chennai

ప్రధాని మోడీకి కావేరి నిరసనల సెగలు

Submitted by arun on Thu, 04/12/2018 - 11:01

ప్రధాని మోడీకి కావేరీ నిరసనల సెగలు తాకాయి.. చెన్నైలో జరిగే డిఫెన్స్ ఎక్స్‌పోను ప్రారంభించేందుకు మోడీ వచ్చారు. అయితే, ఆయన రాక సందర్భంగా ఉదయం నుంచే చెన్నైలోని తమిళ సంస్థలు కావేరి డిమాండ్‌పై ప్రదర్శనలకు దిగాయి. నల్లజెండాలతో ప్రధాని మోడీకి నిరసన తెలిపేందుకు తమిళ గ్రూపులు ప్రయత్నించాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.. అలాగే, ఎయిర్ పోర్ట్‌తోపాటు పలు కీలక ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం

Submitted by arun on Sun, 02/18/2018 - 10:14

సరికొత్త ఆటిట్యూడ్ తో.. ఎనర్జిటిక్ లుక్ తో.. పాలనలో తన స్పెషల్ మార్క్ ను చూపిస్తూ.. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరుగాంచిన తెలంగాణ ఐటీ మినిస్టర్.. కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. మద్రాస్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ప్రత్యేకంగా ప్రసంగించిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర అభివృద్దితో పాటు.. భారత్ ను ప్రపంచం ఎలా గుర్తిస్తుందన్న అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. 

యుద్దంలోకి దిగితే గెలిచి తీరాల్సిందే

Submitted by arun on Tue, 12/26/2017 - 11:43

కలలో కూడా హీరో అవుతానని ఊహించలేదన్నారు ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులతో సమావేశమయ్యారు. సినిమా రంగంలోకి వస్తానని అనుకోలేదన్న తలైవా బాలచందర్‌ వెండితెరకు పరిచయం చేశారని చెప్పారు. యుద్దంలోకి దిగితే గెలిచి తీరాల్సిందేనని ఇండియన్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. తన పొలిటికల్‌ ఎంట్రీపై తనకంటే మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉందన్న రజనీ రాజకీయాలపై ఈ నెల 31న ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయాలు తనకు కొత్త కాదన్న తలైవా 1996 నుంచి పాలిటిక్స్‌ చూస్తున్నానని చెప్పారు. 

ఉత్కంఠ రేపుతున్న రజనీకాంత్ పొలిటికల్‌ ఎంట్రీ

Submitted by arun on Tue, 12/26/2017 - 09:51

తలైవా మనసులో మాట చెబుతాడా ? రాజకీయ ఆరంగేట్రంపై నిర్ణయం ప్రకటిస్తాడా ? రాజకీయాల్లోకి వస్తే ఏదైనా పార్టీలో చేరుతాడా ? లేదంటే సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికలకు వెళతాడా ? పాలిటిక్స్‌లోకి ఎంటరై...చరిత్ర సృష్టిస్తాడా ? లేదంటే చరిత్రలో కలిసిపోతాడా ? రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టీ నుంచి మరోసారి అభిమానులతో సమావేశానికి రెడీ అవుతున్నారు. 

కారు అనుకుని.. అంబులెన్సులో వెళ్లాడు

Submitted by arun on Mon, 12/18/2017 - 14:32

ఆడి కారుకి, అంబులెన్స్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ మ‌ద్యం మ‌త్తులో చెన్నైకి చెందిన ఓ వ్యాపార‌వేత్త‌కి అవి రెండూ ఒకేలా క‌నిపించాయి. దీంతో స్నేహితుడిని ఆస్పత్రిలో చేర్పించేందుకు ఆడి కారులో వచ్చి, తిరిగి వెళ్లేటప్పుడు అంబులెన్సు తీసుకుని వెళ్లాడు. దక్షిణ చెన్నైలోని పళవాక్కం ప్రాంతానికి చెందిన మిథిల్‌ అనే వ్యాపారవేత్త అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడిని చేర్పించేందుకు ఆదివారం అర్థరాత్రి 1.30 ప్రాంతంలో స్థానిక ఆస్పత్రికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పార్కింగ్‌ స్థలంలో ఉన్న అంబులెన్సును తన కారు అనుకుని అందులో ఇంటికి వెళ్లిపోయాడు. దాంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మైదానమైనా.. ఎయిర్‌పోర్ట్‌ అయినా ధోనీకి పూల పాన్పే!

Submitted by lakshman on Tue, 09/19/2017 - 16:53

చెన్నై: టీమిండియా గురించి మాట్లాడుకునే ప్రతీ సందర్భంలో ధోనీ గురించి ప్రస్తావన రాకుండా ఉండదనడంలో అతిశయోక్తి లేదేమో. అంతలా క్రికెట్ అభిమానుల మనసుని చొరగొన్న ధోనీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఈ స్థాయికి చేరుకున్నాడు. కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే గత నెల శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో ఎంపైర్ నిర్ణయం రావడం కాస్త ఆలస్యమైంది. అంతే.. ధోనీ ఒక్కసారిగా చిన్న పిల్లాడైపోయాడు. స్టేడియంలోనే.. నేల మీద కాసేపలా బోర్ల పడుకుని కునుకు తీశాడు. ఈ సీన్ చూసిన క్రికెట్ అభిమానులు ధోనీ సింప్లిసిటీని మెచ్చుకున్నారు.

శివవైష్ణవులు ఒకేచోట కొలువైన ఆలయం..చిదంబరం

Submitted by lakshman on Sat, 09/16/2017 - 21:44

తమిళనాడులోనిది చిదంబరం. తమిళ‌నాడు అంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. అందులోనూ చిదంబర ఆలయానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అంతా ఇంతా కాదు. తమిళ‌నాడులోని ద్రావిడ రీతుల్లో నిర్మించిన దేవాలయాల్లో చిదంబరం ఒక మణిపూస ఇది సముద్ర తీరానికి 11 కి. మి. దూరంలో మరియు చెన్నైకు దక్షిణంగా 250 కి. మి. దూరంలో కలదు. శివుడు తాండవం చేసిన ప్రదేశం .. ఆ తాండవ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకించి పోయిన ప్రదేశం ... తమిళ నాడులోని చిదంబరం. తమిళనాడులో శివాలయాలకు కొదువ లేదు. దీనికి కారణం అప్పటి పాండ్య, చోళ రాజులే. వారికి శివుని మీద ఎంత భక్తి ఉందో అక్కడి దేవాలయాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

వండలూర్‌ శ్రీలక్ష్మి కుబేరుడు

Submitted by lakshman on Sat, 09/16/2017 - 18:11
చెన్నై నగరంలో వండలూర్‌ సమీపంలోని రత్నమంగళం అనే గ్రామంలో నిర్మితౖమెన శ్రీలక్ష్మీ కుబేరుడి గుడి ఎంతో ప్రసిద్ధమై నది. ఈ గుడిని దర్శించుకుంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని ప్రతీతి. సంపదలకు దేవత శ్రీ మహాలక్ష్మి, కుబేరుడు వాటికి నిర్వాహకుడు. కుబేర పూజ అనేది స్థిరౖమెన సంపదలతో తులతూగడానికి ఈ ఇద్దరికీ చేసే పూజ.

అనిత కుటుంబానికి హీరో విజ‌య్ ప‌రామ‌ర్శ‌

Submitted by lakshman on Mon, 09/11/2017 - 18:41
క‌ష్టాల్లో ఉన్న వారిని ప‌రామ‌ర్శించి... వారికి ధైర్యం చెప్పే విష‌యంలో త‌మిళ సినీ ప్రముఖులు అంద‌రి కంటే ఒక‌డుగు ముందే ఉంటారు. త‌మిళ సినీ ప్ర‌ముఖుల ఉదార స్వ‌భావం ఇప్ప‌టికే...