AP Special Staus

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సెల్‌ టవర్‌ ఎక్కిన విజయ్‌ భాస్కర్‌

Submitted by arun on Sat, 08/11/2018 - 13:21

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో  ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు.  పట్టణానికి చెందిన  పెనుబోలు విజయ్‌భాస్కర్ అనే యువకుడు రూరల్ పోలీస్ స్టేషన్‌ సమీపంలోని టవర్ ఎక్కాడు. ప్రత్యేక హోదా కోసం తాను ఆత్మహత్యకు సిద్ధమైనట్టు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టవర్‌పైనున్న భాస్కర్‌ను కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం పోరాడినా ఫలితం దక్కలేదని  ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా రాకపోతే ఎలాగంటూ విజయ్‌ భాస్కర్ తన లేఖలో ప్రశ్నించారు. 

జైట్లీ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయి

Submitted by arun on Thu, 03/08/2018 - 10:28

కేంద్రంలో ఐదేళ్లు కలిసుంటామని చేసుకున్న ఒప్పందం నాలుగేళ్లకే కాలగమనంలో కలిసిపోయింది. కేంద్ర కేబినేట్ నుంచి బయటకు రావాలని టీడీపీ నిర్ణయించింది. రాష్ట్రానికి న్యాయం జరగడం లేదు కాబట్టే.. తీవ్ర నిర్ణయం తీసుకున్నామన్న ముఖ్యమంత్రి.. ఇవాళ తమ కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి బయటికి వచ్చినప్పటికీ ఎన్డీఏలో కొనసాగుతామని చెప్పారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం : రాహుల్‌గాంధీ

Submitted by arun on Tue, 03/06/2018 - 14:54

విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ స్ట్రీట్‌లో ఏపీ కాంగ్రెస్ నేతలు చేసిన నిరసన కార్యక్రమానికి రాహుల్ హాజరై వారికి మద్దతు తెలిపారు. ఏపీ డిమాండ్లపై రాహుల్ గాంధీ తొలి విడత పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా ట్వీట్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన అంశంలో ఆంధ్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.

ఏపీ అసెంబ్లీ ముందు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

Submitted by arun on Mon, 03/05/2018 - 16:38

అమరావతిలో టీడీపీ, బీజేపీ మధ్య ఫ్లెక్సీ రగడ చెలరేగింది. మోడీజీ? ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గోషా, ఆనాడు కాంగ్రెస్ పార్లమెంట్  తలుపులు మూసి ఆంధ్ర ప్రదేశ్ ను విభజించింది. ఇప్పుడు పార్లమెంట్ తలుపులు తీసి విభజన హామీలను తుంగలో తొక్కుతున్నారు, విభజన హామీలు అమలు చేయకపోతే తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు అంటూ అసెంబ్లీ సమీపంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. ఈ  ఫ్లెక్సీలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ బీజేపీ.. టీడీపీని మిత్రపక్షంగానే భావిస్తుందని, ఈ తరహా దుష్ప్రచారం తగదని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ హితవు చెప్పారు. 

వాట్‌ నెక్స్ట్‌

Submitted by arun on Thu, 02/15/2018 - 11:10

 విభజన హామీల సాధన కోసం తనదైన మార్గంలో ముందుకు వెళుతున్న పవన్‌ కల్యాణ్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టిన డెడ్‌ లైన్‌ నేటితో ముగియనుండటంతో, తదుపరి ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారన్న విషయమై ఆసక్తి నెలకొంది. ఏపీకి చేసిన సాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 15లోగా వివరణ ఇవ్వాలని గతంలో పవన్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది. 

రాజ్‌నాథ్ సింగ్‌తో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల భేటీ

Submitted by arun on Wed, 02/07/2018 - 11:18

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. విభజన హామీలను అమలు చేయాలని వారు హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీల డిమాండ్ పై రాజ్ నాథ్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఈ భేటీలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు ఆందోళన ఉపసంహరించుకున్నా, పట్టువీడకుండా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.