KL Rahul

కేఎల్‌ రాహుల్‌కి యువీ సారీ!

Submitted by arun on Sat, 03/24/2018 - 17:05

ఐపీఎల్‌ కోసం భారత స్టార్‌ ఆటగాళ్లు సరికొత్తగా కనిపించేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ, మహేంద్ర సింగ్‌ ధోనీ కొత్త హెయిర్‌ స్టైల్‌తో ఐపీఎల్‌కు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్‌ ఆటగాడు వచ్చి చేరాడు. అతడే సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన యువీ.. ఈ క్రమంలోనే మరో క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌కు సారీ చెప్పాడు. అదేంటి కేఎల్‌ రాహుల్‌కి యువీ సారీ చెప్పడం ఏమిటి అనుకుంటున్నారా?, ఇందుకు అతని హెయిర్‌ స్టైల్‌ను అనుకరించడమే.

ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్

Submitted by arun on Sat, 01/27/2018 - 13:03

కేఎల్ రాహుల్ జాక్‌పాట్ కొట్టాడు. ఐపీఎల్ ఆక్షన్‌లో ఊహించని ధరకు అతను అమ్ముడుపోయాడు. రూ.11 కోట్లకు రాహుల్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ టీమ్ కైవసం చేసుకున్నది. ఇవాళ మూడవ రౌండ్ వేలంలో రాహుల్ అమ్ముడుపోయాడు. ఇప్పటివరకు ఇవాళ్టి వేలంలో బెన్ స్టోక్స్ తర్వాత రాహుల్‌కు అత్యధిక ప్రైస్ దక్కింది. కరణ్ నాయర్‌ను కూడా కింగ్స్ లెవన్ జట్టు రూ.5.60 కోట్లకు సొంతం చేసుకున్నది. ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అమ్ముడుపోలేదు. క్రిస్ గేల్ తర్వాత అమ్ముడుపోని రెండవ ప్లేయర్ జోరూట్. మ‌నీష్ పాండే కూడా జాక్‌పాట్ కొట్టాడు. మ‌నీష్ పాండేను హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్ కైవ‌సం చేసుకున్న‌ది.