trs leaders

టీఆర్‌ఎస్‌లో సీట్ల లొల్లి...తెలంగాణ భవన్‌ ఎదుట నిరసనల హోరు

Submitted by arun on Mon, 11/12/2018 - 15:09

ఆందోళనలు.. నిరసనలు..  నినాదాలు.. గొడవలు.. ఎన్నికల వేళ తెలంగాణలో ఏ పార్టీ కార్యాలయం చూసినా.. ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు.. అన్ని ఆఫీస్‌లు తాళాలతో దర్శనమిస్తున్నాయి. ఆశావహుల హంగామాతో సినిమా సీన్లు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీలింకా అభ్యర్థులను ప్రకటించకున్నా.. తమకెక్కడ టిక్కెట్‌ రాదో అని నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తమకే టిక్కెట్‌ కేటాయించాలంటూ ఆందోళనలతో తామేంటో చూపిస్తున్నారు. టీఆర్ఎస్‌ లో కూడా అసమ్మతి జ్వాల రేగింది. తెలంగాణ భవన్‌ ముందు ఆశావహులు.. ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.

బుజ్జగింపుల పర్వం పార్ట్‌-2...మిగతా 12 స్థానాల్లో ఆశావహులను...

Submitted by arun on Sun, 11/04/2018 - 14:28

గులాబీ తెరపై బుజ్జగింపుల పర్వం పార్ట్‌ టు మొదలైంది. మొన్నటి వరకు కొందర్ని దారిలోకి తెచ్చిన అధినాయకత్వం, మాటవినని మిగతా నేతలనూ చల్లబరిచేందుకు సిద్దమైంది. త్వరలో ప్రకటించబోతున్న 12 స్థానాల్లో, ఆశావహులు, మిగతా నేతలనూ పిలిపించుకుని మాట్లాడబోతున్నారు కేసీఆర్.

ఓటు కోసం కోటి తిప్పలు... ఎన్నికల వేళ ఎన్ని సిత్రాలో!!

Submitted by santosh on Wed, 10/31/2018 - 15:33

కోటి విద్యలు కూటి కొరకే.....కోటి విన్యాసాలు ఓటు కొరకే అని చెప్పుకోవాలిప్పుుడు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకెళుతోన్న టిఆర్ఎస్ అభ్యర్ధులు, కొత్త పంథా ఎంచుకున్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లగడ‌ట‌మే కాదు....ఓట‌ర్లను ఆక‌ట్టుకునేందుకు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఒక‌రు చనిపోయిన శవయాత్రల్లో పాడెల‌ను మోస్తుంటే...మ‌రొక‌రు గ‌డ్డాలు గీయ‌డం...స్నానాలు చేయించ‌డం చేస్తున్నారు. ఇలా గులాబీ అభ్యర్ధుల‌ు క్యాంపెయినింగ్‌లో చిత్ర విచిత్రాలు చూపెడుతున్నారు. దీంతో ఎన్నిక‌ల వేళ నేతల ఈ సిత్రాల‌ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు జనం.

గులాబీ సిగలో మహిళల మకుటం ఈసారైనా ఉంటుందా?

Submitted by santosh on Thu, 10/04/2018 - 14:44

ముంద‌స్తు ఎన్నిక‌ల గోదాలో దిగిన టీఆర్ఎస్ అధినేత, 105 మంది అభ్యర్థుల‌ను ప్రక‌టించారు. ఒక‌రిద్దరు సిట్టింగ్‌ల‌ను ప‌క్కన‌పెట్టినకేసీఆర్....న‌లుగురు మ‌హిళ‌ల‌కు మాత్రమే అవ‌కాశం క‌ల్పించారు. మిగిలిన ప‌ద్నాలుగు స్థానాల్లో ఇంకా అభ్యర్థుల‌ను ప్రక‌టించ‌ని గులాబీ ద‌ళ‌ప‌తి, మ‌రో ఇద్దరు మ‌హిళ‌ల‌కైనా చాన్స్ ఇస్తారా... ఇప్పటికే ఆ దిశ‌గా పోటీకి ఉవ్విళూరుతున్న మ‌హిళా నేత‌ల‌కు అవ‌కాశం ద‌క్కుతుందా...సీట్లు సాధించి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆ మహిళా నేతల కల ఫలించేనా? 

వరంగల్ టీఆర్ఎస్‌లో వర్గపోరు

Submitted by arun on Tue, 10/02/2018 - 16:06

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది. కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. 13, 14 డివిజన్లకుచెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు క్రిస్టల్ గార్డెన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, మేయర్ నరేందర్
 ఎదుటే టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో సమావేశం మధ్యలో ఆగిపోయింది. కార్యకర్తల సమావేశంలో ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ తోపులాటకు దారితీసింది. ఎంపీ, మేయర్ సర్దిచెప్పినా కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇరువర్గాల తోపులాటతో సమావేశం రసాభాసగా మారింది. చివరికి పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

కేసీఆర్ రాక కోసం నేతల ఎదురుచూపు

Submitted by arun on Fri, 09/21/2018 - 11:21

కేసీఆర్ రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు. ఒక్కసారి కేసీఆర్ ప్రచారానికి వస్తే అసమ్మతి కొలిక్కి రావడంతోపాటు తమకు బీ. ఫాం పక్కా అని అభ్యర్థులు నమ్ముతున్నారు. దీంతో వీలైనంత త్వరగా కేసీఆర్‌ను తమ నియోజకవర్గానికి రప్పించాలని చూస్తున్నారు నేతలు. స్వయంగా గులాబీ బాస్‌ను కలిసి ప్రచారానికి రావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. 

105 మంది గులాబీ అభ్యర్థుల్లో గుబులు...జాబితాలో 20 మందికి టికెట్‌ కష్టమని ప్రచారం...?

Submitted by arun on Tue, 09/18/2018 - 10:04

తాను ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల్లో కనీసం 20 మందిని మార్చేందుకు గులాబి బాస్ సిద్దమవుతున్నారా కాంగ్రెస్ కూటమి అభ్యర్ధులను ప్రకటించిన వెంటనే  టిఆర్ఎస్, పాత అభ్యర్ధులను మార్చి కొత్త అభ్యర్ధులను కేసిఆర్  తెరమీదకు తెస్తారా? అందుకే చాలా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని మొదలు పెట్టలేదా? టికెట్ల మార్పు ఆలోచన వల్లే  చాలా మంది అభ్యర్ధులను ప్రచారానికి వెళ్లనీయడం లేదా? టికెట్ కట్ చేయాల్సిన 20 మంది తాజా మాజీల జాబితాను కేసీఆర్ రెడి చేశారా? 

కేసీఆర్‌ సెంటిమెంట్ అస్త్రం...

Submitted by arun on Mon, 09/17/2018 - 11:02

అభ్యర్ధుల ప్రకటనతో రేగిన అసమ్మతిని చల్లార్చేందుకు టీఆర్ఎస్ అధినేత సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పోరాడి సాధించుకున్న  రాష్ట్రంలో అధికారం కావాలంటే  కలిసి ఉందామంటూ భావోద్యేగాలను రాజేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉంటేనే అందరికి న్యాయం జరుగుతుందంటూ కొత్త ఆశలు రాజేస్తూ అసమ్మతి నేతలను దారికి తెచ్చుకుంటున్నారు.  

అందుకే కొండా సురేఖకు టికెట్‌ ఇవ్వలేదు

Submitted by arun on Sat, 09/08/2018 - 16:12

టీఆర్‌ఎస్ పార్టీపై తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ మఖ్యనేతలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతో ఆమె టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మండిప‌డ్డారు. కొండా సురేఖ, మురళి దంపతులు స్వయంగా నా దగ్గరకు వచ్చి టీఆర్‌ఎస్ రాజకీయ జీవితం ఇవ్వాలని అడిగారు అని వినయ్ గుర్తు చేశారు. కొండా సురేఖ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వలనే ఆమెకు టిక్కెట్‌ ఇవ్వలేదని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ అన్నారు. ఉద్యమ కారులను పక్కకు పెట్టి కొండా సురేఖకు టికెట్‌ ఇచ్చి గెలిపించామన్నారు. అలాంటిది ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

కామారెడ్డి టీఆర్‌ఎస్‌లో రాజుకుంటున్న అసంతృప్తి సెగ...పార్టీ మారే యోచనలో మాజీ ఎమ్మెల్యే‌..?

Submitted by arun on Sat, 09/08/2018 - 10:11

కామారెడ్డి టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి సెగ రాజుకుంటోంది. ఎల్లారెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డికి మళ్లీ టికెట్‌ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే జనార్థన్‌గౌడ్‌ ఫైర్ అవుతున్నారు. పార్టీ మారే యోచనలో జనార్థన్‌గౌడ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సిట్టింగ్‌కు మళ్లీ టికెట్‌ ఇవ్వడంతో రాజీనామా బాటలో పలువురు నాయకులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.