీనామా లేఖలు అందిస్తామని ఎంపీలు ప్రకటించారు. రాజీనామాల అనంతరం నేరుగా ఏపీ భవన్‌కు చేరుకోనున్న ఎంపీలు అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఎంపీల దీక్షకు సంఘీభావంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ చేరుకున్నారు.  
 

హోదా పోరులో మేము సైతం..

Submitted by arun on Sat, 03/31/2018 - 10:38

ఏపీ సీఎం చంద్రబాబుకు పలువురు సినీ ప్రముఖులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విభజన హామీల అమలు కోసం సీఎం చేస్తున్న పోరాటానికి బాసటగా ఉంటామని తెలిపారు. ప్రత్యేకహోదా సాధన కోసం తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం కోసం కేంద్రంతో సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు నిన్న సీఎంతో సమావేశమై సంపూర్ణ మద్దతును ప్రకటించారు. 

వైసీపీ ఎంపీల సంచలన ప్రకటన...

Submitted by arun on Wed, 03/28/2018 - 12:24

వైఎస్సీర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం సంచలన ప్రకటన చేశారు. లోక్‌సభ వాయిదా పడడంతో వారు మండిపడ్డారు. ఈ విధంగా పార్లమెంట్ నిరవధిక వాయిదా పడితే తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఎంపీలు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి.. సంతకాలు చేసిన రాజీనామా లేఖలతో లోక్‌సభకు బయలుదేరారు. 

అవిశ్వాసం; నిప్పులుచెరిగిన ఖర్గే..

Submitted by arun on Tue, 03/27/2018 - 14:35

అవిశ్వాసాన్ని అడ్డుకోవడానికి మోడీ ప్రభుత్వం, అన్నాడీఎంకే మ్యాచ్ ఫిక్సింగ్‌ చేసుకున్నాయని లోక్‌సభలో కాంగ్రెస్ ‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని రక్షించడానికే అన్నాడీఎంకే ఎంపీలు సభను అడ్డుకొంటున్నారని చెప్పారు. ప్రతిరోజూ సభలో ఆందోళన చేస్తున్న సభ్యులపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఖర్గే ప్రశ్నించారు. తమకు అవిశ్వాసం ఎంతో కీలకమన్న ఖర్గే..ప్రత్యేక హోదాతో పాటు, కావేరి జల వివాదం గురంచి సభలో చర్చించాలని డిమాండ్ చేశారు.