National

పెద్దమనసు చాటుకున్నా సూపర్ స్టార్ రజినీ..

Submitted by chandram on Tue, 11/20/2018 - 17:24

గత కొద్దిరోజులుగా ‘గజ’ తుఫాను తమిళనాడులోని దక్షిణ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. కాగా గజ తుఫాను బాధితులను ఆదుకునేందుకు ప్రముఖసినీ తారాలు సైతం మేమున్నమంటూ ముందుకు వస్తున్నారు. తాజాగా సూర్యకుటుంబం, జీవి ప్రకాశ్ తదితరులు తమ వంతు బాధ్యతగా సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ముందుకొచ్చారు. తుఫాను బాథితులకు నేనున్నఅంటు సాయంకింద రూ. 50 లక్షల రూపాయలు ప్రకటించి రజినీ తన పెద్దమనసును మరోసారి నిరూపించుకున్నాడు. రజీనితోపాటు దర్శకుడు శంకర్ కూడా రూ.10లక్షల రూపాయలు ప్రకటించారు. 

బీజేపీ ఎమ్మెల్యేకు చెప్పుల దండతో స్వాగతం..

Submitted by arun on Tue, 11/20/2018 - 16:48

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం ఎదురైంది. గ్రామస్థుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునేందుకు వంగిన బీజేపీ అభ్యర్థి మెడలో ఓ వ్యక్తి చెప్పుల దండ వేసి అవమానపరిచాడు. దీంతో వెంటనే సదరు ఎమ్మెల్యేతోపాటు పక్కనే మరో కార్యకర్త కూడా ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నగాడాలో జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ షెకావత్‌కు ఎదురైన ఈ చేదు అనుభవం ఆ పార్టీ నేతలను షాక్‌కు గురి చేసింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై కారప్పొడితో దాడి!

Submitted by arun on Tue, 11/20/2018 - 16:08

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. సచివాలయంలో ఉన్న కేజ్రీవాల్‌పై కారంపోడితో ఓ యువకుడు దాడి చేశారు. కేజ్రీవాల్ కళ్లలో కారం పొడి పడటంతో హుటాహూటిన భద్రతా సిబ్బంది స్పందించారు. దాడి చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనీల్ శర్మగా గుర్తించారు. దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆప్‌ దేశ రాజధానిలో సీఎంకు కూడా భద్రత లేకుండా పోయిందంటూ విమర్శించారు.  

Image result for Chilli Powder Thrown At Arvind Kejriwal Near

కేంద్రమంత్రి సుష్మా స్వ‌రాజ్‌ సంచలన నిర్ణయం..

Submitted by chandram on Tue, 11/20/2018 - 15:22

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై సంచలన ప్రకటన చేసింది. వచ్చేఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తను పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తను ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రధానంగా తన ఆరోగ్యసమస్యల దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుష్మా తెలిపింది. కాగా ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో అనే అంశాన్ని ఇక పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపింది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీచేయలేను అని పార్టీకి కూడా వెల్లడించనని సుష్మా తెలిపారు. 

కట్నం కోసం ఓ కసాయి భర్త..భార్య నాలుక కోసేసి..

Submitted by arun on Tue, 11/20/2018 - 13:32

కట్నం కోసం కట్టుకున్న భార్య నాలుకను కోసేశాడు ఓ ప్రబుద్ధుడు. 10 రోజుల క్రితం జరిగిన ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కాన్పూర్‌ జిల్లా బర్రా ప్రాంతానికి చెందిన  ఆకాష్ అనే వ్యక్తికి, అతని భార్యకు మధ్య ఈనెల 6న గొడవ జరిగింది. భార్య ఇంటి నుంచి కట్నం కోసం డిమాండ్ చేస్తుండగా, ఆమె అతనితో వాదించింది. వివాదం పెద్దదిగా మారింది. భార్య తనకు ఎదురుసమాధానం చెబుతుండడంతో తట్టుకోలేకపోయిన ఆకాష్ ఆమె నాలుకను కత్తితో కోసేశాడు. విషయం బయటకు వెళ్లకుండా భార్యను 10 రోజులు ఇంట్లోనే నిర్భంధించాడు. ఇంట్లో చిత్ర హింసలు భరించిన ఆమె తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేసింది.

తమిళనాడుకు ముంచుకొస్తున్న మరో ముప్పు

Submitted by arun on Tue, 11/20/2018 - 13:15

‘గజ’ తుపాను గండం నుంచి బయటపడక ముందే తమిళనాడుకు  మరో ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశ మున్నట్టు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతికి మారిందని, ఇది మరింత స్థిరపడనుందని చెన్నై వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో వాయు గుండంగా మారి బలపడే అవకాశముందన్నారు. ఈ కారణంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తదితర సముద్ర తీర జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశముందని సూచించారు. వచ్చే 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశమున్నందున జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించారు. 

ఆర్మీ డిపోలో పేలుడు.. ఆరుగురు మృతి

Submitted by arun on Tue, 11/20/2018 - 12:10

మహారాష్ట్ర వార్ధాలోని పుల్గాన్ ఆర్మీ డిపోలో ఇవాళ ఉదయం పేలుడు సంభవించింది. గడువు తీరిన మందు గుండు సామాగ్రిని నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
 

సీబీఐ కేసులో మరో మలుపు

Submitted by arun on Tue, 11/20/2018 - 12:04

సీబీఐలో అంతఃకలహం కేసు మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర గనులు, బొగ్గు శాఖల సహాయ మంత్రి హరిభాయ్‌ ప్రతిభాయ్‌ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, కేంద్ర ప్రధాన విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్‌ చంద్ర, తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డిలపై సీబీఐలో డీఐజీగా ఉన్న మనీశ్‌ కుమార్‌ సిన్హా అనే ఐపీఎస్‌ అధికారి నిన్న తీవ్ర ఆరోపణలు చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తుది దశ పోలింగ్‌

Submitted by arun on Tue, 11/20/2018 - 10:04

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు మలిదశ పోలింగ్‌ జరుగుతుంది. 72 నియోజకవర్గాల్లో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన  పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తం లక్ష మందికిపైగా భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. శాసనసభ స్పీకర్‌, తొమ్మిది మంది మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు బూపేష్‌ భగేల్‌ తదితరుల భవితవ్యం నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు 72 నియోజకవర్గాల్లోనూ పోటీచేస్తున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 18 నియోజకవర్గాల్లో ఈ నెల 12 తొలిదశ పోలింగ్‌ జరిగింది. వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఫ్లిప్‌కార్ట్ మరో బంపర్ ఆఫర్.. రూ.99కే ఫోన్లు..

Submitted by nanireddy on Tue, 11/20/2018 - 09:45

 ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు మరో బంపర్ . మొబైల్ బొనాంజా సేల్‌ పేరుతో వినియోగదారులకు మరో స్పెషల్‌ సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా శాంసంగ్‌, షావోమీ, రియల్‌మీ, నోకియా, గూగుల్, ఆసుస్ లాంటి ఫోన్లపై భారీ ఆఫర్లను వెల్లడించింది. దీంతోపాటు రూ.99 కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తోంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. నవంబర్ 19 అర్థరాత్రి నుంచి ప్రారంభమై ఈ సేల్ 22వరకు కొనసాగనుంది.