politics

చిరూ దెబ్బ‌ ర‌జ‌నీకి త‌గ‌ల‌కుండా ఉంటుందా

Submitted by arun on Fri, 01/05/2018 - 14:37

ర‌జ‌నీ రాజ‌కీయం పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో పార్టీ పెట్టిన మెగ‌స్టార్ చిరంజీవికి రాజ‌కీయం ఎలాంటి చేదు అనుభ‌వాల్ని మిగిల్చిందో అంద‌రికి తెలిసిన విష‌య‌మే. చిరంజీవికి  త‌గిలిన ఎదురు దెబ్బ‌లు ర‌జ‌నీకాంత్ కు త‌గ‌ల‌కుండా ఉంటాయా అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఎందుకంటే త‌మిళ‌నాట రాజ‌కీయం అంటే క‌త్తిమీద సామేన‌ని చెప్పుకోవాలి.
 

స్థానికత రజినీకి మైనస్ అవుతుందా?

Submitted by arun on Tue, 01/02/2018 - 12:01

దేవుడు ఆదేశిస్తాడు...అరుణాచలం పాటిస్తాడని, నాడు సినిమాలో నేడు, పొలిటికల్‌ లైఫ్‌లోనూ చెప్పాడు రజినీకాంత్. ఆధ్యాత్మిక పాలిటిక్స్ చేస్తానంటున్న రజినీని, ఆదేశించింది దేవుడు కాదు, నరేంద్ర మోడీ అంటున్నవారి విమర్శలూ అనేకం. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత...రజినీకాంత్‌కు ప్లస్సులేనా...మైనస్‌లూ ఉన్నాయా?

కంగ్రాట్స్ రజనీకాంత్..హామీలు నెరవేర్చకపోతే మూడేళ్లలో రాజీనామా : ర‌జ‌నీ

Submitted by arun on Sun, 12/31/2017 - 13:09

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై క‌మ‌ల్ హాస‌న్ స్పందించారు. రజనీ రాజకీయ ప్రవేశాన్ని కమల్ హాసన్ స్వాగతించారు. ఈ సందర్భంగా నా సోదరుడు రజనీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని కమల్ హాసన్ చెప్పారు. ఇదిలా ఉంటే ర‌జ‌నీ రాజ‌కీయంపై ఆరు రోజుల పాటు త‌న అభిమానుల‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ‌కీయ ప్ర‌వేశంపై డిసెంబ‌ర్ 31న ప్ర‌క‌టిస్తాన‌న్న ఆయ‌న‌, సినీ రంగంలో ఎదిగిన తీరు. సూప‌ర్ స్టార్ గా మ‌లిచిన ద‌ర్శ‌క, నిర్మాత‌ల్ని కొనియాడారు. అయితే చివరిరోజు అయిన ఆదివారం రోజు  తన అభిమానులతో సమావేశమైన రజనీకాంత్.. రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా..234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ : ర‌జ‌నీ కాంత్

Submitted by arun on Sun, 12/31/2017 - 10:52

రాజకీయ రంగ ప్రవేశంపై తమిళ సూపర్‌స్టార్ రజ‌నీకాంత్‌ తెరదించారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ ప్ర‌క‌టించారు. కొద్దిరోజుల క్రితం 2.0 విడుదలైన తరువాత రెండు నెలలకు పా రంజిత్ తీసే కాలా విడుదల త‌రువాత‌ ఏమవుతుందో దేవుడికే తెలియాలి అన్న ర‌జినీ వ్యాఖ్య‌ల్నిఆయ‌న ఇక సినీ రంగాన్ని విడిచి పెట్టి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ బోతున్నారాని సినీ విశ్లేష‌కులు, ఆయ‌న అభిమానులు అభిప్రాయ‌ప‌డ్డారు. వారి అభిప్రాయాల‌కు అనుగుణంగానే కొద్దిసేప‌టి క్రితం త‌న అభిమానుల సమ‌క్షంలో తాను రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తమిళనాట ఉత్కంఠ

Submitted by lakshman on Wed, 09/20/2017 - 17:08
తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ అమితాసక్తికరంగా తయారయ్యాయి. గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి క్రమంగా ముదిరి  పరాకాష్ఠకు చేరింది. తమిళనాడులో టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన అన్నాడిఎంకే వర్గం ఎమ్మెల్యేలు 18 మందిని అనర్హులుగా ప్రకటిస్తూ...

పర్సంటేజీల భారతం

Submitted by lakshman on Mon, 09/18/2017 - 17:29

మామూలు మనుషులు జీవితకాలం కష్టపడినా సాధ్యం కాని సంపాదన.. కేవలం ఐదేళ్లలోనే కొంత మందికి సాధ్యం అవుతోంది. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులను వాళ్లు పోగేసుకుం టున్నారు. కేవలం ఐదు సంవత్సరాలు గడిస్తేనే వాళ్ల ఆస్తులు 500 శాతం కూడా పెరిగిపోతున్నాయి. ఇందు కోసం వాళ్ల దగ్గర ఉన్న మంత్రదండం ఏంటా అని చూస్తే... రాజకీయం! అవును.. ప్రజాప్రతినిధులుగా అందులో నూ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలుగా ఐదేళ్లు పనిచేసిన వారు పోగేసుకుంటున్న ఆస్తులు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అప్పటివరకు ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా అంతంతమాత్రంగానే ఉండేవాళ్లు కూడా ఆ తర్వాత ఒక్కసారిగా కుబేరులు అయిపోతున్నారు.

వీరు మచ్చలేని వారేనా?

Submitted by lakshman on Mon, 09/18/2017 - 16:32
మనలో పాపం చేయనివారు ఎవరో చెప్పండి అని ఓ కవి అన్నట్లు..దేశంలో మచ్చలేని నాయకుడెవరో చెప్పండి అంటే జనాలు నోరెళ్లబెట్టాల్సిందే..నిజానికి వారికున్నన్ని మచ్చలు, చేసిన అకృత్యాలు బహుశా మరెవరికీ..

నాయకత్వ లక్షణాలు దాచితే దాగవు

Submitted by lakshman on Sat, 09/16/2017 - 21:19

130 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల్లో... నాయకులుగా తయారవుతున్నది ఎంతమంది? ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉన్నది మన దేశమే. మరి వీరిలోంచి నాయుకులన్నవారు ఎవరూ పుట్టరా? నాయుకత్వం అంటే కేవలం రాజకీయాలు.. ఎన్నికలు.. ఓట్లు.. కుట్రలు.. కుతంత్రాలేనా? మహిళలు అసలు ఇందులోకి అడుగు పెట్టరా? నాయుకత్వ లక్షణాలు అనేవి ఒకరు నేర్పితే వచ్చేవి కావు.. అవి పుట్టుకతోనే రావాలి. అలాంటివి ఉన్నవారిని కూడా లక్ష్యాల పేరుతో తొక్కేస్తే.. ఇక ఆ నాయుకుడు ఎప్పటికీ పైకి రాడు. ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థిసంఘం ఎన్నికల బరిలో నిలిచిన ఆరుగురూ... అమ్మాయిలే! మరి వాళ్లెలా ముందుకొచ్చారు.. మనమెందుకు రాకూడదు..