nara lokesh

నారా కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తి రూ.88.68 కోట్లు

Submitted by arun on Thu, 11/22/2018 - 10:53

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల వివరాలను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వరుసగా ఎనిమిదో సారి ఆస్తుల వివరాలను ప్రకటించారు. కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 88.68 కోట్లు అని లోకేష్ చెప్పారు. చంద్రబాబు నికర ఆస్తి విలువ కన్నా ఆయన మనుమడు దేవాన్ష్ పేరున 15 కోట్ల ఆస్తులు అదనంగా ఉన్నాయి.

చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన లోకేశ్

Submitted by arun on Wed, 11/21/2018 - 18:03

ప్రతి ఏడాది ఆస్తుల వివరాలను ప్రకటిస్తూ వస్తున్న చంద్రబాబు కుటుంబం ఈ సారి కూడా అదే పంథాను కొనసాగించింది. కుటుంబ ఆస్తుల వివరాలను పంచాయతీ శాఖామంత్రి లోకేష్‌ వెల్లడించారు. రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలనీ, అందుచేతే తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేకున్నా ఆస్తుల వివరాలు ప్రకటిస్తూనే వస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, చంద్రబాబు కుటుంబం తమ ఆస్తుల వివరాలను ప్రకటించడం ఇది ఎనిమిదోసారి.
 
ఆస్తుల వివరాలు:
 
చంద్రబాబు పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 2.9 కోట్లు
 
నారా భువనేశ్వరి ఆస్తుల విలువ రూ. 31.01 కోట్లు
 

అధికారులకు లోకేష్ వార్నింగ్

Submitted by arun on Tue, 10/16/2018 - 14:58

విపత్తు సంభవించినప్పుడు ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పంచాయితీరాజ్‌ మంత్రి లోకేష్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన లోకేష్‌ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా మందసలోనే మకాం వేసిన లోకేష్‌ ప్రజలతో మమేకమై సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. తుపాను బాధితుల సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు మంత్రి లోకేష్‌.
 

ఆపరేషన్‌ గరుడలో భాగమే

Submitted by arun on Fri, 10/12/2018 - 12:10

ఏపీలో ఐటీ దాడులపై మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోడీ ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని నిలదీసినందుకు ఆంధ్రప్రదేశ్‌పై మోడీ కక్ష గట్టారని విమర్శించారు. కడప ఉక్కు...ఆంధ్రుల హక్కు అని అన్నందుకే ఎంపీ సీఎం రమేష్‌ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కి తగ్గేది లేదన్నారు. కేంద్రం మెడలు వంచుతామని హోదా సాధిస్తామని ట్విట్టర్‌లో లోకేష్‌ స్పష్టం చేశారు.

ఏపీకి మరో ఐటీ కంపెనీ

Submitted by arun on Mon, 10/08/2018 - 10:50

నవ్యాంధ్రకు మరో ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కంపెనీలకు ఐటీ సేవలు అందిస్తున్న దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో మొదటి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఐటీ మంత్రి నారా లోకేశ్ ఈ మధ్యహ్నం మూడు గంటలకు భూమి పూజ నిర్వహించనున్నారు. హెచ్‌సీఎల్ అధినేత శివ్‌నాడార్ కుమార్తె, సంస్థ సీఈవో రోషిని నాడార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈసీ ప్రకటనతో వైసీపీ డ్రామాలు బట్టబయలు

Submitted by arun on Sun, 10/07/2018 - 10:28

వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన పార్లమెంట్‌ స్థానాలకు ఉపఎన్నికలు రావంటూ సీఈసీ స్పష్టం చేయడంతో మంత్రి నారా లోకేష్‌ ట్విట్టర్లో స్పందించారు. ఉపఎన్నికలు రావని తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలాడారని... ఈసీ ప్రకటనతో లోపాయికారి ఒప్పందం బహిర్గతమైందని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను కేంద్రానికి తాకట్టు పెట్టాలని ప్రయత్నించిన జగన్ కుయుక్తులకు ప్రజలే సమాధానం చెబుతారని లోకేశ్ అన్నారు.
 

ఏపీలో ముందస్తు ఎన్నికలపై మంత్రి లోకేష్ స్పందన

Submitted by arun on Thu, 09/13/2018 - 12:57

ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనేది ప్రచారం మాత్రమేనని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడ్డ మొదటి ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉండాలనేది ప్రజల సెంటిమెంట్ అని లోకేష్ వ్యాఖ్యానించారు. అయినా ముందస్తు ఎన్నికల మూడ్‌లో ఏపీ ప్రజలు లేరన్నారు. అసలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ అధికారం చేపట్టేది తెలుగుదేశం పార్టీదేనని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో ప్రతి నిమిషం నిమగ్నమయ్యామన్నారు. తెలంగాణలో ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలని ప్రజల కోరిక అని అయితే ఐదేళ్ల పాటు తెలంగాణలో ప్రభుత్వం నడవకపోవడం విచారకరమని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.

బీజేపీ, కేసీఆర్‌ లపై లోకేష్ ఫైర్..

Submitted by arun on Sat, 09/08/2018 - 13:10

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ బాబు బీజేపీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌  పై విమర్శలు చేశారు. శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం లో లోకేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే కెసిఆర్ అది చేస్తున్నాడని విమర్శించాడు. కేంద్రం ఆదేశాల అనుగుణంగానే కెసిఆర్ తన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్‌పై మంత్రి నారాలోకేష్‌ సెటైర్లు

Submitted by arun on Fri, 09/07/2018 - 11:56

కేసీఆర్‌పై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన తెలుగు వాళ్లంతా కలుసుండాలని  ఓ వైపు చెబుతూనే మరో వైపు జాగో  బాగో అంటున్నారన్నారు. టీఆర్ఎస్‌లో టీడీపీ వాళ్లు ఎంత మంది ఉన్నారో అందరికి తెలుసంటూ వ్యాఖ్యానించిన లోకేష్‌ ఆంధ్రుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తన పక్కలో కూర్చోబెట్టుకున్నారన్నారు. ఆంధ్రా వాళ్ల ఓట్లతోనే టీఆర్ఎస్‌‌కు జీహెచ్‌ఎంసీ పీఠం దక్కిందన్నారు.  తెలంగాణ అసెంబ్లీ రద్దు ఆమోదం పొందిన సమయంలో నారాలోకేష్ కామెంట్స్ ఆసక్తి కరంగా మారాయి.  

2వేల నోటు రద్దు చేయాలి: లోకేశ్‌

Submitted by arun on Tue, 08/21/2018 - 09:06

రూ.2 వేల నోట్లను రద్దు చేయాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దేశంలో రూ.500కు మించి పెద్ద నోటు ఉండకూడదన్నది తమ విధానమని, రూ.2 వేల నోటు వల్ల దేశంలో అవినీతి మరింత పెరిగే అవకాశం ఉందని నారా లోకేశ్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.  సచివాలయంలో ఐసీఐసీఐ బ్యాంకు శాఖను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దు కోసం 2012 నుంచి సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని చెప్పారు. గతంలో తాను నగదు బదిలీ పథకం అంటే అందరూ నవ్వారని, ఇప్పుడు అదే దేశానికి మార్గదర్శకం కాబోతుందన్నారు.