kajal aggarwal

కొండ చిలువతో కాజల్‌ అగర్వాల్

Submitted by arun on Thu, 10/04/2018 - 15:41

తన అందం, అభినయంతో ఎంతో అభిమానులను సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా ఓ చిత్రం ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్‌ పాథోమ్‌ ప్రావిన్స్‌లో జరుగుతోంది. షూటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ సందడి చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. హీరోయిన్‌ ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్‌ ఇస్తున్న వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. దర్శకుడు తేజ తన ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఈ వీడియోను షేర్‌ చేశాడు.

గూగుల్ లో ఏది దొరికినా.. అదొక్కటి ’మనకు మనమే‘ తెలుసుకోవాలి అంటున్న కాజల్..!

Submitted by arun on Mon, 08/06/2018 - 17:04

ఇప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా.. నెటిజనులందరూ జై గూగుల్ తల్లి అంటున్నారు. ప్రతీ చిన్న అంశాన్ని గూగుల్ లో శోధిస్తున్నారు. అయితే సెర్చింజిన్ గూగుల్ లో ఏది దొరకినా.. అదొక్కటి మాత్రం మనకు మనమే తెలుసుకోవాలి అంటున్నారు మిల్కీ బ్యూటి కాజల్. ఇంతకీ గూగుల్ లో దొరకనిది.. ఏంటది.. అంటే.. మంచి వ్యక్తిత్వం అంట. ఇటీవల గూగుల్ సెర్చింగ్ ఎక్కువైపోయింది. ఎంతలా అంటే... ఎవరైనా.. ఒక విషయంలో ఫేమస్ అయితే.. వెంటనే వారి నేపథ్యం ఏంటి? కులం, గోత్రం, ఏమైన ఎఫైర్స్ ఉన్నాయా? ఇలా ప్రతీ విషయాన్ని గూగుల్ లో శోధిస్తున్నారు. 

రానా ఇబ్బందిని... వేస్ట్ ఆఫ్ టైమ్ అన్న కాజల్

Submitted by arun on Tue, 01/23/2018 - 14:47

రానా తన విమాన కష్టాన్ని చెప్తే... కాజల్ వేస్ట్ ఆఫ్ టైమ్ అంటూ కొట్టిపారేసింది. ఇదంతా ఎక్కడ జరిగిందీ అనుకుంటున్నారా? ట్విట్టర్ వేదికగా జరిగింది. నిన్న రానా ముంబైకి వెళ్లారు. ఈ ప్ర‌యాణంలో భాగంగా ఆయ‌న‌కు విమాన క‌ష్టాలు ఎదుర‌య్యాయి. ఎయిర్‌ ట్రాఫిక్, పార్కింగ్ స‌మ‌స్య‌ల‌ దృష్ట్యా ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వెళ్లాల్సిన విమానాన్ని, డొమెస్టిక్ విమానాశ్ర‌యానికి మళ్లించారు. దీంతో మ‌ళ్లీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వెళ్ల‌డానికి రానా ముంబై ట్రాఫిక్‌లో అర‌గంటపాటు ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. ఈ ఇబ్బందిని ఆయ‌న ఓ ట్వీట్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.