Punjab

నిరసనతో అట్టుడికిన పంజాబ్ రాష్ట్రం

Submitted by arun on Sat, 09/01/2018 - 16:25

పంజాబ్ రాష్ట్రం నిరసనతో అట్టుడికింది.శిరోమణి అకాలీ దళ్ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ, నవజ్యోత్ సింగ్ సిద్ధుతో పాటు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, పార్టీ చీఫ్ సునీల్ జకాల్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పంజాబ్‌లో 117 నియోజక వర్గాల్లో కూడా ఈ నిరసనలు కొనసాగాయి. 2015లో ఫరీద్ కోట్ ఘటనకు బాదల్ వర్గీయులే కారణమని కాంగ్రెస్ ఆరోపించడంతో నిరసనలు ఊపందుకున్నాయి.

భార్య అశ్లీల వీడియోను చూసిన భర్త ఏం చేశాడంటే..

Submitted by arun on Fri, 08/03/2018 - 13:09

అక్రమ సంబంధాలు అంతానికే పూనుకుంటాయని తెలిసి కూడా చాలా మంది అలాంటి వ్యవహారాల్లో దలదూర్చి చివరకు ప్రాణాల మీదకు తెచ్చకుంటున్నారు. అలాంటి ఘటనే పంజాబ్‌లో చోటు చేసుకుంది. భార్య ఇంకొకరితో అశ్లీలంగా వున్న వీడియోను చూసిన భర్త ఆవేశంతో భార్యాపిల్లల మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.  వివరాల్లోకి వెళ్తే.. కపుర్తలా జిల్లా కలసింగియా గ్రామానికి చెందిన కుల్విందర్‌ సింగ్‌(35) జోర్డాన్‌లో పని చేస్తూ నెలకు డబ్బులు ఇంటికి పంపిస్తున్నాడు. భార్య, పిల్లలు స్వగ్రామం కలసింగియాలోనే ఉంటున్నారు. అయితే గ్రామంలోని ఓ వ్యక్తితో కుల్విందర్‌ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది.

అత్యాచారానికి యత్నించిన పోలీసు... చెట్టుకుకట్టేసి చితకబాదింది…

Submitted by arun on Wed, 07/18/2018 - 11:28

పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో దారుణం చోటుచేసుకుంది. శాంతిభద్రతలు కాపాడాల్సిన ఓ పోలీసు అధికారే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి స్థానికులు ఆగ్రహించి పోలీసును చెట్టుకు కట్టేసి చితకబాదారు. పీకలదాక మద్యం సేవించిన ఓ పోలీసు అధికారి మద్యం మత్తులో తనపై అత్యాచారం చేయబోయాడని ఓ మహిళ స్థానికులకు తెలిపింది. దీంతో స్థానికులు ఆ అధికారిని పట్టుకొని చెట్టుకి కట్టేసి చితకబాదారు. ఈ విషయం తెలుసున్న పోలీసు ఉన్నతాధికారులకు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
 

ఐపీఎస్ ఆఫీసర్ వెంట పడుతున్న ఓ యువతి

Submitted by arun on Wed, 06/20/2018 - 10:29

కేవలం సినిమా హీరోలు లేదా క్రికెట్ స్టార్ల వెంటే అభిమానులు పడుతుంటారని భావిస్తుంటారా? అయితే, మీ ఆలోచన తప్పు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి మూడు రోజుల క్రితం వచ్చిన పంజాబ్, హోషియార్ పూర్ కు చెందిన 27 ఏళ్ల యువతి, తాను ఎస్పీ సచిన్ అతుల్కర్ ను కలవాల్సిందేనంటూ పట్టుబడుతూ ఉండటంతో పోలీసులు తల పట్టుకున్నారు. పంజాబ్‌లోని హోసియాపూర్‌కు చెందిన 27 ఏళ్ల యువతి మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చేరుకుంది. ఈ యువతి సైకాలజీలో పీజీ చేసింది. ఉజ్జయినిలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ సచిన్ అతుల్కర్(34)ను కలవాలని ఆ యువతి.. ఆయన కార్యాలయం ముందు పడిగాపులు కాస్తుంది.

పంజాబ్‌లో పదిరోజుల పాటు రైతుల ఆందోళన

Submitted by arun on Fri, 06/01/2018 - 17:16

ఉత్తర భారతదేశంలో రైతులు రోడ్డెక్కారు. డిమాండ్లను పరిష్కరించాలని పదిరోజుల పాటు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాలో రైతులు.. నడిరోడ్లపై లీటర్ల కొద్దీ పాలు, కూరగాయలు పారబోశారు. రైతుల సమ్మె సందర్భంగా ఈ నెల 6వ తేదీన మధ్యప్రదేశ్‌లో జరగనున్న ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. 11 రైతు సంఘాలు చేపట్టిన సమ్మె సందర్భంగా మార్కెట్లకు 10 రోజులపాటు పాలు, పండ్లు, కూరగాయలు సరఫరా చేసేదిలేదని రైతులు ప్రకటించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

ఐపీఎల్ వేలంలో యువరాజ్‌కు షాక్

Submitted by arun on Sat, 01/27/2018 - 12:10

ఐపీఎల్‌ 11వ సీజన్‌ కోసం నిర్వహించిన వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఏ ఆటగాడి కోసం ఎక్కువ వెచ్చించాలన్న పక్కా ప్రణాళికతో వచ్చిన ఫ్రాంఛైజీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఆటగాళ్ల వేలాన్ని కొన్ని సెట్‌లుగా విభజించారు. వందల మంది అందుబాటులో ఉన్నా 16 మందికే బీసీసీఐ మేటి ఆటగాళ్ల హోదాను కల్పించింది. వీరికి కనీస ధర రూ.2 కోట్లు. వారిలో మొదటి సెట్‌లో ఎనిమిది, రెండో సెట్‌లో ఎనిమిది మందిగా విభజించారు. మొదటి సెట్‌లో క్రిస్ గేల్ మినహా ఏడుగురు ఆటగాళ్లు అమ్ముడుపోయారు. చిన్న విరామం అనంతరం రెండో సెట్ వేలం ప్రారంభమయింది. భారీ అంచనాలు పెట్టుకున్న భారత డాషింగ్ క్రికెటర్ యువరాజ్‌కు షాక్ తగిలింది.