hyper aadi

జనసేన కవాతు...రాజమండ్రి చేరుకున్న హైపర్ ఆది

Submitted by arun on Mon, 10/15/2018 - 11:17

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కవాతులో పాల్గొనేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పవన్ హార్డ్‌కోర్ ఫ్యాన్‌గా గుర్తింపు పొందిన హైపర్ ఆది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి చేరుకున్నారు. పవన్‌ చేపట్టిన ఈ యాత్రలో  కార్యకర్తలతో కలిసి పాల్గొంటానంటూ ఆది ప్రకటించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా జనసేనాని కాసేపట్లో భారీ కవాతు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ధవళేశ్వరం బ్రిడ్జీపై జనసేన కవాతు జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆటగదరా శివా మూవీ రివ్యూ

Submitted by arun on Fri, 07/20/2018 - 10:32

మనం చేసిన తప్పు తెలుసుకోవాలంటే శిక్షకు మించిన మార్గం లేదు. ఆ భీతి లేకపోవడం వల్లే సంఘంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఆపే వ్యవస్థ బలహీనంగా ఉండటంతో నేర ప్రవృత్తి అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఉరిశిక్ష దీనికి పరిష్కారంగా భావించినా దాని అమలులో ఉన్న ఇబ్బందులు, అడ్డంకులు, లోపాలు ఇవన్నీ ఒక నిర్లిప్తతను సృష్టించాయి. ఈ కోణంలో గతంలో అభిలాష అనే చిరంజీవి సినిమా ఒకటి వచ్చింది కానీ అది పూర్తిగా కమర్షియల్ కోణంలో కాస్త సహజత్వానికి దూరంగా తీసింది. అందులో కథకు సంబంధించిన ఆత్మ కన్నా ఫిక్షన్ ఎక్కువగా ఉంటుంది.

జబర్దస్త్‌కి వెళ్దామని రాలేదు: హైపర్ ఆది

Submitted by arun on Wed, 06/27/2018 - 13:36

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ఎంత గొప్ప పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ మద్య జబర్ధస్త్ అంటే హైపర్ ఆది పేరు బాగా వినిపిస్తుంది.  మనోడు వేసే పంచ్ డైలాగ్స్ కి కడుపుబ్బా నవ్వుతారు.  కాస్త వ్యంగంగా ఉన్నా హైపర్ ఆది వేసే జోక్స్, పంచ్ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఆది తాను జబర్దస్త్‌కి రావడానికి కారణాలను వెల్లడించాడు. ‘‘జబర్దస్త్‌లోకి వెళ్దామన్న సెన్స్‌తో రాలేదు. ఒకచోట కూర్చొని చేసే జాబ్ నాకు బోర్ కొట్టేసింది. నాకు సరదాగా పక్కన వాళ్లను ఎంటర్‌టైన్ చేయడం వంటి ఇంట్రస్ట్ ఎక్కువగా ఉండేది. దానికి ఏది యాప్ట్ అని ఆలోచిస్తే ఇది కనిపించింది.

హైపర్‌ ఆది.. నీ తాట తీస్తా

Submitted by arun on Mon, 05/28/2018 - 13:45

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ కాలంలోనే సూపర్ పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన షోలలో ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఓ రేంజిలో పేలుతుంటాయి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఎక్కువగా పంచ్‌లు విసురుతుంటాడు. ఈ క్రమంలోనే ఆది ఇటీవల తన షోలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ సంచలనం శ్రీరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని పంచ్‌లు విసిరారు. దీనిపై శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆది మీద ఎదురు దాడికి దిగారు. ఘాటైన పదజాలంతో ఆమె ఆదిపై విరుచుకుపపడ్డారు. ఓ క్రమంలో తన కోపాన్ని ఆపుకోలేక నిన్ను బ్రతికనిచ్చేదాన్ని కాదు అంటూ వ్యాఖ్యానించారు.  ఆది వేసిన సెటైర్లపై ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె స్పందించారు.

రూ.అయిదు లక్షల జీతమిచ్చే ఉద్యోగం వదిలేశా : హైపర్ ఆది

Submitted by arun on Mon, 04/16/2018 - 13:20

"ఎవరినైనా సరే ఏడిపించడం చాలా తేలిక .. కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం. అలాంటిది అందరినీ నవ్వించే శక్తిని దేవుడు నాకిచ్చాడు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను .. ఆదరణ లభిస్తున్నందుకు ఆనందిస్తున్నాను" అంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ 'జబర్దస్త్' హైపర్ ఆది అన్నాడు. హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్ వేస్తూ.. టీవీ ముందు కూర్చున్న వాళ్లను కితకితలు పెట్టించడంలో ఇతగాడు మహా దిట్ట. షో మొదలైందంటే చాలు హైపర్ ఆది కామెడీ ఎప్పుడెప్పుడొస్తుందా అనే ఆతృత మొదలవుతుంది ప్రేక్షకుల్లో. నవ్వులతో విందు ఇచ్చే ఈయన మాత్రం తన నిజ జీవితంలో చాల కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు.

కత్తి మహేశ్ కి హైపర్ ఆది కౌంటర్

Submitted by arun on Fri, 02/02/2018 - 18:26

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా టచ్ చేసి చూడు. విక్రమ్ సిరికొండ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రవితేజ సరసన రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన కత్తి మహేశ్ రివ్యూ గా తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. కథ కలగాపులగంగా ఉందనీ .. ప్రేక్షకులను అయోమయానికి గురిచేసిందని ఆయన అన్నారు. వక్కంతం వంశీ ఇలాంటి కథను అందిస్తాడని తాను అనుకోలేదనీ, ఆయన నుంచి తాను ఇలాంటి కథను ఊహించలేదని చెప్పారు.

పవన్‌ను హీరో అనుకోవడం మానేయండి: హైపర్ ఆది

Submitted by arun on Sat, 01/20/2018 - 11:50

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఓ ట్విట్టర్ సందేశం ఇచ్చాడు. అభిమానులను పవన్‌ను హీరోగా చూడొద్దని మన నాయకుడు అని మాత్రమే అనుకోండని సూచన చేశారు. గతంలో మహేష్‌కు, ఆదికి మధ్య కూడా వివాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహేష్ విషయంలో ఇన్వాల్వ్ కావొద్దని పరోక్షంగా పవన్ అభిమానులకు హైపర్ ఆది తెలిపాడు. ‘మీ అడుగులు ఇక మంచి కోసం వేయండి. రాజకీయంలో 100మంది 100 రకాలుగా మాట్లాడుతారు అందరినీ చూడాలి.. నవ్వుకోవాలి.. వదిలేయాలి. ఆయన ఇప్పుడు ప్రజల మనిషి మన హీరో అనుకోవడం మానేయండి మన నాయకుడు అని మాత్రమే అనుకోండి.’ అంటూ ఆది ట్వీట్ చేశాడు.

పవన్ కోసం 10, త్రివిక్రమ్ కోసం 3సార్లు..

Submitted by arun on Wed, 01/10/2018 - 16:47

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో ‘అజ్ఞాతవాసి’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు విడుదలైన ‘అజ్ఞాతవాసి’ సినిమాను చూశానని, తనకు నచ్చిందని ‘జబర్దస్త్ ’ నటుడు ‘హైపర్’ ఆది అన్నాడు. ఈరోజు ఆయన మాట్లాడుతూ...తమ్ముడు, తొలిప్రేమ సమయంలో పవన్ లో ఉన్న కామెడీ టైమింగ్ మళ్లీ ఈ చిత్రంలో చూడొచ్చని తెలిపారు. ఈ సినిమా గురించి పూర్తిగా చెప్పాలంటే పవన్ కోసం పదిసార్లు, త్రివిక్రమ్ కోసం మూడుసార్లు, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, రావు రమేష్ల కోసమైతే వీలున్నప్పుడల్లా వెళ్లి చూడొచ్చన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞాతవాసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు.