Political

పార్టీ మార్పుపై స్పందించిన ముకేశ్ గౌడ్..!

Submitted by nanireddy on Sat, 12/16/2017 - 10:41

తెరాస లో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ స్పందించారు.. తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని, కాంగ్రెస్ ను వీడాల్సిన పరిస్థితి ప్రస్తుతం తనకు లేదని స్పష్టం చేసారు.. 2019 ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి తానే పోటీ చేస్తానని  ముఖేశ్‌ గౌడ్‌ వెల్లడించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్న ఆయన...కుమారుడు కోలుకున్నందునే ఆత్మీమ సమ్మేళనం నిర్వహించినట్లు చెప్పారు. అయితే పార్టీ మార్పు కోసం కార్యకర్తల సమావేశం నిర్వహించారన్నంటున్న వార్తలను కొట్టిపారేశారు ముకేశ్ గౌడ్..!

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీదే అధికారం

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:37

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే అధికార పీఠం దక్కించుకుంటుందని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. గుజరాత్‌లో హోరాహోరీ పోరు సాగినా బీజేపీ తిరిగి అధికారపగ్గాలు చేపడుతుందని స్పష్టం చేశాయి. 182 సీట్లున్న గుజరాత్‌లో బీజేపీకి 108, కాంగ్రెస్‌కు 74 సీట్లు దక్కుతాయని సీ ఓటర్‌ అంచనా వేసింది. టైమ్స్‌ నౌ బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 70, ఇతరులకు 3 సీట్లు వస్తాయని లెక్కగట్టింది. సహారా సమయ్ బీజేపీకి 110 నుంచి 120, కాంగ్రెస్‌కు 65 నుంచి 70 స్ధానాలు వస్తాయని పేర్కొంది. ఏబీపీ న్యూస్‌ బీజేపీకి 91-99, కాంగ్రెస్‌కు 78-86, ఇతరులకు 3-7 సీట్లు వస్తాయని వెల్లడించింది.

అనిల్ కుమార్ యాదవ్ పై జనసేన తీవ్ర విమర్శలు..!

Submitted by nanireddy on Thu, 12/14/2017 - 15:25

నెల్లూరు జిల్లా  వైసీపీ ఎమ్మెల్యే  అనిల్ కుమార్ యాదవ్ పై జనసేన పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. ఆ పార్టీ చిత్తూరు జిల్లా నేత కిరణ్ రాయల్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ పై మండిపడ్డారు.. సోషల్ మీడియాలో వైసీపీ , జనసేనలు తిట్ల పురాణంపై జరిపిన చర్చా కార్యక్రమంలో భాగంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చరిత్ర అందరికి తెలిసిందే, నెల్లూరు జిల్లాలో ఆయనొక అవినీతిపరుడు, రౌడీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.. అలాంటివారు పార్టీలో ఉంటే  ఉన్మాదులు తయారవుతారని కిరణ్ రాయల్ అన్నారు.. దీనిపై వైసీపీ విద్యార్థి విభాగం కన్వినర్ నాగార్జున యాదవ్ స్పందిస్తూ..

jayalalithas-daughter-claims-claim-be-daughter-supreme-court-rejects-dna-test

Submitted by admin on Tue, 12/12/2017 - 15:11

తమిళనాడులో వారసత్వ రాజకీయాల చిచ్చు మళ్లీ రాజుకుంటోంది. తాజాగా జయ వారసురాలినంటూ ఓ యువతి సుప్రీం కోర్టుకెక్కడంతో అమ్మ పేరిట ఉన్న ఆస్తులపై మళ్లీ చర్చ జరుగుతోంది. 

ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై మోడీకి లేక రాసిన మేకపాటి

Submitted by admin on Tue, 12/12/2017 - 15:10

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని రాజకీయ అనైతికతకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి నెల్లూరు ఎంపీ మేకపాటి లేక రాసారు.. ఇలాంటి కార్యకలాపాలు భవిషత్ లో చాల ప్రమాదకరమని, పిరాయింపుల్ని ఇలాగె ప్రోత్సహిస్తే భవిషత్ ప్రస్నార్ధకం అవుతుంది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని... పార్టీ మారిన వారిపై సభాపతులు చర్యలు తీసుకోకుండా వారిని ప్రోత్సహించడం సరికాదన్నారు. అలాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వడం మరీ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదిని కోరారు.

కాంగ్రెస్ సీనియర్ నేత సస్పెండ్..!

Submitted by admin on Tue, 12/12/2017 - 15:03

సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ కు కాంగ్రెస్‌ పార్టీ భారీ షాక్‌ ఇచ్చింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు  ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేయటంతోపాటు, ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ‘నీచ్‌ ఆద్మీ’ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కాగా, మణిశంకర్‌ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని అయ్యర్‌ పై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ కీలక నేతలు ఒక్కోక్కరుగా మణిశంకర్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థామయిలో మండిపడ్డారు కూడా.

అది పరిష్కారం కాకుంటే ఉద్యమానికి దిగుతా : పవన్

Submitted by admin on Tue, 12/12/2017 - 15:02

ఫాతిమా కాలేజ్‌ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు అనుభవించడం కరెక్ట్‌ కాదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. విద్యార్థులను రీలొకేట్‌ చేయడానికి సమస్యేంటో అర్థం కావడం లేదని... అసలు విద్యార్ధులు చేసిన తప్పేంటో చెప్పాలంటూ ప్రశ్నించారు. సమస్య పరిష్కారం ఢిల్లీలోనే ఉందంటే.. ఢిల్లీనే ఇక్కడి లాక్కొద్దామన్న పవన్‌... వారం రోజులు సమయం ఇవ్వండి.. దీనిపై నేను మాట్లాడుతానన్నారు. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే భయపడకండీ.. మీ వెనక జనసేన ఉందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దని.. ఫాతిమా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకుంటే... వారితో కలిసి తాను కూడా ఉద్యమానికి దిగుతానాని హెచ్చరించారు.

ఆ విషయంలో నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది : కత్తి మహేష్

Submitted by admin on Tue, 12/12/2017 - 15:00

నిత్యం ఏదో ఒక దానిపై తన  భావాన్ని వ్యక్తపరుస్తూ రాజకీయనాకులు , సినీ దిగ్గజాలపై మండిపడుతుంటారు ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ తాజాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మరోసారి ఘాటు విమర్శలు చేసారు అయన ఏమి మాట్లాడారో అయన మాటల్లోనే చూడండి " మోడీ లాంటి నరహంతకుడితో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను, మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా! ప్రధానమంత్రి అయినంత మాత్రమేనా మోడీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతోందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్." అని అన్నారు..

సీఎం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై.. వైసీపీ విమర్శలు..!

Submitted by admin on Tue, 12/12/2017 - 14:59

ఏటా తమ ఆస్తుల జాబితా ప్రకటించినట్టుగానే ఈ సంవత్సరానికి గాను తమ కుటుంభం ఆస్తులు ప్రకటించేసేసారు నారా ఫామిలీ.. తమ ఆస్తులు, అప్పులు మొత్తం ఇవేనంటూ ఇవాళ మంత్రి నారా లోకేష్ ఒక జాబితాను ఇచ్చారు.. దీనిపై  ప్రతిపక్ష వైసీపీ మండిపడుతుంది.. సరైన ఆస్తులు ప్రకటించకుండా డమ్మీ వివరాలు ఎంత తక్కువ ఇస్తే ఏమి ప్రయోజనం, అసలు వీరి ఆస్తుల గురించి ఎవరడిగారు.. రాష్ట్రంలో ఎవరి ఆస్థి ఎంతో ప్రజలకు బాగా తెలుసునని విమర్శలు చేస్తుంది.. కాగా వైసీపీకి మద్దతుగా ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం తీవ్ర స్థాయిలో చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ పై విరుచుకు పడుతుంది..

ప్రజల నాడి పట్టేసిన ప్రశాంత్ కిషోర్..!

Submitted by admin on Tue, 12/12/2017 - 14:59

జగన్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఊళ్లు దాటుకుంటూ.. జన సందోహం మధ్య ఒక ప్రవాహంలా సాగిపోతోంది. ఇప్పటికే కడప నుంచి కర్నూల్, కర్నూల్ నుంచి అనంతపురం లోకి ప్రవేశించిన జగన్ రోజు రోజుకూ పాదయాత్ర స్పీడ్ పెంచుతున్నారు.. ఇప్పటికే నాలుగువందల  కిలోమీటర్లు దాటేసిన జగన్ యాత్ర.. రోజు రోజుకూ జోష్ నింపుకుంటూ ముందుకు సాగుతోంది.. జగన్ పేరు చెబితే చాలు జనం తరలి వస్తారు.. ఆయన ప్రసంగాలను ఓపికగా వింటారు.. బాగా స్పందిస్తారు.. పార్టీ పెట్టిన నాటి నుంచీ.. నేటి వరకూ జగన్ కు కనిపిస్తున్న  ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.. కానీ ఈ ఆదరణ ఓట్లుగా మారకపోవడమే కలవర పెడుతోంది. అధికారం దక్కక ఓపక్క నిరాశపడుతుంటే..