Maharashtra

ప్రభుత్వానికి షిర్డీ ఆలయ ట్రస్ట్ రూ.500 కోట్ల సాయం

Submitted by chandram on Mon, 12/03/2018 - 10:36

మహారాష్ట్ర ప్రభుత్వానికి షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్  500 కోట్ల సాయాన్ని అందజేస్తోంది. మహారాష్ట్రలోని ప్రవర నదిపై ఉన్న నీల్‌వాండే డ్యామ్‌ కాలువ వ్యవస్థ నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్టు ట్రస్ట్ ప్రకటించింది. కాలువల నిర్మాణం వల్ల అహ్మద్‌నగర్ జిల్లాలోని సంగమ్నెర్, అకోల్, రహత, రాహురి, కోపర్గావ్ తహసీళ్లలోని 182 గ్రామాలతో పాటు నాసిక్‌లోని సిన్నార్‌కు లబ్ధి చేకూరుతుంది. మహారాష్ట్ర అహ్మదానగర్ జిల్లాలోని షిర్డీలో సెయింట్ రిటైలింగ్ స్థలాన్ని నిర్వహిస్తున్న శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఒక డ్యామ్‌కు కాలువ నెట్‌వర్క్ నిర్మించేందుకు 500 కోట్ల రూపాయలను అందిస్తుంది.

మరాఠాల రిజర్వేషన్లు ..అసెంబ్లీలో బిల్లు పాస్‌

Submitted by chandram on Thu, 11/29/2018 - 15:39

ఎట్టకేలకు మరాఠాలకు తీపి కబురు అందించింది మహారాష్ట్ర సర్కార్. సర్కారు కొలువుల్లో, విద్యారంగంలో తమకు 16శాతం రిజర్వేషన్ కల్పించాలని మరాఠాలు కొరిన విషయం తెలిసిందే. కాగా నేడే మరాఠా కోటా బిల్లును మహారాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభలో ఇలా ప్రకటించరో లేదో అప్పుడే మూజువాణి ఓటు ద్వారా దానిని పాస్ చేయడం విశేషం. వెంటనే బిల్లును ఎగువ సభకు పంపారు. బిల్లుకు ఆమోదం తెలిపిన ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థులకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కృతజ్ఞతలు తెలిపారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గత కొన్నాళ్లుగా మహారాష్ట్రలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఖాకీ పైశాచికం..మహిళపై అత్యాచారం

Submitted by chandram on Sat, 11/24/2018 - 14:31


కాపాడాల్సిన రక్షకుడే ఓ మహిళపై కాటేశాడు. అవును పోలీసే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసు ఠాణాలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవడానికి వచ్చిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. ఇటివల మహిళపై అత్యాచారానికి చేసిన దుండగుడిపై ఫిర్యాదు మేరకు స్నేహితుడిపై ఇచ్చిన ఫిర్యాదును వెన్నక్కితిసుకోవడానికి వచ్చిన మహిళపై పోలీసు అత్యాచారం చేశారని బివాండిలోని కొంవాగ్ పోలీసులు తెలిపారు.

లండన్‌లో అంబేద్కర్ నివసించిన ఇల్లు

Submitted by arun on Sat, 11/17/2018 - 17:00

లండన్‌లో అంబేద్కర్ నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించిన రాష్ర్టం ఎదో మీకు తెలుసా! లండన్‌లో అంబేద్కర్ నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించిన రాష్ర్టం మహారాష్ట్ర. 1920 దశకంలో అంబేద్కర్ లండన్‌లో ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాన్ని మ్యూజియంగా మార్చాలని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీ.కో.

ఆన్‌లైన్‌ అమ్మకాలు... మందుబాబులకు ఇక హద్దేముంది??

Submitted by santosh on Mon, 10/15/2018 - 12:56

ఎన్ని అనర్థాలు జరుగుతున్నా.. ఎన్ని విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నా.. ప్రభుత్వాలెన్ని మారినా.. మద్యపానాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నాయి. ఖజానాను నింపే మద్యం మాలక్ష్మీని వదిలిపెట్టేందుకు సర్కారు ససేమీరా అంటోంది. అంతేకాదు.. అదే మద్యంపై వచ్చే రాబడిని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనల్ని అన్వేషిస్తున్నాయి. అందులో భాగంగానే ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలకు మహారాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

మద్యం ప్రియులకు సూపర్ న్యూస్

Submitted by arun on Mon, 10/15/2018 - 10:17

ఎన్ని అనర్థాలు జరుగుతున్నా ఎన్ని విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ప్రభుత్వాలెన్ని మారినా మద్యపానాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నాయి. ఖజానాను నింపే మద్యం మాలక్ష్మీని వదిలిపెట్టేందుకు సర్కారు ససేమీరా అంటోంది. అంతేకాదు అదే మద్యంపై వచ్చే రాబడిని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనల్ని అన్వేషిస్తున్నాయి. అందులో భాగంగానే ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలకు మహారాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

మహారాష్ట్ర ధర్మాబాద్‌లో టెన్షన్‌...తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Submitted by arun on Fri, 09/21/2018 - 10:21

మహారాష్ట్ర ధర్మాబాద్‌లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. బాబ్లీ వ్యతిరేక పోరాట కేసులో ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 16మందికి ధర్మాబాద్‌ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌పై ఈరోజు విచారణ జరగనుంది. దాంతో ఈ కేసుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు వారెంట్‌పై చంద్రబాబు రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో న్యాయస్థానం ఎలా స్పందింస్తుందోనన్న టెన్షన్‌ నెలకొంది. 

పంట రుణానికి వెళ్లిన రైతు భార్యను కోరిక తీర్చమన్నాడు..!

Submitted by arun on Sat, 06/23/2018 - 17:54

పంట రుణం కోసం తన భర్తతో కలిసి బ్యాంకుకు వెళ్లిన ఓ రైతు భార్యను ఆ బ్యాంక్ మేనేజర్ అడగరాని కోరిక అడిగాడు. తాను చెప్పినట్టు వింటే అడిగినంత రుణం మంజూరు చేస్తానని ఆశ చూపాడు. రైతు భార్య ఫిర్యాదుపై బుల్దానా జిల్లా మల్కాపూర్ తహసిల్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌పై పోలీసులు శుక్రవారంనాడు కేసు నమోదు చేశారు. బుల్దానా జిల్లా మల్కాపూర్‌ మండలంలో నివసిస్తున్న రైతు దంపతులు.. లోన్‌ కోసం జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఆశ్రయించారు. అయితే బ్యాంక్‌ మేనేజర్‌ రాజేష్‌ హివాసె సదరు మహిళపై కన్నేశాడు.

పిల్లోడి పేరు ఖరారు కోసం ఎన్నికలు

Submitted by arun on Wed, 06/20/2018 - 14:21

పిల్లలకు నామకరణం అనేది మనదేశంలో చాలా సింపుల్‌‌గా జరిగే కుటుంబ వేడుక. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ జంట తమ పిల్లాడికి పేరును వినూత్నంగా పెట్టారు. ఎన్నికల తరహాలో పోలింగ్ నిర్వహించి నామకరణోత్సవం నిర్వహించారు. బంధు, మిత్రులను ఆశ్చర్యపరిచారు. మహారాష్ట్రలోని  గోండియాకి చెందిన మిథున్, మన్షి బంగ్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించాడు. జాతకం ప్రకారం అతడు భవిషత్యులో రాజకీయ నాయకుడు అవుతాడని తెలిసింది. దీంతో ఎన్నికల ద్వారా వినూత్నంగా బాబుకు  పేరు పెడితే బాగుంటుందని తల్లిదండ్రులు నిర్ణయించారు. 

లీటర్ పెట్రోల్‌పై రూ.4 తగ్గింపు.. టూవీలర్లకు మాత్రమే

Submitted by arun on Thu, 06/14/2018 - 17:06

ఇటీవలి కాలంలో పెట్రో ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) వినియోగదారులకు కాసింత ఊరట కల్పించాలని భావించింది. గురువారం ఎంఎన్‌ఎస్‌ అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే జన్మదినాన్ని పురస్కరించుకుని.. వాహనదారులకు 4 నుంచి 5 రూపాయల మేర తగ్గింపుపై పెట్రోలు అందించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. అందులో భాగంగా  ఈ రోజు రాష్ట్రంలో ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల్లో  ద్విచక్ర వాహనదారులకు ఈ సదుపాయం కల్పించింది. మరికొన్ని చోట్ల  9 రూపాయల వరకు కూడా తగ్గింపు ఇస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు ట్యాంక్‌ ఫుల్‌ చేయించుకుంటున్నారు.