Trinamool Congress

దారుణం: మహిళా బీజేపీ నేతపై..

Submitted by arun on Mon, 10/01/2018 - 12:20

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు రెచ్చిపోయారు. బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై టీఎంసీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణ సంఘటన సెప్టెంబర్ 26న చోటు చేసుకోగా... ఆలస్యంగా వెలుగు చూసింది. సెప్టెంబర్‌ 26 న బీజేపీ రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో దిసర్కార్‌ అనే మహిళా నేత తమ కార్యకర్తలతో కోల్‌కతాకు 40 కిలోమీటర్లో దూరంలో ఉన్న బారసత్‌లో రైల్‌రోకో నిర్వహించే ప్రయత్నం చేశారు. దీనిని అడ్డుకునేందుకు వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఆ పంచాయతీ ఛీఫ్‌ అర్షదుజ్జమాన్‌ సదరు మహిళపై దాడి చేశాడు. కర్రలతో ఆమెను కొడుతూ ఒక తన్ను తన్ని పరుగెత్తించాడు. ఈ ఘటననంతా ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశారు.

బీజేపీకి బిగ్‌ షాక్‌

Submitted by arun on Thu, 02/01/2018 - 12:08

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీనిచ్చి ప్రధాని మోదీకి చెమటలు పట్టించిన కాంగ్రెస్ కీలకమైన రాజస్థాన్ రాష్ట్రంలోనూ తన సత్తా చాటుతోంది. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని ఝలక్‌ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని నౌపారా అసెంబ్లీ స్థానంలో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందగా.. బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక రాజస్థాన్‌లోని ఆల్వార్‌, అజ్మీర్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది.