Sports

ఆస్ట్రేలియాకు టీమిండియా పయనం

Submitted by chandram on Fri, 11/16/2018 - 18:01

ఆస్టేలియాతో తడోపెడో తెల్చుకోవాడినికి నేడు భారత క్రిక్రెటర్స్ ఆస్టేలియాకు పయనమయ్యారు. బుమ్రా, రోహిత్ శర్మ, మనీశ్ పాండే, కుల్ దిప్ యాదవ్, రిషబ్ పంత్, చాహల్, శిఖర్ తదితరులు బయల్దేరారు. ఇక్కడ మొత్తం 4 టెస్టులు, మూడు వన్డేలు, 3 టీ20ల్లో తలపడనుంది. ఇప్పటివరకు ఒక్కసారి కుడా గెలవని భారత్ ఈసారి ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని టీమిండియా తహతహలాడుతోంది. మరో 13 వన్డేలు మాత్రమే ఉండటంతో జట్టులో ఎలాంటి మార్పులు చేర్పులు చేసేదిలేదని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి చెప్పిన విషయం తెలిసిందే, గత ఆసీస్‌ పర్యటనతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా పరిణతి సాధించానని కోహ్లీ స్పష్టం చేశారు.

ఆసీస్‌-టీమిండియా పూర్తి షెడ్యూల్‌

Submitted by nanireddy on Thu, 11/15/2018 - 20:16

ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లో కరీబియన్ జట్టును మట్టికరిపించిన భారత జట్టు.. ఇప్పుడు విదేశీ గడ్డపై మరో పోరుకు సిద్ధమవుతోంది. త్వరలో అసీస్(ఆస్ట్రేలియా) తో  మూడు టీ20లు, నాలుగు టెస్టులు, అలాగే మూడు వన్డేల్లో ఆడనుంది టీమిండియా. నవంబర్ 21న తొలి టీ20 తో సిరీస్ ప్రారంభమవుతోంది. కాగా టీమిండియా అసీస్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. 

టీ20 సిరీస్‌ షెడ్యూల్‌

1st T20: నవంబర్ 21 - గబ్బా, బ్రిస్బేన్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)
2nd T20: నవంబర్ 23 - ఎంసీజీ, మెల్‌బోర్న్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)
3rd T20: నవంబర్ 25 - ఎస్‌సీజీ, సిడ్నీ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

క్రికెట్ కు ఇక సెలవు..

Submitted by nanireddy on Sun, 11/11/2018 - 08:53

ఒకప్పటి భారత పేస్‌బౌలర్‌ మునాఫ్‌ పటేల్‌(35) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశాడు మునాఫ్..  'ఇప్పటి వరకు చాలామందితో కలిసి ఆడాను. వారిలో ధోని తప్ప దాదాపు అందరూ తప్పుకున్నారు. మిగతావారు ఆడుతూ నేను రిటైర్మెంట్‌ ప్రకటిస్తే ఎక్కువ బాధ ఉండేది. ఇక వైదొలగాల్సిన సమయం వచ్చేసింది'  అని ప్రకటనలో పేర్కొన్నాడు.  కాగా 2006లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతను మొత్తం 13 టెస్టుల్లో 35 వికెట్లు... 70 వన్డేల్లో 86 వికెట్లు... 3 టి20ల్లో 4 వికెట్లు తీశాడు. దాదాపు ఆరేళ్లుగా వివిధ కారణాలతో  జట్టుకు దూరంగా ఉంటున్నారు.

రికార్డుల తారాజువ్వ..

Submitted by nanireddy on Wed, 11/07/2018 - 09:45

లక్నో లో జరిగిన భారత్‌-వెస్టిండీస్‌ రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగులతో సునాయాస విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో విండీస్‌ చతికిలబడింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగలిగింది. ఖలీల్‌ అహ్మద్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ రెండేసి వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-0 తో సొంతం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలున్న వ్యక్తి గంట కొట్టడమా?.. అజారుద్దీన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 11/06/2018 - 11:38

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి సంకేతంగా గంట మోగించే గౌరవాన్ని మహ్మద్ అజరుద్దీన్ కు బీసీసీఐ కల్పించింది.

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్

Submitted by nanireddy on Tue, 11/06/2018 - 08:39

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్ అజమ్‌ బ్రేక్ చేశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో బాబర్‌ 58 బంతుల్లో 78 పరుగులు సాధించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 48 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఈ ఓపెనర్‌.. వేగవంతంగా వెయ్యి పరుగులు చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లి 27 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధిస్తే.. బాబర్‌ 26 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు చేసి ఇప్పటివరకు కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు.

తడబడ్డా నిలబడ్డారు

Submitted by nanireddy on Sun, 11/04/2018 - 23:04

ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మొదటి t20 లో టీమిండియా జట్టు విజయం సాధించింది. విండీస్ విధించిన 110 పరుగుల లక్షాన్ని భారత్ 17.5 ఓవర్లలో సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్‌ దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 109 పరుగులు చేసింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్‌(6), ధావన్‌(3) వెనువెంటనే అవుట్ అయ్యారు.  ఓ దశలో భారత్‌ విజయానికి ఎదురీదింది. కానీ తడబడ్డా నిలబడ్డారు.

నిలకడగా ఆడుతున్న భారత్..

Submitted by nanireddy on Sun, 11/04/2018 - 21:16

వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి t20 మ్యాచ్ లో చివరి రెండు ఓవర్లలో విండీస్‌ ఆటగాళ్లు ధాటిగా ఆడటంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో విండీస్‌ 22 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా, ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, కృనాల్‌ పాండ్యాలకు ఒక్కో వికెట్‌ దక్కింది. విండీస్‌ భారత్‌కు 110 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోయింది. ఆ వెంటనే శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు.

కష్టాల్లో వెస్టిండీస్‌..

Submitted by nanireddy on Sun, 11/04/2018 - 20:00

మొదట టెస్టు సిరీస్‌ తరువాత వన్డే సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా.. రెట్టించిన ఉత్సహంతో టీ20 సిరీస్‌లోనూ వెస్టిండీస్‌తో చీల్చిచెండాడటానికి భారత్‌ సిద్ధమైంది. మూడు t20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. బ్యాటింగుకు దిగిన విండీస్ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 63 పరుగులు చేసి కష్టాల్లో పడింది.  క్రీజులో అలెన్, పాల్ ఉన్నారు. కాగా గాయం కారణంగా హార్ధిక్‌ పాండ్యా మ్యాచ్‌కు దూరం కావడంతో అతని సోదరుడు కృనాల్‌కు అవకాశం దక్కింది.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు సెహ్వాగ్ గుడ్ బై..

Submitted by nanireddy on Sun, 11/04/2018 - 08:42

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వచ్చే సీజన్‌లో తాను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా వ్యవహరించడం లేదని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రకటించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుతో తన కాంట్రాక్టు రద్దు చేసుకున్నట్లు సెహ్వాగ్ తెలిపాడు. 2014, 2015లలో కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుతరఫున ఆడిన సెహ్వాగ్‌ ఆ తర్వాత మూడు సీజన్‌లుగా మెంటార్‌ పాత్ర పోషించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌ గా వీరేంద్ర సెహ్వాగ్ సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.