pension

పింఛను పై వంచనలొద్దు

Submitted by arun on Fri, 08/03/2018 - 14:57

పింఛను పై ఎందుకు పన్ను,

మీ ఖజానాకై వేస్తారా కన్ను,

ఇది జీవనభృతికి వెన్నుదన్ను,

వారు ఎప్పటికి నెంబర్ వన్ను. శ్రీ.కో

పెన్షన్ పై ఆదాయపన్ను ఎత్తివేయాలని కోరుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇప్పుడు ఉద్యమ బాట పడుతున్నారు. మేము సర్వీస్ లో ఉన్నప్పుడు చేసిన పనికి వేతనం ఇచ్చారు, అదే ఆదాయమే కనుక దానిపై ఆదాయ పన్ను వసూలు చేసిన అంటే అర్థం ఉంది, కానీ 30 నుంచి 36 ఏళ్లపాటు సేవలందించిన, పదవి విరమణ చేసిన తరువాత ఇచ్చే పింఛన్ను జీవనభృతి మాత్రమే అని వారు వాదిస్తున్నారు.


 

పించన్ ఇవ్వడం లేదని కుష్టురోగి పాముతో ఆఫీసుకు వచ్చినవేళ...

Submitted by arun on Sat, 06/09/2018 - 12:54

కర్ణాటక రాష్ట్రంలో ఓ కుష్ఠి రోగి తన సమస్యను వినూత్నంగా పరిష్కరించుకున్నాడు. గత 8 నెలలుగా తనకు పెన్షన్ రాకపోవడంతో మెడలో పామును వేసుకుని పెన్షన్ ఆఫీస్‌కు వెళ్లాడు. అధికారులకు దడ పుట్టించాడు. అనుకున్నది సాధించాడు. 

పింఛన్ కోసం తల్లి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన కొడుకు

Submitted by arun on Fri, 04/06/2018 - 12:35

డబ్బుకు లోకం దాసోహం. ఇది ఊరికే చెప్పలేదు. ఎందుకంటే డబ్బే ప్రధానం అన్నింటికి. అన్ని బంధాలను నిలిపేది, పడగొట్టేది ఈ డబ్బే. దీనికి తార్కాణంగా నిలిచే ఘటన ఒకటి కోల్‌కతాలో చోటుచేసుకుంది. తల్లికి వచ్చే పెన్షన్‌ డబ్బుల కోసం ఆమె మరణాన్ని కూడా లోకానికి తెలియకుండా చేశాడు. తల్లి శవాన్ని ఇంట్లోని ఫ్రిజ్‌లోనే దాచిపెట్టారు. ఆమె కొడుకు, భర్త కలిసి ఈ పని చేశారు. తల్లికి వచ్చే పెన్షన్‌ డబ్బుల కోసం ఆమె బతికే ఉన్నట్లుగా సర్టిఫికేట్స్‌ కూడా సృష్టించాడు.ఈ అమానవీయ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది.

బోదకాలు బాధితులకు నెలకు రూ.1,000 పింఛను

Submitted by arun on Sat, 02/10/2018 - 11:30

బోదకాలు బాధితులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్ లో రాష్ట్రంలోని దాదాపు 47 వేల మంది బోదకాలు బాధితులకు పింఛన్ కేటాయింపులు జరపనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కేసీఆర్ కిట్స్ పథకం వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.