Tirupati

తిరుమలలో హల్ చల్ చేసిన భారీ సర్పాలు

Submitted by arun on Fri, 11/09/2018 - 16:57

తిరుమలలో భారీ సర్పాలు హల్ చల్ చేసాయి. శ్రీవారి అలంకరణకు వాడే పుష్పమాలికలను కట్టే ఉద్యానవన కార్యాలయం వద్ద 9 అడుగుల జెర్రిపోతు అటు ఇటు సంచరిస్తూ అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసింది...భారీ సర్పాన్ని చూసి సిబ్బంది బెంబేలెత్తిపోయారు, అలాగే స్థానికులు నివసించే బాలాజీ నగర్ వద్ద ఓ ఇంటి ముందు మరో నాగుపాము బుసలు కొడుతూ అందరిని పరుగులు తీయించింది విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు సంఘటన‌ స్థలానికి‌ సకాలంలో‌ చేరుకొని రెండు పాములను చాకచక్యంగా పట్టుకొని‌ అడవిలో విడిచిపెట్టడంతో అందరు ఊపరి పీల్చుకున్నారు.

తిరుపతిలో ఆరుగురు విద్యార్థులు మిస్సింగ్‌

Submitted by arun on Fri, 10/12/2018 - 12:25

తిరుపతిలోని మాతృశ్రీ టెక్నో స్కూల్ లో ఆరుగురు విద్యార్థులు అదృశ్యం.. కలకలం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. నిన్న ఉదయం స్కూల్‌ స్టడీ అవర్‌ కోసం వచ్చి కనిపించకుండా పోయారు. తమ పిల్లలింకా ఇంటికి రాలేదంటూ తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే నిన్న ఉదయం 8 గంటలా 30 నిముషాలకే పాఠశాల నుంచి పంపించేశామని.. యాజమాన్యం తెలిపింది. అయితే ఆ ఆరుగురు విద్యార్థులు స్టడీ అవర్‌కు రాకుండా.. సినిమాకు వెళ్లిన విషయాన్ని గమనించిన స్కూల్‌ యాజమాన్యం.. తల్లిదండ్రులను తీసుకురావాలని హుకూం జారీ చేసింది. దీంతో స్కూల్‌ నుంచి వెళ్లి వారు ఇంటికి చేరుకోలేదు.

Tags

ఏపీ సీఎం తిరుపతి పర్యటనలో అపశృతి

Submitted by arun on Fri, 09/14/2018 - 10:59

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఏర్పేడు ఎస్‌ఐ వెంకట  రమణ గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోవడంతో సహచరులు హుటాహుటిన నారాయణాద్రి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించడంతో  తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
 

ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోంది: చంద్రబాబు

Submitted by arun on Fri, 08/31/2018 - 16:32

ఆంధ్రప్రదేశ్‌లో మరో అత్యాధునిక ఆస్పత్రి నిర్మాణానికి పునాది రాయి పడింది. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి భూమి పూజ చేశారు. రాష్ట్రం నుంచి  క్యాన్సర్ మహమ్మారిని తరిమికొడతమన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల సమీపంలో టీటీడీకి కేటాయించిన 5 ఎకరాల స్థలంలో రూ.1000 కోట్లతో ఈ ఆస్పత్రిని టాటా ట్రస్ట్‌ నిర్మిస్తోంది.

టీడీపీ కోడ్ ఉల్లంఘనను పట్టించునేదెవరు?

Submitted by hmtvdt on Mon, 04/30/2018 - 11:42

చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో టీడీపీ బహిరంగ సభకు ఏర్పాట్లు సర్వం పూర్తయ్యాయి. ఏ ఉద్దేశంతో సభ నిర్వహిస్తున్నా కూడా.. టీడీపీ నేతలు మాత్రం ఓ విషయాన్ని మరిచిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తో పాటు.. ఇతర నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు.

చంద్ర‌బాబు దెబ్బ‌తో వైసీపీ - జ‌న‌సేన - బీజేపీ ఉక్కిరిబిక్కిరి..?

Submitted by lakshman on Tue, 04/10/2018 - 11:16

ఏపీలో ఎన్నిక‌ల రాజ‌కీయం వేడెక్కుతుంది. హ‌స్తిన‌లో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక‌హోదా దిశ‌గా మారిన పోరాటం..ఇప్పుడు స్వ‌లాభం కోసం ఎవ‌రి పోరాటం వారు చేస్తున్నారు. వైసీపీ  ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తుంది. జ‌న‌సేన - లెఫ్ట్ పార్టీలు రాష్ట్రంలో ప‌ర్య‌ట‌న‌లు చేపట్టేందుకు కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించాయి. దీంతో అన్నీ పార్టీల నాయ‌కులు ప్ర‌త్యేక‌హోదా కోసం ఒకే తాటిపై కాకుండా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌చందంగా వ్య‌వ‌హరిస్తున్నారు. 

కన్నతండ్రే కాలయముడయ్యాడు

Submitted by arun on Mon, 01/22/2018 - 12:52

ఓ యువతికి కన్నతండ్రే కాలయముడయ్యాడు. కన్నకూతురని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టాడు. 
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 రోజులుగా గదిలో బంధించి నరకం చూపించాడు. తాగుబోతు తండ్రి టార్చర్ భరించలేక పోలీసులను ఆశ్రయించడంతో విముక్తి లభించింది
.

ఈడొచ్చిన కూతురన్న ఇంగితం లేదు. పరువు బజారున పడుతుందన్న బెంగా లేదు. తన పంతం నెగ్గించుకొనేందుకు మూడు వారాలపాటు గదిలో నిర్బంధించాడు. తన మాట వినడం లేదని తిండీ, నీళ్లు ఇవ్వలేదు. నోరు తెరిస్తే కుక్కని తన్నినట్టు తన్నులు. గదమాయింపులు. కనీసం పలకరింపుకు నోచని ఆ యువతి చుట్టూ అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా సొంత ఇంట్లోనే పరాయిదైంది. 

పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్ధిని

Submitted by arun on Fri, 01/19/2018 - 11:45

తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్‌లో దారుణం జరిగింది. హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్ధి పెళ్లి కాకుండానే తల్లైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  జనవరి ఒకటో తేదిన ఓ బిడ్డకు జన్మనిచ్చింది విద్యార్ధిని. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్సు అధికారులు విచారణకు ఆదేశించారు. సిబ్బంది నిర్లక్ష్యం బయటపడటంతో అధికారులు నలుగురు వార్డెన్లలకు మెమోలు జారీ చేశారు.  మూడు వేల మంది చదివే కాలేజ్‌లో ఇలాంటి ఘటన జరగడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.