tdp mp galla jayadev

ప‌వ‌న్ పై సెటైర్లు వేసిన టీడీపీ ఎంపీ

Submitted by lakshman on Sun, 01/14/2018 - 13:41

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీ గ‌ల్లాజ‌య్ దేవ్ సెటైర్లు వేశారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మను గెలిపించింది ప‌వ‌న్ క‌ల్యాణే అని టీడీపీ - బీజేపీ నేత‌లు చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే కొద్దిరోజుక్రితం ప‌వ‌న్ క‌ల్యాణ్ పోల‌వ‌రం సంద‌ర్శించి టీడీపీ ఎంపీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కొంత‌మంది ఎంపీలు పోల‌వ‌రాన్ని గాలికొదిలేసి - వ్యాపారాలు చూసుకుంటున్నార‌ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై  కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పవన్ ఎవరో తనకు తెలీదంటూ వ్యాఖ్యానించారు.