madhya pradesh

ప్రొఫెసర్ డ్యాన్స్.. సీఎం ఫిదా ...

Submitted by arun on Sat, 06/02/2018 - 10:48

సోషల్ మీడియాలో ఓ వీడియో...దుమ్ము రేపుతోంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. టీవీల్లో ఎక్కడ చూసినా...ఈ వీడియోనే కనిపిస్తోంది. భారీ పర్సనాలిటీ ఉన్నా అదిరిపోయే డ్యాన్స్‌‌ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 50 ఏళ్లు దాటినా...డ్యాన్స్‌తో యువ హీరోలను మరిపిస్తూ అలనాటి హీరో గోవిందా స్టెప్పులతో అలరిస్తున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి. వాచ్ దిస్ స్టోరీ 

ఆన్‌ డ్యూటీలో ఆడి, పాటిన అధికారులు

Submitted by arun on Tue, 04/17/2018 - 13:17

డాన్సులు, హంగామాలు ఇలాంటివన్నీ ఏ ఫంక్షన్లలోనో, పెళ్లిళ్లలోనూ జరుగుతుంటాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో కజ్‌రారే కజ్‌రారే... అనుకుంటూ చిందులు వేశారు అక్కడి ఉద్యోగులు. ఆడ, మగ కలిసి పని చేయాల్సిన సమయంలో ఆటవిడుపుగా ఆటలాడారు, పాటపాడారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. ఆన్‌ డ్యూటీలో ఉన్న అధికారులు పని వదిలేసి, పాటలు పాడుతున్నారేంటని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌ కే కడక్‌నాథ్‌

Submitted by arun on Fri, 04/06/2018 - 15:16

నల్లకోడి ఎటువైపో తేలిపోయింది. కడక్‌నాథ్‌ కోడి ఎవరిదో ఫైనల్ అయ్యింది. యేళ్ల తరబడి సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పడింది. నల్లకోడి మధ్యప్రదేశ్ కే చెందుతుందని భారత భౌగోలిక గుర్తింపు సంస్థ ప్రాథమికంగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో విరివిగా కనిపించే నల్లకోడిపై వివాదం తేలిపోయింది. తమదంటే తమదని గతకొన్నేళ్లుగా ఈ రెండు రాష్ట్రాలు వాదించుకుంటూ వస్తున్న నేపథ్యంలో భౌగోలిక గుర్తింపు సంస్థ విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చింది. 

బాబాలకు మంత్రుల హోదా

Submitted by arun on Thu, 04/05/2018 - 15:06

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్‌ బాబా సహా ఐదుగురు నర్మదా బాబాలకు కాబినెట్‌ హోదా కల్పిస్తూ శివరాజ్‌సింగ్‌ సర్కార్ తీర్మానం చేసింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 
  

ఆ బాలుడు.. మృత్యుంజయుడు!

Submitted by arun on Mon, 03/12/2018 - 13:46

బోరుబావిలో ఎవరైనా పడిపోయారని తెలిస్తే.. ఈ మధ్య అంతా ఆందోళన పడుతున్నారు. సిబ్బంది వైఫల్యం కారణంగా చాలాసార్లు పిల్లలు బోరు బావిలోనే చనిపోతున్న సంఘటనలు పెరుగుతుండడంతో.. ఈ ఆందోళన కూడా పెరుగుతోంది. కానీ.. మధ్యప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో మాత్రం అధికారులు శభాష్ అనిపించుకున్నారు. సిబ్బంది కూడా తమ పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు.

ఒక్క అత్యాచారం ఖ‌రీదు ఆరువేలా : సుప్రీం

Submitted by lakshman on Fri, 02/16/2018 - 04:12

నిర్భ‌య ఘ‌ట‌న త‌రువాత మ‌హిళ‌ల‌పై ఎలాంటి దాడులు జ‌ర‌గ‌కుండా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.  దీంతో పాటు అత్యాచారానికి గురైన బాధితుల‌కు ఆర్ధికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్భ‌య మూల‌ధ‌న ప‌థ‌కం కింద న‌గదును అంద‌జేస్తుంది. అయితే ఆ న‌గ‌దు స‌రిగ్గా చేర‌డంలేద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల‌పై  సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. 

కోడి కోసం రెండు రాష్ట్రాల కొట్లాట

Submitted by arun on Tue, 02/06/2018 - 10:24

ఓ కోడి కోసం రెండు రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి. ఆ కోడి తమదంటే తమది ఇరు రాష్ట్రాలు సిగపట్లు పడుతున్నాయి. కోడి దక్కించుకునే వరకు వెనక్కి తగ్గబోమని చెబుతున్నాయి. ఇంతకీ ఈ కోడి కథేంటో మీరే చూడండి. 

కడక్‌నాథ్‌ కోడి.. ఇది చూడడానికి పూర్తి నల్లగా ఉన్నా, ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. కాళ్లు, రెక్కలు, ముక్కు.. ఇలా నిలువెల్లా ఈ కోడి పూర్తి నల్లగానే ఉంటుంది. మాంసం, ఎముకలే కాకుండా ఆఖరికి ఆ కోడి పెట్టే గుడ్డు కూడా కారు నలుపే. రుచితో పాటు పోషకాలు, ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయని..  కిలో ఐదువందల రూపాయిలు పలుకుతున్నా.. వీటిని కొని ఓ పట్టు పట్టడానికి మాంసాహారులు లొట్టలేస్తారు. 

రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వాలకు సుప్రీంలో చుక్కెదురు

Submitted by arun on Tue, 01/23/2018 - 13:37

వివాదాస్పద సినిమా పద్మావత్ పై నిషేధం విధించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లో పద్మావత్‌‌ను నిసేధించాంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. పద్మావత్ చిత్రం విషయంలో గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రముఖ దర్శకుడు సంజలీలా భన్సాలీ దర్శక నిర్మాణంలో రూపొందిన పద్మావత్ ఎల్లుండి విడుదల కాబోతోంది. ఈ సినిమాకు వ్యతిరేంగా కర్ణిసేన కొద్ది నెలలోగా ఆందోళనలు వ్యక్తం చేస్తోంది.   

బీజేపీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్‌

Submitted by arun on Sat, 01/20/2018 - 15:56

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. ఈ నెల 17న రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్లు, నగర కౌన్సిళ్లు, 51 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. శనివారం కౌంటింగ్‌ కొనసాగుతోంది. తాజాగా వెలువడిన రాఘవ్‌గఢ్‌ నగర కౌన్సిల్‌ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాఘవ్‌గఢ్‌ నగర్‌లో మొత్తం 24 వార్డులు ఉండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఏకంగా 20 వార్డులను గెలుపొంది సత్తా చాటింది. అధికార కమల దళానికి కేవలం 4 వార్డులు మాత్రమే దక్కాయి.