nayanatara

రివ్యూ: కర్తవ్యం

Submitted by arun on Fri, 03/16/2018 - 10:45

నిర్మాణ సంస్థ‌లు: నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి ట‌్రైడెంట్ ఆర్ట్స్‌
తారాగ‌ణం: న‌య‌న‌తార‌, విఘ్నేశ్‌, రామ‌చంద్ర‌న్ దురైరాజ్‌, జీవా ర‌వి సును ల‌క్ష్మి, మ‌హాల‌క్ష్మి, వేళ రామూర్తి, త‌దిత‌రులు
సంగీతం: జిబ్రాన్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ఓం ప్ర‌కాశ్
కూర్పు: గోపి కృష్ణ‌
నిర్మాత‌లు: శ‌ర‌త్ మ‌రార్‌, ఆర్‌.ర‌వీంద్ర‌న్‌
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: గోపి నైన‌ర్‌

'డాన్' హీరోయిన్స్ ఒకే చోట‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 17:18

1978లో అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా న‌టించిన హిందీ చిత్రం 'డాన్' ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ సినిమా అప్ప‌ట్లోనే తెలుగులోనూ, త‌మిళంలోనూ రీమేక్ అయ్యింది. ఇక‌, 2006లో 'డాన్' సినిమాని అదే పేరుతో షారుఖ్ రీమేక్ చేశాడు. అందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా న‌టించింది. అలాగే త‌మిళంలో 2007లో ఆ సినిమాని 'బిల్లా' పేరుతో రీమేక్ చేస్తే హీరోయిన్ పాత్ర‌ని న‌య‌న‌తార చేసింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించాయి.

న‌య‌న్‌..నెగటివ్ ట‌చ్‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 16:27

ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కేర‌ళ కుట్టి న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ రూ.3 కోట్ల‌కి పైగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో న‌య‌న‌తార ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో ఆమెది న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ని.. ఆ పాత్ర‌లో కాస్త నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

కుంభ‌కోణం షెడ్యూల్ పూర్తిచేసిన బాల‌య్య‌

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 17:33

'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రంతో వంద చిత్రాల మైలురాయికి చేరుకున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆ త‌రువాత‌ 'పైసావ‌సూల్‌'తో మ‌రోసారి అభిమానుల ముందుకొచ్చారాయ‌న‌. ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం బాల‌య్య త‌న 102వ చిత్రంతో బిజీగా ఉన్నారు. సీనియ‌ర్ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నెల‌ రోజులుగా కుంభ‌కోణంలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. నేటితో ఆ భారీ షెడ్యూల్ పూర్త‌య్యింది.

ద్విభాషా 'న‌య‌నం'

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 17:58

కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార ప్ర‌స్తుతం రెండు తెలుగు చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.  చిరంజీవి  'సైరా న‌ర‌సింహారెడ్డి'లోనూ , బాల‌కృష్ణ 102వ చిత్రంలోనూ ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు త‌మిళ చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. న‌య‌న‌తార తాజాగా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి సంత‌కం చేసింది. యాక్ష‌న్ సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్క‌నుంది.

యాక్ష‌న్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌య‌న్‌

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 20:54

తెలుగులో 'మ‌యూరి'గా వ‌చ్చిన త‌మిళ చిత్రం 'మాయ'.. కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార కెరీర్ గ్రాఫ్‌నే మార్చివేసింది. న‌య‌న్ 'లేడీ సూప‌ర్‌స్టార్ 'అని పిలిపించుకోవ‌డానికి ఈ సినిమా కూడా ఓ కార‌ణంగా నిలిచింది. ఈ చిత్రం త‌రువాత 'డొర'తో పాటు 'అర‌మ్' త‌దిత‌ర హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన న‌య‌న‌తార‌.. తాజాగా మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సంత‌కం చేసింది.

న‌య‌న్‌కి రెండు సినిమాల్లోనూ..

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 19:40

త‌మిళంలో లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది న‌య‌న‌తార‌. అక్క‌డ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్న న‌య‌న్‌.. తెలుగులో మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. గ‌తేడాది విడుద‌లైన 'బాబు బంగారం' త‌రువాత ఏడాది గ్యాప్ తీసుకున్న న‌య‌న‌తార‌.. ప్ర‌స్తుతం రెండు తెలుగు చిత్రాల‌తో బిజీగా మారింది. ఆ రెండు సినిమాలు కూడా ప్రెస్టీజియ‌స్ మూవీస్ కావ‌డం విశేషం. చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'తో పాటు బాల‌కృష్ణ 102వ చిత్రంలోనూ న‌య‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే.. ఈ రెండు చిత్రాల్లోనూ న‌య‌న్ సోలో హీరోయిన్ కాదు. ఆమెతో పాటు మ‌రో ఇద్ద‌రు క‌థానాయిక‌లు కూడా ఉంటారు. పేరుకి ముగ్గురు హీరోయిన్లు ఉన్నా..

క్రిస్మ‌స్‌కి 'వేలైకార‌న్'

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 11:43

'త‌ని ఒరువ‌న్' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత మోహ‌న్ రాజా  ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నత‌మిళ‌  చిత్రం 'వేలైకార‌న్‌'. త‌క్కువ కాలంలోనే క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న శివ‌కార్తీకేయ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాని క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేయనున్నామ‌ని చిత్ర బృందం అధికారికంగా పేర్కొంది. 'త‌ని ఒరువ‌న్' చిత్రం తెలుగులో 'ధృవ‌'గా రూపొంది విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.  

బాల‌య్య‌తోనైనా హిట్ కొడ‌తాడా?

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 17:53

కె.ఎస్‌.ర‌వికుమార్‌.. త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ ఇచ్చిన డైరెక్ట‌ర్ పేరిది. ఆయన రూపొందించిన త‌మిళ సినిమాలు తెలుగులోనూ అనువాద‌మై మంచి విజ‌యం సాధించాయి. అదేవిధంగా టాలీవుడ్‌లో మూడు స్ట్ర‌యిట్ సినిమాలు చేశారాయ‌న‌. చిరంజీవి, మీనా జంట‌గా వ‌చ్చిన 'స్నేహం కోసం'.. నాగార్జున‌, సిమ్రాన్‌, రీమాసేన్ హీరోహీరోయిన్లుగా రిలీజైన 'బావ‌న‌చ్చాడు'.. రాజ‌శేఖ‌ర్‌, నేహా ధూపియా, తులిప్ జోషి ముఖ్య పాత్ర‌ల్లో వ‌చ్చిన 'విల‌న్'.. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రాలు. అయితే వీటిలో 'స్నేహం కోసం' ఫ‌ర‌వాలేద‌నిపించుకుంది కానీ 'బావ‌న‌చ్చాడు', 'విల‌న్' బాక్సాఫీస్  వ‌ద్ద ఘోరంగా దెబ్బ‌తిన్నాయి.

అయినా న‌య‌న్ మిస్స‌వ్వ‌డం లేదు

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 18:47

కోలీవుడ్‌లో నెం.1 హీరోయిన్‌గా రాణిస్తోంది గ్లామ‌ర్ క్వీన్ న‌య‌న‌తార‌. గ‌తేడాది సినిమాకి 3 కోట్ల రూపాయిల‌ని డిమాండ్ చేసి వార్త‌ల్లో నిలిచింది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న రెండు తెలుగు చిత్రాల్లోనూ న‌టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'లోనూ, బాల‌కృష్ణ 102వ చిత్రంలోనూ న‌య‌న్‌నే ప్ర‌ధాన నాయిక‌.