Telangana

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందడి

Submitted by nanireddy on Sun, 09/23/2018 - 07:10

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందడి మొదలయింది. నిమజ్జనానికి ఆపద్ధర్మ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రాత్తలు తీసుకుంటున్నారు. కాగా ఇవాళ(ఆదివారం) ఆఖరు కావడంతో ఖైరతాబాద్ భారీ గణేషుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నేడు(ఆదివారం) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం ఢిల్లీ నుంచి వస్తున్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 35 చెరువుల దగ్గర 117 క్రేన్లను ఏర్పాటు చేశారు. మరో 96 మొబైల్ క్రేన్‌లను కూడా సిద్ధం చేశారు.

గెలుపు గుర్రాలకే టికెట్లిస్తాం: ఉత్తమ్

Submitted by arun on Sat, 09/22/2018 - 17:33

ఆశావహుల నుంచి ధరఖాస్తులకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ విధించిన గడువు ఇవాళ్టితో ముగిసింది. ఇవాళ్టి వరకు మొత్తం వెయ్యీ 76 ధరఖాస్తులు వచ్చాయి. ఇవాళ్టినుంచి వాటిని పరిశీలించనున్నారు. ఆశావహుల సామాజిక, ఆర్థిక, స్థానిక బలాబలాలపై అంచనా వేస్తున్నారు. నేటి నుంచి అభ్యర్థుల స్క్రూటినీ చేయనున్నారు. నియోజకవర్గానికి ముగ్గురిని ఎంపిక చేసి.. స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నట్లు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ స్పష్టం చేశారు. సర్వే ఫలితాల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీట్ల సర్దుబాటు తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నామని ఉత్తమ్ తెలిపారు.
 

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Submitted by arun on Sat, 09/22/2018 - 17:24

ఆదిలాబాద్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న అనూష అనే విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్న అనూష కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ ఆమె వద్ద లభించిన సూసైడ్‌నోట్‌ ద్వారా తెలుస్తోంది. అనూష స్వస్థలం సిద్దిపేట జిల్లా మండపల్లి అని కాలేజీ యాజమాన్యం తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యకు మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.
 

విపక్షాలకు అస్త్రాలుగా మారిన హరీశ్ వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 09/22/2018 - 17:06

నిన్న ఇబ్రహీంపూర్‌ సభలో పాల్గొన్న హరీష్‌రావు  ప్రజల ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల్లో నుంచి వైదొలగాలని అన్నారు. ఇప్పుడా వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. హరీష్‌ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ టీఆర్ఎస్‌పై దాడి చేస్తున్నాయి. హరీష్‌ వాఖ్యలతో టీఆర్ఎస్‌లో ఇంటిపోరు మొదలైందంటూ రఘునందన్‌రావు లాంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఇబ్రహీంపూర్‌లో మాట్లాడిన హరీష్‌రావు స్ధానికుల స్పందన చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి ఆప్యాయత, అనురాగాల మధ్యే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందంటూ వ్యా‌ఖ్యానించారు.

హరీశ్‌రావుకు పొమ్మనలేక పొగబెడుతున్నారు: రఘునందన్ రావు

Submitted by arun on Sat, 09/22/2018 - 16:05

బీజేపీ నేత రఘునందన్ రావు అపధర్మ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో ఇంటి పోరు ప్రారంభమైందన్న ఆయన  హరీష్‌రావును పార్టీ నుంచి పంపలేక పొగబెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 105 మంది జాబితాలో తొలి మార్పు సిద్ధిపేటలోనే జరుగుతుందన్నారు.  సిద్దిపేట నుంచి కేసీఆర్‌ పోటీ చేయాలని భావిన్నాడని ఆయన అన్నారు. కారు నాలుగు టైర్లలో ఒకటి పంక్ఛర్ అయిందన్న రఘునందన్ రావు స్టెప్నీగా ఉంటాడనే సంతోష్‌ను రాజ్యసభకు పంపారంటూ వ్యాఖ్యానించారు.  

సీఎం కేసీఆర్‌కు గుడి కట్టిన కానిస్టేబుల్

Submitted by arun on Sat, 09/22/2018 - 14:11

సీఎం కేసీఆర్‌పై అభిమానంతో ఏకంగా ఆయనకు గుడినే కట్టేశారు నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన గోగుల శ్రీనివాస్‌. కేసీఆర్‌ అంటే తమకెంతో అభిమానమని చెబుతున్నారు శ్రీనివాస్‌. కానిస్టేబుల్‌గా పనిచేసే శ్రీనివాస్‌ సొంత ఖర్చులతో తన అభిమాన నేతకు గుడికట్టించాడు. సుమారు రెండు లక్షల రూపాయల ఖర్చుతో తన ఇంటి పక్కనే కేసీఆర్ కు గుడిని నిర్మించాడు. ఖమ్మం జిల్లా కల్లూరులో 25 వేలతో కేసీఆర్‌ విగ్రహాన్ని తయారు చేయించాడు శ్రీనివాస్. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు.. అన్ని వర్గాలకూ మేలు చేస్తున్నాయని చెప్పాడు.

శ్రీకాంత్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేశాడంటున్న భార్య శ్రీహర్ష!

Submitted by arun on Sat, 09/22/2018 - 12:19

భార్యను ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లిపోవడం, ఆమె చేత అక్రమ కేసులు పెట్టించడంతో పాతబస్తీకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతని భార్య శ్రీహర్ష శ్రీకాంత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. మీడియాకు ఓ ఆడియోను విడుదల చేసిన శ్రీహర్ష తనను మోసం చేసి శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడని, ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన శ్రీకాంత్ ఇంటికి పిలిచి మత్తు మందు ఇచ్చి నగ్న ఫొటోలు తీశాడని ఆరోపించింది. ఆ నగ్న ఫొటోలతో నిత్యం బెదిరించేవాడని ఆమె ఆరోపించింది. అందుకే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెబుతోంది.

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి దొంగల బీభత్సం

Submitted by arun on Sat, 09/22/2018 - 11:05

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దారిదోపిడీ జరిగింది. రైలు సిగ్నల్స్‌ను కట్ చేసిన దోపిడీ దొంగలు  ప్రయణికులను బెదిరించి వారి నుంచి నగలు, నగదును దోచుకెళ్లారు. తెల్లవారుజమున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.  ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో దోపిడీ పాల్పడిన  దొంగలు వారి నుంచి భారీగా బంగారు నగలను దోచుకున్నారు. వీరిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన వారిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కన్నతల్లిలాంటి టీడీపీని వీడటానికి కారణం ఇదే: ఎర్రబెల్లి

Submitted by arun on Sat, 09/22/2018 - 11:01

నియోజకవర్గ ప్రజల అభవృద్ధి కోసమే నేను కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరానని తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే మాటలు నమ్మి, ఓటును వృథా చేసుకోవద్దని ప్రజలను కోరారు. పెర్కవేడు, మైలారం, తిర్మలాయపల్లి గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ...నాలుగున్నరేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకం నాకుందని ఎర్రబెల్లి అన్నారు.

షోకాజ్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ ఎదురుదాడి

Submitted by arun on Sat, 09/22/2018 - 10:44

షోకాజ్ నోటీసులు జారీ చేసినా  కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటి రాజగోపాల్ ‌రెడ్డి వెనక్కు తగ్గలేదు.  అన్ని ఆలోచించే మాట్లాడానంటూ ప్రకటించిన ఆయన తన వ్యాఖ్యలను పాజిటీవ్‌గా తీసుకోవాలంటూ అధిష్టానానికి సూచించారు. ఇదే సమయంలో టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఒకే కుటుంబానికి చెందిన నేతలు వేర్వేరు పార్టీలో ఉంటారంటూ వ్యాఖ్యానించి కొత్త ఊహాగానాలకు తెరలేపారు.