Bypolls

ఉప ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌ : బీజేపీకి ఎదురుదెబ్బ

Submitted by arun on Thu, 05/31/2018 - 12:05

ఉప ఎన్నికల ఫలితాల్లో  బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. 4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. కర్ణాటకలో రాజరాజేశ్వరి నగర్ తో పాటు మేఘాలయలో అంపటి స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 3191 ఓట్ల మెజార్టీలో ప్రత్యర్ధిపై విజయం సాధించాడు. పంజాబ్ లో షాకోట్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అదే విధంగా జార్ఖండ్ లోని రెండు స్థానాల్లోను జెఎంఎం ముందంజలో ఉంది. 

నాలుగు లోక్‌సభ స్థానాల్లో మూడు చోట్ల బీజేపీకి ఎదురుగాలి..

Submitted by arun on Thu, 05/31/2018 - 11:17

4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి రౌండ్లలోనే బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లో కీలకంగా భావించిన కైరానా నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీ ముందంజలో ఉండగా, మహారాష్ట్రలోని పాల్ఘడ్‌లో విజయం బీజేపీని దోబుచులాడుతోంది. భండారా గోండియా నియోజక వర్గంలో బిజెపి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక నాగాలాండ్ లోక్ సభ స్థానంలో ఎన్.డి.పి.పి ఆధిక్యంలో కొనసాగుతోంది. కైరానా నియోజక వర్గంలో బిజెపికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం అయ్యాయి.

ఆదిలోనే చతికిలపడ్డ బీజేపీ... కైరానా కైవసం దిశగా ఆర్‌ఎల్డీ..

Submitted by arun on Thu, 05/31/2018 - 10:49

దేశవ్యాప్తంగా 4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి రౌండ్లలోనే బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లో కీలకంగా భావించిన కైరానాని యోజకవర్గంలో ఆర్‌ఎల్డీ ముందంజలో ఉండగా, మహారాష్ట్రలోని పాల్ఘడ్‌లో విజయం బీజేపీని దోబుచులాడుతోంది. 

బీజేపీ ఘోర పరాజయం!

Submitted by arun on Thu, 02/01/2018 - 18:10

రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ లో మూడు స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో కమలం వాడిపోగా, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో గెలిచి తన సత్తా చాటుకుంది. మందల్ గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, అజ్మీర్, అల్మార్ పార్లమెంటరీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ జయభేరి ఎగురవేసింది. ఇక బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నవోపార, ఉల్లుబెరియా అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోర వైఫల్యాన్ని ఎదురుచూడాల్సి వచ్చింది.