supreme court

నేరం రుజువైతే ఈయనకూ అదే శిక్ష...?

Submitted by arun on Mon, 09/17/2018 - 11:41

ప్రణయ్ హత్య కేసులో నిందితులను పోలీసులు ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రణయ్ భార్య అమృత డిమాండ్ చేస్తుంది. క్యాస్టిజం మీద పోరాటం సాగిస్తానని, అందరూ తనకు మద్దతునివ్వాలని అమృత కోరుతోంది. మా డాడీ కనిపిస్తే నేనే చంపేస్తానని చెబుతోంది అమృత. పోలీసులు మొదటి నుంచి తమకు సపోర్టు చేశారని, 10, 11 రోజుల్లో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆమె చెప్పారు. పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అత్యంత హేయమైన, అనాగరికమైన ఈ చర్యలను సమూలంగా నిర్మూలించాలని పేర్కొంది.

ప్రియా వారియర్ కు సుప్రీంకోర్టులో ఊరట

Submitted by arun on Fri, 08/31/2018 - 13:40

ఒరు అదార్ లవ్ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలో కన్నుగీటే సన్నివేశంతో నటి ప్రియా వారియర్ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీన్ తో ప్రియకు ఎంత స్టార్ డమ్ వచ్చిందో ఇబ్బందులు కూడా అలాగే ఎదురయ్యాయి. ఆమెపై పలుచోట్ల కేసులు దాఖలయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో  ప్రియా వారియర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాదాపు నాలుగు నెలల పాటు విచారణలో ఉన్న ఈ కేసులో ప్రియా ప్రకాశ్‌కు ఊరటనిస్తూ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రియా ప్రకాష్‌పై కేసును కొట్టివేయడమే కాక..

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం సంచలన తీర్పు

Submitted by arun on Wed, 07/18/2018 - 15:59

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. పురుషులతో పాటు మహిళలకూ కూడా సమాన హక్కులున్నాయని గుర్తుచేసింది శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం మహిళా హక్కులకు ప్రత్యేక చట్టాలు అవసరం లేదని అభిప్రాయపడింది కోర్టు. శబరిమల ఆలయంలోకి ఎవరైనా వెళ్లొచ్చని ఆలయాలు ప్రైవేట్ ప్రాపర్టీ కాదని తేల్చి చెప్పింది. ఆలయాల్లోకి వెళ్లి ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చని తెలిపింది సుప్రీంకోర్టు.

సుప్రీం వార్నింగ్....వదంతులు, పుకార్లతో జనాన్ని కొట్టి చంపడమేంటి?

Submitted by arun on Wed, 07/18/2018 - 13:49

గో సంరక్షణ పేరుతోనో, వాట్సాప్‌ వదంతులతోనో, జనాలపై దాడి చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు వార్నింగ్‌ ఇచ్చింది...అవును. గో సంరక్షణ పేరుతో బడుగులపై దాడి చేేసేవారి తాటతీయాలని సుప్రీంకోర్టు స్పష్టాతిస్పష్టంగా ఆదేశాలిచ్చింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వదంతులతో జనాన్ని కొట్టి, చంపేస్తున్న మూకలు కటకటాలు లెక్కించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అతి త్వరలో పార్లమెంటులో చట్టం చేయాలని స్పష్టం చేసింది.

తాజ్‌మహల్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 07/11/2018 - 17:11

తాజ్‌మహల్‌ సంరక్షణపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు తాజ్‌ మహల్‌ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ లేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా తాజ్‌ మహల్‌ వంటి ప్రపంచ అద్భుతాన్ని పట్టించుకోకపోతే దాన్ని మూసివేస్తామని హెచ్చరించింది.‘‘తాజ్ మహల్‌ను పునరుద్ధరించండి లేదా కూల్చేయండి. లేకుంటే మేమే తాజ్‌మహల్‌కు తాళం వేయాల్సి ఉంటుంది...’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాజ్ మహల్‌ను కాపాడి, పరిరక్షించడంపై స్పష్టమైన విధానాన్నిరూపొందించడంలో విఫలమైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైనా సుప్రీం మండిపడింది.

ఏపీ నోట్లో మట్టికొట్టినట్టేనని కోర్టు సాక్షిగా ముద్ర వేసింది..

Submitted by arun on Thu, 07/05/2018 - 11:58

ఔను. వాళ్లు మాట తప్పారు. మడమ తిప్పామని మళ్లీ చెప్పుకున్నారు. వాగ్ధానభంగం కలిగించామని సగర్వంగా ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇచ్చిన హామిని, తుంగలో తొక్కామని న్యాయవ్యవస్థ సాక్షిగా నొక్కి చెప్పారు. వెంకన్న పాదాల చెంత జాలువారిన వరాల ప్రామిస్‌కు, తిలోదకాలిచ్చామని అఫిడివిట్‌ సమర్పించుకున్నారు. ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లామని, న్యాయదేవత ఎదుట కాలరు ఎగరేసి చాటుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేం, ఏపీకి అన్ని చేశాం...ఇక చేసేదేంలేదంటూ, సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నెల్లూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పరాభవం నిదర్శనంగా, స్టేటస్‌ వార్‌ మరింత రగులుకుంటోందా?

జస్టిస్ లోయా మృతిపై సుప్రీం సంచలన తీర్పు

Submitted by arun on Thu, 04/19/2018 - 11:49

సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మెరిట్ ప్రాతిపదికగా పిటిషన్లు కొట్టివేస్తున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో తెలిపారు. స్వప్రయోజనాలను ఆశిస్తూ దాఖలైన పిటిషన్లను ఎంతమాత్రం ఆమోదించేది లేదంటూ స్పష్టం చేశారు. కింది కోర్టుకు చెందిన నలుగురు జడ్జిల స్టేట్‌మెంట్లను అనుమానించేందుకు ఎలాంటి కారణాలు కనబడటం లేదని, లోయాది సహజమరణమేనని కోర్టు విశ్వసిస్తోందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొంటూ స్వతంత్ర దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్లను కొట్టివేశారు.

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారీ షాక్

Submitted by arun on Fri, 04/13/2018 - 14:22

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారీ షాక్ తగిలింది. పనామా పేపర్స్ లీక్ కేసులో.. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న నవాజ్ షరీఫ్‌.. ఇక భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా.. జీవితకాలం నిషేధం విధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62, వన్‌ ఎఫ్‌  ప్రకారం.. జీవితకాలం పాటూ నిషేధిస్తున్నట్లు అక్కడి సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈ నిషేధం సరైనదేనని.. తీర్పు సందర్భంగా ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. షరీఫ్‌తోపాటు పాకిస్థానీ తెహ్రీకె ఇన్సాఫ్ ప్రధాన కార్యదర్శి జహంగీర్ తరీన్‌పై కూడా జీవితకాల నిషేధం విధించారు.

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు

Submitted by arun on Mon, 04/09/2018 - 15:16

కావేరి బోర్డు ఏర్పాటులో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల మూడులోపు కావేరి బోర్డు ముసాయిదాను తమకు సమర్పించాలంటూ ఆదేశించింది. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు రైతులు వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్ధానం గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. తక్షణమే కావేరి బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించిన కోర్టు కేనును వచ్చే నెల మూడుకు వాయిదా వేసింది.   

ఎస్సీ ఎస్టీ చట్టం తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

Submitted by arun on Tue, 04/03/2018 - 17:20

ఎస్సీ ఎస్టీ చట్టం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన కేంద్రానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎస్సీ ఎస్టీ చట్టం అమలులో సవరణలు చేస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్రం నిన్న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు..తీర్పులో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పింది. ధర్డ్ పార్టీ పిటిషన్లు దాఖలు చేయడానికి గడువు ఇచ్చింది. తాము ఎస్సీ ఎస్టీ చట్టానికి వ్యతిరేకం కాదని రివ్యూ పిటిషన్‌ను విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.