Uttarakhand

కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

Submitted by arun on Wed, 11/07/2018 - 11:40

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకున్నారు. దీపావళిని పురస్కరంచుకుని మోడీ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్ ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన మోడీ కొద్దిసేపు అక్కడి భక్తులతో ముచ్చటించారు. కేదార్ నాథ్ ఆలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మోడీ తిలకించారు. అలాగే కేదార్‌పురి పునర్నిర్మాణ పనులను సీమీక్షించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ కేదార్‌నాథ్‌ను సందర్శించడం ఇది మూడవ సారి. కేదార్ నాథ్ ఆలయ సందర్శన తర్వాత మోడీ పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులతో కలసి దీపావళి వేడుకలు జరుపుకుంటారు.

లోయలో పడిన బస్సు ; 10 మంది మృతి

Submitted by arun on Thu, 07/19/2018 - 12:14

ఉత్తరాఖండ్‌లోని తిహ్రీ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ప్రమాదవశాత్తూ 250 మీటర్ల లోతైన లోయలో పడటంతో 10 మంది మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు. ప్రయాణికులతో వస్తున్న బస్సు రిషీకేశ్ గంగోత్రి హైవేపై జారిపడి లోయలోకి దొర్లిపోయింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానిక యంత్రాంగం, పోలీసులు హుటాహుటిన చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 25 మందితో ప్రయాణం చేస్తున్నబస్సు ఉత్తరకాశీ నుంచి హరిద్వార్‌కు వెళుతోంది. క్షతగాత్రులను రిషికేష్‌లో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

లోయలో పడ్డ బస్సు: 48 మంది మృతి

Submitted by arun on Mon, 07/02/2018 - 10:06

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పారిగల్వార్‌ జిల్లా నానిదండ దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు  లోయలో పడింది. ఈ ప్రమాదంలో  48 మంది చనిపోయారు.మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రమాద విషయంతెలుసుకున్న వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది  అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను బస్సు నుంచి బయటకు తీశారు. ప్రమాద సమయలో బస్సులో 55 మంది ప్రయాణికులున్నారు. రామ్‌ నగర్‌ నుంచి బస్సు భోహన్‌కు బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది.  బస్సు లోయలో పడిన తర్వాత మరింత లోతుకు జారిపడటంతో మృతుల సంఖ్య పెరిగింది. 
 

మహేశ్‌ బాబుని కలసిన సీఎం

Submitted by arun on Mon, 06/18/2018 - 16:33

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ కలిశారు. మహేశ్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 25వ చిత్రం షూటింగ్‌ కోసం డెహ్రాడూన్‌ వెళ్లారు. షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన త్రివేంద్రసింగ్‌ మహేశ్‌ని మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల భరత్‌ అనే నేను చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన  సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈ సినిమా షూటింగ్ ఈ రోజు (సోమ‌వారం) మొద‌లైంది.

అల్పాహారం కోసం ఆ సీఎం చేసిన ఖర్చు అక్షరాలా అరకోటి...!

Submitted by arun on Tue, 02/06/2018 - 15:32

పదవిలోకి వచ్చి సంవత్సరం కూడా దాటకుండానే ఉత్తరాఖండ్ సీఎం ఫలహారాల ఖర్చు అరకోటి దాటిపోయింది. చిరుతిళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన పెట్టిన ఖర్చు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. గతేడాది మార్చి 18న ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. క్యాంపు ఆఫీస్‌కు వచ్చిన ప్రతి అతిథికి మర్యాద చేయడం ఈ సీఎంకు అలవాటు. తమ పనులు, అవసరాల కోసం వచ్చే ప్రతి వ్యక్తికి.. కాస్త వారి ఆకలిని తీర్చే మనసున్న మనిషి ఈ సీఎం.