National

ఫార్మా రతన్ -2017 అవార్డు అందుకున్న తెలుగు వ్యక్తి

Submitted by admin on Fri, 10/19/2018 - 23:24

భారతదేశంలోని ఫార్మసీ రంగంలో విశేష సేవలు అందించే వారికి అందించే అవార్డులలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేవాటిలో ఒకటైన ఫార్మా రతన్ అవార్డు - 2017 ను యువ సాధక విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్నపురెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి గారు దక్కించుకున్నారు. ఈ అవార్డును ఢిల్లీ మంత్రివర్యులు శ్రీ ఉద్దీత్ రాజ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. ఫార్మసీ రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను, వృత్తి అభివృద్ధికి తోడ్పాటునూ గుర్తించి ఈ అవార్డును బహుకరించినట్లు ఆర్.డి.ఎమ్ సంస్థ వ్యవస్థాపకులు పేర్కొన్నారు.

ఘోర రైలు ప్రమాదం.. 50 మందిపైగా మృతి

Submitted by nanireddy on Fri, 10/19/2018 - 20:11

పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్‌ దసరా వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50 పైగా మృతి చెందినట్టు సమాచారం. రావణ దహనం సందర్భంగా పట్టాలపై నిలబడి ఉన్న వారిపై రైలు దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నవారందరినీ ఖాళీ చేయించారు, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్నవెంటనే ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, పంజాబ్ ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

శబరిమల ఆలయాన్ని శాశ్వతంగా మూసేస్తాం : ప్రధాన అర్చకులు హెచ్చరిక

Submitted by nanireddy on Fri, 10/19/2018 - 20:00

గతకొద్దీ రోజులుగా అత్యంత వివాదాస్పదంగా మారిన శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశం అంశాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సీరియస్ తీసుకున్నారు. ఒకవేళ అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే, ఆలయానికి తాళం వేస్తామని, తాళంచెవులను అప్పగించి వెళ్లిపోతానని ప్రధాన అర్చకులు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదు అని, భక్తుల వైపున తాను నిలబడనున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంలో తన వద్ద ఎటువంటి ఆప్షన్ లేదన్నారు. ప్రధాన అర్చకుల హెచ్చరికతో వెనుదిరిగారు మహిళలు. 

స్వల్పంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు

Submitted by nanireddy on Fri, 10/19/2018 - 15:07

ఇటీవల పెరుగుతూ వచ్చిన చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 10 పైసలు తగ్గింది. దీంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ 82రూపాయల 38పైసలు, డీజిల్‌ 75రూపాయల 48పైసలకు చేరింది. ముంబయిలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ 87రూపాయల 74పైసలు, డీజిల్‌  79రూపాయల 13పైసలుగా కొనసాగుతోంది.

పోస్టుమార్టం కోసం కూతురు మృతదేహంతో 8కిమీ. నడిచిన తండ్రి

Submitted by nanireddy on Fri, 10/19/2018 - 04:46

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాను వణికించిన తితలీ తుఫాన్ ఒడిశా లోని గజపతి జిల్లాను తీవ్రంగా కుదిపేసింది. ఈ జిల్లాలో తుఫాను దాటికి సర్వం కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో అతంక్‌పూర్‌ గ్రామానికి చెందిన ముకుంద్ కుటుంబం కూడా ఒకటి. నాలుగురోజుల క్రితం ముకుంద్ తన పదకొండేళ్ల కూతురు బబిత కనిపించకుండా పోయింది. అయితే ఆమె గ్రామానికి సమీపంలో కొండచరియలు విరిగి మృతిచెందినట్టు తెలిసింది. దాంతో కూతురు మృతితో కన్నీరు మున్నీరైనా ముకుంద్ తుఫాను ప్రభావంతో సర్వం కోల్పోయాడు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఫొటోలు తీసుకుని... పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని హాస్పిటల్‌కు తీసుకురావాలని చెప్పి వెళ్లిపోయారు.

సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్ఎస్ఎస్

Submitted by nanireddy on Thu, 10/18/2018 - 17:54

త్వరలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఆర్ఎస్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో 78 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వొద్దంటూ బీజేపీకి సూచించింది. అంతేకాదు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను బుధిని నుంచి కాకుండా గోవిందపురా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనీ సలహా ఇచ్చింది. బీజేపీకి పెట్టని కోటగా గోవిందపురా నియోజకవర్గం ఉంది. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్.. 1980 నుంచి మొత్తం 8 సార్లు ఇక్కడి నుంచే గెలిచారు.

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

Submitted by nanireddy on Thu, 10/18/2018 - 11:21

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గోద్రా సమీపంలో రైల్వే గేటును దాటుతున్న ఓ ట్రక్కుని త్రివేండ్రం నుంచి వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో ట్రక్కు డ్రైవర్‌ అక్కడికక్కడే చనిపోగా.. వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. కాగా ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తే అన్నట్టు తెలుస్తోంది. ట్రక్‌ డ్రైవర్‌ గేటును గమనించకుండా ముందుకు వెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనతో గోద్రా రత్లాం రూట్‌లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

‘మీ టూ’ ఎఫెక్ట్.. కాంగ్రెస్ కీలక నేత రాజీనామా

Submitted by nanireddy on Wed, 10/17/2018 - 15:33

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీ టూ ఉద్యమం… అన్ని రంగాలనూ కుదిపేస్తోంది. హాలీవుడ్‌ నుంచి మొదలైన ఉద్యమం బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమాలకే పరిమిమతమనుకున్న ఈ వ్యవహారం.. రాజకీయాలనూ తాకింది. చత్తీస్‌ గఢ్‌కు చెందిన ఒక మహిళా కాంగ్రెస్‌ కార్యకర్త.. తన పట్ల NSUI జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్‌ అసభ్యంగా ప్రవర్తించారని గతంలో ఆరోపణలు చేసింది. పైగా ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో దాంతో ఫిరోజ్‌ ఖాన్‌ తన పదవికి రాజీనా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదించారు.

తుఫాన్‌లో పాప జననం...తిత్లీగా నామకరణం

Submitted by arun on Wed, 10/17/2018 - 12:50

ఓడిశాను వణికించిన తిత్లీ తుపాన్ ఓ కుటుంబానికి తీపి గుర్తు మిగిల్చిన అరుదైన ఘటన మిడ్నాపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.  ‘తిత్లీ’ తుపాన్ ఒడిశా రాష్ట్రంలోని మిడ్నాపూర్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. కానీ  ఈ నెల 12న హోరు వీస్తున్న గాలిలో, జోరు వానలో మిడ్నాపూర్ లోని తుపాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన పాఠశాల ఉపాధ్యాయని అయిన 31 ఏళ్ల ఇషితాదాస్‌కు ఓ బాలిక జన్మించింది. ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఫీల్డు ఆఫీసరుగా పనిచేస్తున్న ప్రదీప్ టమయ్, ఇషితాదాస్‌ల వివాహం 2011లో జరిగింది. ఇషితాదాస్ గర్భం దాల్చాక తుపాన్‌లో జోరు వాన కురుస్తుండగానే బాలికకు జన్మనిచ్చింది.

Tags