face book

అమ్మాయిలకు స్వీట్‌పాన్‌ ఇచ్చి..

Submitted by arun on Fri, 06/08/2018 - 11:31

హైదరాబాద్‌లో ఓ కామాంధుడి వికృత రూపాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. మయూర్ పాన్ హౌస్ పేరిట నగరంలో అనేక చోట్ల పాన్ వ్యాపారాన్ని చేస్తున్న  ఉపేందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపేందర్ చేతిలో మోసపోయిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు రంగంలో దిగి  ఉపేందర్ గుట్టు రట్టు చేశారు. ఫేస్ బుక్ ద్వారా చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ఉపేందర్ తన వద్ద ఉన్న పాన్‌లలో మత్తు మందును చల్లి అమ్మాయిలకు ఇచ్చేవాడు. వారు స్మృహకోల్పోయిన తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ తర్వాత వారిని బెదిరించేవాడు. వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానని యువతులను బెదిరించేవాడు.

చాటింగ్‌ ఛీటర్‌...ఎఫ్‌బీలో అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు..

Submitted by arun on Wed, 02/21/2018 - 11:26

సోషల్‌గా మూవ్‌ అవుదామని కామన్‌గా సోషల్‌ మీడియాలోకి వచ్చే మహిళలూ.. జాగ్రత్త. నెట్టింట్లో చీటింగ్‌ నెట్‌ వేసే గ్రంధ సాంగులు చాలానే మందే ఉన్నారు. అపరిచితులతో స్నేహం అవసరమా అని ఒకటికి పది సార్లు ఆలోచించుకొనేలా చేస్తున్నారీ మోసగాళ్లు. ఫేస్‌ బుక్‌లో బుక్కయ్యే లేడీస్‌ ఎందరో? బుక్‌ చేసే కిలాడీలెందరో? తాజాగా అలాంటి చీటింగ్‌ ఛాటర్‌ను పోలీసులు కటకటాలు లెక్క పెట్టిస్తున్నారు. 

రంగస్వామి లీలలు గుట్టురట్టు..

Submitted by arun on Tue, 02/20/2018 - 17:26

ఒంటరి మహిళలకు ఎర వేసి మోసం చేస్తున్న ఘరానా మోసగాడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒంటరిగా నివశిస్తున్న మహిళలను ఫేస్‌బుక్ ఛాటింగ్ ద్వారా పరిచయం చేసుకుని మోసం చేస్తున్న రంగస్వామి రాచకొండ పోలీసులకు చిక్కాడు. అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి ఇప్పటి వరకు 10 మంది మహిళల్ని మోసం చేశాడు. ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగస్వామి లీలలు బయటపడ్డాయి. అయితే రంగస్వామిపై హైదరాబాద్‌లో ఇప్పటికే 10 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాకు అనసూయ గుడ్‌ బై

Submitted by arun on Wed, 02/07/2018 - 12:36

ప్రముఖ యాంకర్‌ అనసూయ సోషల్ మీడియాకు గుడ్‌ బై చెప్పేసింది. రీసెంట్‌గా ఓ కుర్రాడు అన‌సూయతో సెల్ఫీ దిగేందుకు ప్ర‌యత్నించ‌గా, ఆమె సెల్ ప‌గ‌ల‌గొట్టింద‌ట‌. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా బుక్ అయింది. ఈ నేప‌ధ్యంలో అన‌సూయ‌కి భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నెటిజ‌న్స్ త‌మ‌కి న‌చ్చిన స్టైల్‌లో అన‌సూయ‌కి క్లాస్ పీకారు. క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి వారు శాంతించక‌పోవ‌డంతో సోష‌ల్ సైట్స్ నుండి అన‌సూయ త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. ట్వీటర్‌తో పాటు ఫేస్‌ బుక్‌లో కూడా అనసూయ అకౌంట్ కనిపించటం లేదు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావటం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఫేస్‌బుక్ యూజర్లకు శుభవార్త

Submitted by lakshman on Fri, 09/15/2017 - 21:47
భారత్‌లో సోషల్ మీడియా వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశం ఈ విషయంలో అమెరికానే మించిపోయింది. ఇంతలా భారతీయుల ఆదరణ పొందిన..