bengaluru

రాహుల్ ద్రావిడ్కి ఓక"వాల్" అంకితం

Submitted by arun on Mon, 09/17/2018 - 16:25

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ముందు 10,000 ఇటుకలతో తయారు చేసిన ఒక గోడ ఉంది,  ఇది ద్రావిడ్ 10,000 పరుగులు దాటిన జ్ఞాపకార్థం మైలురాయి నిర్మించిన గోడ. సచిన్ టెండూల్కర్ ప్రారంభించిన ఈ గోడ మీద,  ద్రావిడ్ చేసిన మొత్తం పరుగులను ప్రదర్శిస్తూ ఒక ఎలక్ట్రానిక్ మీటర్ని కుడా అమర్చారు. శ్రీ.కో
 

రూ. 150కి కక్కుర్తి పడ్డాడు.. 800 కోట్లు మటాష్..

Submitted by arun on Tue, 07/24/2018 - 10:51

అతని దగ్గర వందల కోట్ల ఆస్తులున్నాయి. కానీ 150 సార్లు అడిగినా 150 రూపాయల లాకర్ అద్దె చెల్లించలేదు. దాని ఎఫెక్ట్ అతనిపై మామూలుగా పడలేదు. అక్రమంగా కూడబెట్టిన 8 వందల కోట్ల ఆస్తులు 8 గంటల్లోనే ఐటీ శాఖ అధికారులు పట్టుకెళ్లిపోయారు. బెంగళూరులోని ది బౌరింగ్ బ్యాడ్మింటన్ క్లబ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బెంగళూరులోని ది బౌరింగ్ క్లబ్‌ బ్యాడ్మింటన్ రూమ్ లాకర్స్ ఇప్పుడు ఇండియాలోనే హాట్ టాపిక్‌గా మారాయి. 3 లాకర్లలో 8 వందల కోట్లకు పైగా సంపద బయటపడటంతో అంతా అవాక్కయ్యారు.

విషాదంగా ముగిసిన పసికందు ‘కుమారస్వామి’ కథ

Submitted by arun on Tue, 06/19/2018 - 11:31

కర్ణాటకలో పసికందు చిన్నారి కుమారస్వామి కథ విషాదంగా ముగిసింది. బ్లడ్‌, బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌ సోకి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే చనిపోయిన 11 రోజుల తర్వాత ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని తెలియచేసింది. దీంతో పోలీసు సిబ్బంది, స్థానికుల్లో విషాదం నెలకొంది.

ఫ్రంట్‌ ఏర్పాటుపై వేగం పెంచిన కేసీఆర్‌‌

Submitted by arun on Fri, 04/13/2018 - 14:17

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక అడుగు వేశారు. ఇప్పటికే కోల్‌కతా వెళ్లి బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతో చర్చలు జరిపిన కేసీఆర్‌‌ ఇవాళ బెంగళూర్‌ వెళ్లి మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఆవశ్యకతను వివరించిన కేసీఆర్‌ లక్ష్యాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే ప్రస్తుత దేశ రాజకీయాలపై దేవెగౌడ, కేసీఆర్‌ మాట్లాడుకున్నారు. ఇక కేసీఆర్‌‌ వెంట సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్, ఎంపీలు వినోద్‌, సంతోష్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. 

రోజువారీ కూలీ రాజప్ప... సంపాదన చూస్తే కట్టప్ప కూడా షాక్ అవ్వాల్సిందే..!

Submitted by arun on Wed, 01/31/2018 - 16:33

పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ రోజువారీ కూలీ... గుట్టుచప్పుడు కాకుండా కోట్లకు పడగలెత్తిన వైనమిది... ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో తన వార్షికాదాయం రూ.40 లక్షలుగా పేర్కొనడంతో అధికారులే షాక్ అయ్యారు. అయితే అతడిపై  పోలీసులు నిఘా పెట్టడంతో అసలు విషయం కాస్తా బయటపడింది. వివరాల్లోకి వెళితే...దక్షిణ కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్‌ జిల్లాకు చెందిన పేద రాజప్ప చాలా ఏళ్ల కిందటే బెంగళూరు నగరానికి వలస వచ్చాడు. భవన నిర్మాణంలో రోజు కూలీగా పనిచేస్తూ పొట్టపోసుకుంటూ కాలం గడిపేవాడు. రాజప్ప సొంత ఊరు గంజాయి సాగుకు చాలా ఫేమస్‌. ఇంటికి వెళ్లినప్పుడల్లా సరదాగా కొంత గంజాను తీసుకొచ్చి తక్కువ ధరకే తోటి కూలీలకు ఇచ్చేవాడు.