kollywood

5 రోజులు.. 20 మిలియ‌న్లు

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 15:48

త‌మిళ‌నాట క‌థానాయ‌కుడు విజ‌య్ కుండే క్రేజే వేరు. మాస్‌లో విజ‌య్‌కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ఆయ‌న కొత్త చిత్రం టీజ‌ర్ మరోసారి రుజువు చేసింది. విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో రూపొందిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్' (తెలుగులో 'అదిరింది') టీజ‌ర్‌ని సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేశారు. 20 గంట‌ల్లోపే ఈ సినిమా టీజ‌ర్ 10 మిలియ‌న్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. మ‌రో నాలుగు రోజుల్లో ఇంకో 10 మిలియ‌న్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని.. మొత్తంగా 5 రోజుల్లో 20 మిలియ‌న్ల వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది.

క్యూ క‌డుతున్న విశాల్ సినిమాలు

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 16:20

పేరుకి తెలుగువాడైనా.. త‌మిళ చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు యువ క‌థానాయ‌కుడు విశాల్‌. 'పందెం కోడి', 'పొగ‌రు', 'పూజ' త‌దిత‌ర అనువాద‌ చిత్రాల‌తో తెలుగులోనూ మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న విశాల్‌.. అతి త్వ‌ర‌లో 'డిటెక్టివ్‌'గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. త‌మిళంలో విజ‌యం సాధించిన 'తుప్ప‌రివాల‌న్'కి ఇది అనువాద రూపం.

మీనా కూతురు మ‌ళ్లీ వ‌స్తోంది

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 14:19

నిన్న‌టి త‌రం అందాల న‌టి మీనా న‌ట ప్ర‌స్థానం బాల‌న‌టిగానే ప్రారంభ‌మైంద‌న్న సంగ‌తి తెలిసిందే. 'సిరివెన్నెల' త‌దిత‌ర చిత్రాల్లో బాల‌న‌టిగా గుర్తుండిపోయే పాత్ర‌లు చేసిన మీనా.. 'సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు' నుంచి హీరోయిన్‌గా ఫుల్ బిజీ అయ్యింది. పెళ్ల‌య్యాక సినిమాల‌ని త‌గ్గించుకున్న మీనా.. ఆ మ‌ధ్య 'దృశ్యం'లో వెంక‌టేష్ భార్య‌గా అల‌రించింది. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టిస్తున్న కొత్త చిత్రంలో ఆమె కీల‌క పాత్ర పోషిస్తోంది.

విక్ర‌మ్‌తో రిపీట్ చేస్తుందా?

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 13:31

త‌మ‌న్నాకి తెలుగులో కంటే త‌మిళంలో మంచి విజ‌యాలున్నాయి. సూర్య‌తో చేసిన 'అయ‌న్' (తెలుగులో 'వీడొక్క‌డే').. కార్తీతో చేసిన 'ప‌య్యా'(ఆవారా), 'సిరుత్తై'('విక్ర‌మార్కుడు' రీమేక్‌), 'తోళా' (ఊపిరి).. అజిత్‌తో చేసిన 'వీర‌మ్' (వీరుడొక్క‌డే).. ధ‌నుష్‌తో చేసిన 'ప‌డిక్కాద‌వ‌న్‌'.. విజ‌య్‌సేతుప‌తితో చేసిన 'ధ‌ర్మ‌దురై' చిత్రాలు విజ‌యం సాధించ‌డంతో పాటు త‌మ‌న్నాకి త‌మిళ‌నాట మంచి పేరుని తీసుకువ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేస్తున్న త‌మిళ చిత్రం 'స్కెచ్‌'. ఇందులో విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్నాడు. విక్ర‌మ్‌తో త‌మ‌న్నా జోడీ క‌ట్ట‌డం ఇదే తొలిసారి.

శ్రుతి స్థానంలో దిశా ప‌టాని?

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 21:43

'కాట‌మ‌రాయుడు' త‌ర్వాత మ‌రో తెలుగు చిత్రానికి సంతకం చేయ‌ని శ్రుతి హాస‌న్‌.. కొద్ది నెల‌ల క్రితం ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ని మిస్ చేసుకుంది. అదే 'సంఘ‌మిత్ర‌'. కుష్బూ భ‌ర్త సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా కోసం గుర్ర‌పు స్వారీ, క‌త్తిసాము విద్య‌ల్లో శిక్ష‌ణ కూడా తీసుకుంది శ్రుతి. త‌ర్వాత ఏమైందో ఏమో గానీ.. శ్రుతి ఆ చిత్రం నుంచి త‌ప్పుకుంది.

ద్విభాషా 'న‌య‌నం'

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 17:58

కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార ప్ర‌స్తుతం రెండు తెలుగు చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.  చిరంజీవి  'సైరా న‌ర‌సింహారెడ్డి'లోనూ , బాల‌కృష్ణ 102వ చిత్రంలోనూ ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు త‌మిళ చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. న‌య‌న‌తార తాజాగా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి సంత‌కం చేసింది. యాక్ష‌న్ సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్క‌నుంది.

కాజ‌ల్ 'పారిస్ పారిస్‌'

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 13:55

కాజ‌ల్‌కి ఈ ఏడాది బాగా క‌లిసొచ్చింది. 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాల రూపంలో తెలుగునాట మంచి విజ‌యాలు ద‌క్కాయి. మ‌రోవైపు ఆమె న‌టించిన భారీ బ‌డ్జెట్ త‌మిళ చిత్రం 'మెర్స‌ల్' విడుద‌ల‌కి సిద్ధమైంది. తెలుగులో 'అదిరింది' పేరుతో రానున్న ఈ చిత్రంలో విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేశారు. ఈ సినిమా విజ‌యంపై కాజ‌ల్ పూర్తి న‌మ్మ‌కంతో ఉంది.

లుక్ మార్చిన శింబు

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 12:55

'మ‌న్మ‌థ‌', 'వ‌ల్ల‌భ' చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు శింబు. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు టి.రాజేంద‌ర్ త‌న‌యుడు అయిన శింబు.. ఇటీవ‌లే 'స‌ర‌సుడు'గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇదిలా ఉంటే.. లెజండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం రూపొందించ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీలో ఓ ప్ర‌ధాన పాత్ర‌కి శింబు ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఈ పాత్ర కోసం బాగా మేకోవ‌ర్ అయ్యాడీ యువ క‌థానాయ‌కుడు.

అల్ల‌రి న‌రేష్ చిత్రానికి సీక్వెల్‌

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 20:40

'జంప్ జిలానీ' పేరుతో 2014లో 'అల్ల‌రి' న‌రేష్ హీరోగా ఓ సినిమా వ‌చ్చిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. న‌రేష్ ద్విపాత్రాభిన‌యం చేసిన ఆ సినిమా ఇక్క‌డ వ‌ర్క‌వుట్ కాలేదు కానీ.. ఆ సినిమాకి ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ అయిన 'క‌ల‌గ‌ల‌ప్పు' త‌మిళ‌నాట మంచి విజ‌యం సాధించింది.

సూర్యతో పోటీప‌డ‌నున్న విశాల్‌?

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 14:48

గ‌త వారం విడుద‌లైన త‌మిళ చిత్రం 'తుప్ప‌రివాల‌న్‌'తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు క‌థానాయ‌కుడు విశాల్‌. ప్ర‌స్తుతం ఆయ‌న‌ మూడు త‌మిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే 'ఇరుంబు తిరై', 'క‌రుప్పు రాజా వెల్లై రాజా', 'సండ‌ కోళి2'. వీటిలో 'ఇరుంబు తిరై' ముందుగా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ చిత్రంలో విశాల్‌కి జంట‌గా స‌మంత న‌టిస్తోంది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి చిత్ర‌మిదే కావ‌డం విశేషం. యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్‌.మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.