Harish Rao

రేవంత్‌ వర్సెస్‌ హరీష్‌...కోస్గిలో టెన్షన్ టెన్షన్

Submitted by arun on Sat, 08/04/2018 - 10:58

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. కోస్గి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బస్‌డిపో‌కు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. డిపోకు కావాల్సిన భూమిని తానే ఇచ్చానని రేవంత్‌రెడ్డి ఎన్నో సార్లు చెప్పుకున్నారు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య పోరుగా మారింది. కోస్గిలో ఏం జరుగుతుందన్న దానిపై టెన్షన్‌ మొదలైంది.

సీఎం కేసీఆర్ సోషల్ ఇంజినీర్: హరీష్ రావు

Submitted by arun on Thu, 06/07/2018 - 14:30

గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా నాలుగేళ్లలో పూర్తి చేయించారన్నారు  భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు. ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన హరీశ్‌రావు..ముఖ్యమంత్రి కేసీఆర్ సోషనల్ ఇంజినీర్‌, సీఎం కేసీఆర్‌కు వ్యవసాయంపై మంచి అవగాహన ఉందన్నారు. కరువు జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, 6లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరందించామన్నారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ 50వేల ఎకరాలకు కూడా నీరందించలేకపోయిందన్నారు.

మెదక్‌ నుంచి రంగంలోకి హరీష్‌రావు‌

Submitted by arun on Tue, 04/03/2018 - 11:34

వచ్చే ఎన్నికలపై కన్నేసిన తెలంగాణ సీఎం... బహుముఖ వ్యూహాలకు తెరలేపారు. హస్తినలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని అంచనా వేస్తున్నారు కేసీఆర్‌.  ఎలాగైనా మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఢిల్లీ చక్రం తిప్పాలన్నది ఆయన ఆలోచన. అందుకు అనుగుణంగా పక్కాగా పావులు కదుపుతున్నారు. 

కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్

Submitted by arun on Mon, 04/02/2018 - 15:43

కాగ్ నివేదిక కాంగ్రెస్‌ నేతలు...కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాగ్‌ నివేదికకు ప్రామాణికత లేదని ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ పార్లమెంట్‌లో చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్పుల విషయంలో తప్పు పట్టని కాగ్‌....ఇతర రాష్ట్రాల్లో మాత్రమే తప్పు పడుతోందన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి పని చేసినపుడు....కాగ్‌ అనేక తప్పులను ఎత్తిచూపిందన్నారు. టెక్నికల్ అంశాల్లో మాత్రమే కొన్ని సూచనలు చేసిందని హరీశ్‌రావు గుర్తు చేశారు.

జీఎంఆర్ సంస్థకు హరీష్ రావు సీరియస్ వార్నింగ్..!

Submitted by arun on Mon, 04/02/2018 - 11:32

మంత్రి హరీష్ రావుకు కోపం వచ్చింది. మెదక్ జిల్లా తుప్రాన్ మండలం నాగులపల్లి వద్ద వెంటనే వంతెన పనులు చేపట్టకపోతే అక్కడకు దగ్గరలో ఉన్న జీఎమ్ ఆర్ టోల్ గేట్ ను ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. మనోహరబాద్‌, కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వెళ్లిన హరీశ్‌కు ఎంపీ ప్రభాకరరెడ్డి నాగులపల్లి వంతెన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. దాంతో ఈనెల 15 లోపు వంతెన పనులు చేపట్టక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 

చూశారా.. హరీష్ ను తండ్రీకొడుకులు పొగిడేస్తున్నారు

Submitted by lakshman on Thu, 03/15/2018 - 17:42

తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆరే. కానీ.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరూ.. అన్న ప్రశ్న వస్తే మాత్రం కేటీఆర్ అన్న సమాధానం ఠక్కున రావడమే కాదు. ఆ వెంటనే మరి హరీష్ రావు.. అన్న సమాధానం లేని ప్రశ్న కూడా ఉదయిస్తూ ఉంటుంది. అందుకే.. హరీష్ కాంగ్రెస్ లోకి చేరతారని ఓసారి.. బీజేపీలోకి వెళ్తారని మరోసారి కూడా గుసగుసలు వినిపించాయి. తర్వాత.. తన పుట్టుకా చావూ టీఆర్ఎస్ లోనే అని హరీష్ చెప్పడంతో.. ప్రస్తుతానికి ఆ చర్చకు తాత్కాలిక ఫుల్ స్టాప్ పడింది.

వీడియోపుటేజీతో కోమ‌టిరెడ్డిపై చ‌ర్య‌లు

Submitted by arun on Mon, 03/12/2018 - 12:15

అసెంబ్లీలో ప్రతిపక్షాల వైఖరిని దుయ్యబట్టారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు. సీఎం ముందుగానే కాంగ్రెస్‌ నేతల వ్యహహరాన్ని అంచనా వేసి తమను అప్రమత్తం చేశారన్నారు. కాంగ్రెస్‌ సభ్యులకు సభలో కూర్చొనే ఉద్దేశం లేకే... కావాలని గొడవ సృష్టించారన్నారు. స్వామిగౌడ్‌ కంటి గాయం, కోమటిరెడ్డి దురుసు ప్రవర్తనపై వీడియో ఫుటేజ్‌ని పరిశీలించి.... తీవ్రతను బట్టి... కోమటిరెడ్డిపై చర్య ఉంటుందన్నారు హరీష్‌రావు. 

కాంగ్రెస్, బీజేపీ కొత్త టార్గెట్.. హరీష్ రావు!

Submitted by arun on Mon, 03/12/2018 - 11:50

ఎవరు ఒప్పుకున్నా.. ఎవరు ఒప్పుకోకున్నా.. ఇది మాత్రం కచ్చితంగా నిజం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కానీ.. ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ ను కానీ.. రాజకీయంగా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. టీఆర్ఎస్ లో కూడా.. ఇద్దరి ఆధిపత్యం బాగా నడుస్తోంది. ఢిల్లీ పర్యటనలు కావొచ్చు.. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు కావొచ్చు.. కేసీఆర్ అడుగుజాడల్లో కేటీఆర్ ముద్ర పడేలా.. కసరత్తు జరుగుతున్న మాట వాస్తవం.

సిద్ధిపేట నుంచి కేసీఆర్.. హుస్నాబాద్ నుంచి హరీష్??

Submitted by arun on Mon, 03/12/2018 - 11:40

టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు.. ఊహలకు అందకుండా పరుగులు పెడుతున్నాయి. నిన్నా మొన్నటిదాకా.. ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు అయిన సీనియర్ నాయకుడు హరీష్ రావు.. 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వెళ్లబోతున్నట్టుగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం సంచలనమైంది. ఆఖరికి.. స్వయంగా హరీష్ రావే.. మీడియా ముందుకు వచ్చి.. తన పుట్టుకా.. చావూ టీఆర్ఎస్ తోనే అని చెప్పుకోవాల్సి వచ్చింది.

వైఎస్ తో హ‌రీష్ భేటీ - గుట్టుర‌ట్టు చేసిన రేవంత్

Submitted by arun on Sat, 03/10/2018 - 17:23

చచ్చేదాకా టీఆర్ఎస్ లో ఉంటానన్న మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పార్టీ మారుతానని వైఎస్ ను హరీశ్ రావు  కలిసింది నిజం కాదా,  ఈటెలను ఫ్లోర్ లీడర్ చేయడంతో పార్టీ మారేందుకు హరీశ్ రావు సిద్ధపడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అమిత్ షాతో హరీశ్ రావు భేటీ అయింది నిజం కాదా అని నిలదీశారు. కేటీఆర్ ను సీఎంను చేస్తే టీఆర్ఎస్ చీలిపోతుంది అని, చీలిక వర్గానికి హరీశ్ లేదా ఈటెల నాయకత్వం వహిస్తారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. బస్సు యాత్రలో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పక... టీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు అని చెప్పారు.