Karan Johar

అంత్యక్రియల్లో నవ్వినందుకు..

Submitted by arun on Fri, 10/05/2018 - 13:20

ఇటీవల మరణించిన రాజ్‌కపూర్ భార్య కృష్ణ రాజ్‌కపూర్ ప్రేయర్ మీట్‌లో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు నవ్వుతూ ముచ్చటించుకోవడం వివాదాస్పదమైంది. ఓవైపు విషాదంలో కృష్ణ రాజ్‌కపూర్ కుటుంబ సభ్యులు ఉండగా వీళ్ళు అదేదో ఈవెంట్‌కు వచ్చినట్టు చిరునవ్వులు చిందిస్తూ జోకులు వేసుకోవడమేమిటని నెటిజన్లు ఫైరయ్యారు. రాణి ముఖర్జీ, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, అలియా భట్ ఇలా ఆ సమయంలో జోవియల్‌గా కనబడి  కెమెరాలకెక్కారు. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నెటిజన్లు వీరు ప్రార్ధనా సమావేశంలో ఎందుకు నవ్వుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నటుల తీరును తప్పుపడుతూ పెద్దసంఖ్యలో కామెంట్లు పోటెత్తాయి.

బాలీవుడ్ నటుడు కరణ్ జొహార్ ను కిడ్నాపర్ల నుంచి కాపాడిన రానా!

Submitted by arun on Tue, 01/23/2018 - 16:26

ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు కరణ్ జొహార్ ను కిడ్నాపర్ల బారి నుంచి హీరో రానా కాపాడాడు. అయితే ఇది నిజ జీవితంలో కాదు. 'వెల్ కం టు న్యూయార్క్' అనే బాలీవుడ్ సినిమాలో. రానా, కరణ్ జొహార్, సొనాక్షి సిన్హా, రితీష్ దేశ్ ముఖ్, బొమన్ ఇరానీ, లారా దత్తా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇండియాకు చెందిన తొలి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. న్యూయార్క్‌లో జరుగుతున్న ఓ ఈవెంట్‌కు అంతా వెళ్తారు. అక్కడే కరణ్ కిడ్నాప్ అవగానే బాహుబలి అని అరుస్తారు. అప్పుడు రానా వెళ్లి రక్షిస్తాడు. ఈ సినిమాలో కరణ్ డ్యూయెల్ రోల్ పోషించాడు.