love marriage

ప్రేమపై బహిష్కరణ వేటు...

Submitted by arun on Sat, 10/13/2018 - 14:22

జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం భీమ్ రెడ్డి గూడెంలో ఆటవిక చర్య వెలుగులోకి వచ్చింది. మరో కులం వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో యువతిని గ్రామం నుంచి బహిష్కరించారు. వేరే కులం వ్యక్తిని ప్రేమించిన యువతిని ఆరు నెలల పాటు గ్రామ, కుల బహిష్కరణ విధిస్తూ గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. ఒకవేళ యువతిపై బహిష్కరణ ఎత్తివేసి గ్రామంలోకి అనుమతించాలంటే ఆమె గుండు కొట్టించుకోవాలనీ నాలుకపై వాతలు పెట్టించుకోవాలని షరతు పెట్టారు.

వెలిప్రేమకు మరో యువకుడు బలి

Submitted by arun on Thu, 09/20/2018 - 14:15

ప్రస్తుతం కులాంతర వివాహాలు చేసుకున్నవారు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి దాడులు చేస్తారో అని వణికిపోతున్నారు. మిర్యాలగూడ, ఎర్రగడ్డ తర్వాత హైదరాబాద్‌ సంతోష్ నగర్‌ పీఎస్‌ పరిధిలోని రక్షపురానికి చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తి నిన్న పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీకాంత్‌ను హుటాహుటిన ఉస్మానియాకు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ శ్రీకాంత్‌ ప్రాణాలు కోల్పోయాడు. 2015 లో శ్రీకాంత్‌ కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే అమ్మాయి తండ్రి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగి కావడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు.

పట్టపగలే పరువు హత్య...ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి నరికివేత

Submitted by arun on Sat, 09/15/2018 - 10:27

నల్లగొండ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. మిర్యాలగూడలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్య సంచలనం సృష్టించింది. తన భార్యను ఆస్పత్రిలో చూపించుకుని వెళ్తున్న ప్రణయ్‌ అనే వ్యక్తిని వెనుకనుంచి వచ్చిన దుండగుడు కత్తితో నరికేశాడు. ఇటు హత్య వెనుక ప్రేమ వివాహమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

దారుణం...పట్టపగలే యువకుడిని కత్తితో నరికేశాడు.. వీడియో

Submitted by arun on Fri, 09/14/2018 - 16:07

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తిని నరికేశారు. ఇద్దరు అమ్మాయిలతో కలిసి వెళ్తున్న పెరుమాళ్ల ప్రణయ్‌ అనే వ్యక్తిని కత్తి చేతపట్టుకుని వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి అటాక్‌ చేశాడు. తొలి వేటుకు ప్రణయ్‌ కిందపడిపోగా రెండో వేటుకు ప్రణయ్‌ తలపగిలిపోయింది. దీంతో ప్రణయ్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇటు ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ప్రణయ్‌తో వచ్చిన అమ్మాయిలు అరుపులు కేకలతో పరుగులు పెట్టారు. 

12 ఏళ్ల తర్వాత వెలుగులోకి భర్త ఘాతుకం

Submitted by arun on Sat, 08/11/2018 - 13:48

నల్గొండ జిల్లా మర్రిగూడ యువతి ప్రియాంక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు హన్మంతు ఇచ్చిన సమాచారంతో ప్రియాంక ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌ మల్లేపల్లిలో బాబు రాజ్‌కిరణ్‌ నాగార్జునసాగర్‌లో పాప ఆచూకీ కనుగొన్నారు.
 

ప్రేమ పెళ్లి చేసుకున్నారని మూత్రం తాగించారు..

Submitted by arun on Wed, 08/01/2018 - 16:48

ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ  జంటకు ఘోర అవమానం ఎదురైంది. పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడమే వారు చేసిన నేరం. మధ్యప్రదేశ్‌ అలీరాజ్‌పూర్ జిల్లా హర్దాస్‌పూర్‌‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్‌దాస్‌పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు, 21 ఏళ్ల యువతి గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు గుజరాత్‌లో ఉన్న ఈ నవ దంపతులు.. ఇటీవలే అలీరాజ్‌పూర్‌లోని తన మామ నివాసానికి(యువకుడి మేనమామ) చేరుకున్నారు.

కిడ్నాప్, రేప్ అంటూ షాకిచ్చి .. ప్రొఫెసర్‌ను పెళ్లాడిన స్టూడెంట్

Submitted by arun on Thu, 07/05/2018 - 12:15

తాను ప్రేమించిన ప్రొఫెసర్ ను వివాహం చేసుకోవడానికి ఓ యువతి తనను కిడ్నాప్ చేశారని, అత్యాచారానికి ప్రయత్నించారని తప్పుడు సమాచారాన్ని ఇచ్చింది. ఈ సమాచారం తప్పని తెలవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకొన్నారు. మరోవైపు  తాను ప్రేమించిన అధ్యాపకుడిని వివాహం చేసుకొన్న విషయాన్ని ఆ యువతి వాట్సాప్ మేసేజ్‌ల ద్వారా స్నేహితులకు సమాచారం ఇచ్చిందని పోలీసులు తెలిపారు.అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. కడప నగరంలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది.  ప్రేమ వివాహం చేసుకొనేందుకే ఆ యువతి కట్టుకథ అల్లిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రేమపెళ్లికి బ్రేక్‌.. యువతిని ఎత్తుకెళ్లిన బంధువులు

Submitted by arun on Thu, 06/21/2018 - 10:20

ఐదే ఐదు నిమిషాలు... అంతలోనే ఆ ప్రేమికుల ఆశలు అడిఆశలయ్యాయి. పెద్దలను ఎదిరించి మరి ఆర్యసమాజ్‌లో పెళ్లికి సిద్ధమయ్యారు. అంతే... ఇంతలోనే సమాచారం అందుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు... సినిమా సన్నివేశాలను తలపించే రేంజ్‌లో పదికి పైగా మోటార్‌ సైకిళ్లతో వాలిపోయారు. కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడిని చితకబాదారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. మరో ఐదు నిమిషాల్లో కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతున్నామన్న యువ జంట ఆశలు ఆవిరయ్యాయి. పెద్దలను కాదని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోబోతున్న జంటను అమ్మాయి తరఫు బంధువులు విడదీశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది.

అత్తారింట్లో గొడవ.. ఉరేసుకున్న న్యూస్ రీడర్

Submitted by arun on Mon, 06/18/2018 - 11:59

విజయవాడలో దారుణం సంభవించింది. ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన తేజశ్విని నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే, పోలీసుల కథనం ప్రకారం ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌ కాలనీలోని ఫ్లాట్‌ నంబర్‌ 105లో గత కొంత కాలంగా దంపతులు మట్టపల్లి తేజశ్విని, పవన్‌కుమార్‌ ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. తేజశ్విని ఓ చానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేసేది. భర్త పవన్‌కుమార్‌ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తేజశ్విని అత్త అన్నపూర్ణాదేవితో గొడవ పడింది.

ఎమ్మెల్యే కూతురు.. సినీ డైరెక్టర్‌..సస్పెన్స్‌ రేపిన ప్రేమ పెళ్లి

Submitted by arun on Fri, 03/09/2018 - 11:39

కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే కుమార్తె, సినిమా దర్శకుడి ప్రేమ వివాహం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్న మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్‌ కుమార్తె లక్ష్మి, 'కన్నడ మాస్తిగుడి' దర్శకుడు పీ సుందర్‌ గౌడలు గురువారం నాడు చాముండి కొండపై వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సుందర్ బంధువులు పలువురు హాజరయ్యారు. ఎమ్మెల్యే శివమూర్తి తన కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మైసూరులో వరుడి బంధువులు బసచేసిన హోటల్ వద్దకు వచ్చి అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.