Yuvraj Singh

యువరాజ్ .... మాన్ అఫ్ ది సిరీస్ ఎన్నో సార్లు

Submitted by arun on Thu, 10/04/2018 - 13:38

యువరాజ్ చాల సార్లు మాన్ అఫ్ ది సిరీస్ అయ్యాడని మీకు తెలుసా!  అతనికి అండర్ 15 ప్రపంచ కప్లో,  అలాగే అండర్ 19 ప్రపంచ కప్లో కూడా, అలాగే.. ICC ప్రపంచ కప్ 2011 కూడా మాన్ అఫ్ ది సిరీస్ అయ్యాడు..  మరియు T20 ప్రపంచ కప్ 2007 లో సిరీస్లో కూడా యువరాజ్ మాన్ అఫ్ ది సిరిస్గా అయ్యారు. శ్రీ.కో.
 

కేఎల్‌ రాహుల్‌కి యువీ సారీ!

Submitted by arun on Sat, 03/24/2018 - 17:05

ఐపీఎల్‌ కోసం భారత స్టార్‌ ఆటగాళ్లు సరికొత్తగా కనిపించేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ, మహేంద్ర సింగ్‌ ధోనీ కొత్త హెయిర్‌ స్టైల్‌తో ఐపీఎల్‌కు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్‌ ఆటగాడు వచ్చి చేరాడు. అతడే సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన యువీ.. ఈ క్రమంలోనే మరో క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌కు సారీ చెప్పాడు. అదేంటి కేఎల్‌ రాహుల్‌కి యువీ సారీ చెప్పడం ఏమిటి అనుకుంటున్నారా?, ఇందుకు అతని హెయిర్‌ స్టైల్‌ను అనుకరించడమే.

ఐపీఎల్ వేలంలో యువరాజ్‌కు షాక్

Submitted by arun on Sat, 01/27/2018 - 12:10

ఐపీఎల్‌ 11వ సీజన్‌ కోసం నిర్వహించిన వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఏ ఆటగాడి కోసం ఎక్కువ వెచ్చించాలన్న పక్కా ప్రణాళికతో వచ్చిన ఫ్రాంఛైజీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఆటగాళ్ల వేలాన్ని కొన్ని సెట్‌లుగా విభజించారు. వందల మంది అందుబాటులో ఉన్నా 16 మందికే బీసీసీఐ మేటి ఆటగాళ్ల హోదాను కల్పించింది. వీరికి కనీస ధర రూ.2 కోట్లు. వారిలో మొదటి సెట్‌లో ఎనిమిది, రెండో సెట్‌లో ఎనిమిది మందిగా విభజించారు. మొదటి సెట్‌లో క్రిస్ గేల్ మినహా ఏడుగురు ఆటగాళ్లు అమ్ముడుపోయారు. చిన్న విరామం అనంతరం రెండో సెట్ వేలం ప్రారంభమయింది. భారీ అంచనాలు పెట్టుకున్న భారత డాషింగ్ క్రికెటర్ యువరాజ్‌కు షాక్ తగిలింది.