kondagattu

కండిషన్‌ లేదు... ప్రాణాలంటే కనికరమూ లేదు!!

Submitted by santosh on Wed, 09/12/2018 - 12:41

కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌తో సహా 57 మంది మృతి చెందారు. ఇంతమందిని బలితీసుకున్న బస్సు ప్రమాదానికి అతివేగం, ఓవర్‌లోడే కారణమని తెలుస్తోంది. 

కొండగట్టు ఘాట్‌రోడ్‌లో ఘోర రోడ్డుప్రమాదం...32 మంది మృతి

Submitted by arun on Tue, 09/11/2018 - 12:45

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 32మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను అధికారులు పరిశీలిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. సుమారు 60మందితో ప్రయాణిస్తున్న బస్సు కొండగట్టులోని ఘాట్ రోడ్డులోకి వచ్చిన వెంటనే, ఒక్కసారిగా బోల్తా పడింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే ఘాట్ రోడ్డు నుంచి బస్సు పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతంలో పడిపోయింది.

పవన్ ర్యాలీలో జాతీయ జెండాకు అవమానం

Submitted by arun on Mon, 01/22/2018 - 17:02

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ర్యాలీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. కొండగట్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో పూజలు చేసిన పవన్.. బయటకు వస్తున్న క్రమంలో.. ఆయన అభిమానులు, కార్యకర్తలు జాతీయ జెండాలు ఊపారు. ఈ క్రమంలో రెండు జాతీయ జెండాలు చిరిగిపోయినప్పటికీ కార్యకర్తలు పట్టించుకోలేదు. పవన్ కారుపైకి చేరుకోగానే.. అత్యుత్సాహంతో అభిమానులు.. ఆయనపైకి జాతీయ జెండాలను విసిరేశారు. దీంతో పవన్ బౌన్సర్లు.. జాతీయ జెండాలను ఇష్టారాజ్యంగా నలిపి పక్కకు పడేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం 2 గంటలకు కొండగట్టుకు చేరుకున్నారు.

కొండ‌గ‌ట్టు అభివృద్ధి కోసం రూ.11ల‌క్ష‌ల విరాళం

Submitted by arun on Mon, 01/22/2018 - 15:15

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. కొండగట్టులో కొలువుదీరిన ఆంజనేయస్వామిని దర్శించుకుని..ఆలయంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ ఆలయ అభివృద్ధి కోసం రూ.11 లక్షల విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. కాగా, ఆలయ మర్యాదలతో పవన్ కల్యాణ్ కు పండితులు స్వాగతం పలికారు. అనంతరం  పవన్ కల్యాణ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. స్వామి తనను చల్లగా చూడాలని మొక్కుకున్నట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. స్వామి ఆశీస్సులతోనే తాను 2009లో ప్రమాదం నుంచి బయటపడినట్టు పేర్కొన్నారు.

కొండగట్టకు బయలుదేరిన పవన్‌కల్యాణ్

Submitted by arun on Mon, 01/22/2018 - 10:47

జనసేనాని పవన్‌కల్యాణ్ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరారు. పవన్ సతీమణి అన్నా లెజ్నోవా వీర తిలకం దిద్ది, హారతిచ్చారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో పవన్ దంపతులు సర్వమత ప్రార్థనలు నిర్వించారు. హిందూ సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి సాగనంపారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పవన్‌ కొండగట్టుకు పయనమయ్యారు. దాదాపు 50 వాహనాల్లో వందలమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయనను అనుసరించారు. కొండగట్టులో ప్రత్యేక పూజల అనంతరం ఆయన తన యాత్ర ఉద్దేశాన్ని వివరించనున్నారు.

జనసేనాని ఈ సారి కొంచెం డిఫరెంట్‌

Submitted by arun on Sun, 01/21/2018 - 13:39

పవన్‌ కల్యాణ్...కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభించడానికి కారణాలేంటీ ? యాత్ర చేయడానికి ఎవరి నుంచి స్ఫూర్తి పొందారు ? ఆంజనేయస్వామి మీద ఉన్న భక్తే యాత్రకు కారణమా ? ఏపీలో అనేక సమస్యలపై గళమెత్తిన పవన్‌...తెలంగాణలోనూ ప్రజా సమస్యలపై గళమెత్తుతారా ? లేదంటే పొలిటికల్ యాత్రతోనే సరిపెట్టుకుంటారా ? 

రేపు కొండగట్టుకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌

Submitted by arun on Sun, 01/21/2018 - 12:29

పవన్‌ కల్యాణ్‌ రేపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత....యాత్రకు సంబంధించిన కార్యాచరణ, రూట్‌మ్యాప్‌ను వివరించనున్నారు పవన్‌ కల్యాణ్‌. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభిస్తానని పవన్ ట్విట్టర్ లో వెల్లడించారు. తెలుగు రాష్ర్టాల్లోని తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు మొదటగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోనున్నట్లు పవన్ తెలిపారు. మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి' అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.

మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి

Submitted by arun on Sun, 01/21/2018 - 10:55

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను చేపట్టనున్న రాజకీయ యాత్రపై ట్విట్టర్ లో స్పందించారు. ఆసక్తికరంగా ఇందుకు తెలంగాణను వేదికగా చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభిస్తానని పవన్ వెల్లడించారు. తెలుగు రాష్ర్టాల్లోని తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు మొదటగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోనున్నట్లు పవన్ తెలిపారు. మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి' అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.