pooja hegde

కొత్త సినిమా ప్రారంభించిన ప్రభాస్‌

Submitted by arun on Thu, 09/06/2018 - 13:22

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.150 బడ్జెట్‌తో ‘సాహో’ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీని ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో సినిమా ఖరారైనట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభాస్ స్వయంగా తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సాహో తర్వాత తాను చేస్తున్న సినిమా గురువారం(సెప్టెంబర్ 6)న ప్రారంభమైనట్లు తెలిపారు.

ఎన్టీఆర్ ను చూసి పూజా హెగ్డే భయపడుతోంది

Submitted by arun on Fri, 03/16/2018 - 14:29

పూజా హెగ్డే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు దిగుమతి అవడమే కాదు.. స్టార్ హీరోలకు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ అయిపోయింది. డీజే సినిమాలో అందాల ఆరబోతతో.. వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమాలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలో ఆమే.. హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు.. ప్రభాస్ తోనూ కమిట్ అయ్యింది.

ఎన్టీఆర్ తో.. పూజా హెగ్డే.. తకధిమితోం!

Submitted by arun on Mon, 03/05/2018 - 17:45

డీజే సినిమాలో గ్లామర్ తో అభిమానులను అల్లాడించిన అందాల భామ పూజా హెగ్డే.. ఇప్పుడు మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో చాన్స్ కొట్టేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో.. హీరోయిన్ గా పూజాను ఫైనల్ చేశారు. చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని సినీ క్రియేషన్స్ వారు.. ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేశారు.

రంగ‌స్థ‌లంలో ప‌దినిమిషాల‌కు అంత తీసుకుందా

Submitted by lakshman on Wed, 02/07/2018 - 19:06

మొదటి రెండు సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించిన పూజాహెగ్డే 'డిజె' సినిమాలో మాత్రం రెచ్చిపోయి నటించింది. బికినీ సీన్స్ లో నటించి యూత్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు చాలా మంది హీరోలు తమ సినిమాల్లో పూజాను హీరోయిన్ గా ఎంపిక చేయడానికి చూస్తున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. పూజా కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

'జ‌య‌జాన‌కి నాయ‌క‌'లోని స‌న్నివేశం లాగే..?

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 12:26

'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జ‌య‌జాన‌కి నాయ‌క' చిత్రాలతో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సురేష్‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో.. డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ రూపొందిస్తున్న చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో.. జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్ కుమార్‌, మీనా వంటి ప్ర‌ముఖ తారాగ‌ణం న‌టిస్తోంది. 

బ‌న్నీ హీరోయిన్‌కి ఈ సారైనా అదృష్టం వ‌రిస్తుందా?

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 17:47

5 ఏళ్ల కెరీర్‌.. 5 సినిమాలు.. 3 భాష‌లు..ఇదీ అందాల భామ పూజా హెగ్డే గురించి సింపుల్‌గా చెప్ప‌మంటే ఎవ‌రైనా చెప్ప‌గ‌లిగేది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది.. కానీ న‌ట‌న శూన్యం. ఇక‌ విజ‌యాల సంఖ్య కూడా న‌ట‌న విష‌యంలో ఉన్న‌దే.  జీవా(ముగ‌మూడి - త‌మిళ్‌), నాగ‌చైత‌న్య (ఒక లైలా కోసం), వ‌రుణ్ తేజ్ (ముకుంద‌), హృతిక్ రోష‌న్‌(మొహంజ‌దారో), అల్లు అర్జున్ (డిజె - దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌).. ఇలా ఏ హీరో కూడా ఆమెకి క‌లిసి రాలేదు.  లాంగ్వేజ్ మారినా ఫేట్ మార‌డం లేదు.