amaravathi

వైఎస్ కు చంద్ర‌బాబుకు మ‌ధ్యఉన్న తేడా అదేనా

Submitted by lakshman on Thu, 04/12/2018 - 11:53

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సీఎం చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తుంటే ..తాము బీజేపీ తో కుమ్మ‌క్క‌య్యామ‌ని అన‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని అన్నారు. బీజేపీ కుమ్మక్కైతే హ‌స్తిన‌లో ఆమ‌ర‌ణ దీక్ష చేయాల్సిన అవస‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రం అంతా వైసీపీ ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాటం చేస్తుంటే చంద్ర‌బాబు ఆనంద న‌గ‌రాల పేరుతో వేడుక‌లు జ‌ర‌ప‌డం సిగ్గుచేట‌ని మండిప‌డ్డారు. ఇలాంటి ప‌నికిమాలిన కార్య‌క్ర‌మానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు హాజ‌ర‌వ్వ‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. 

అమ‌రావ‌తి మాస్ట‌ర్ ప్లాన్ పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు

Submitted by lakshman on Sun, 03/18/2018 - 23:17


ఏపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతుంది. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా మాట్లాడిన స‌భ నుంచి రోజుకో అంశంపై వేలెత్తి చూపించి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. 
గుంటూరు స‌భ‌లో ప్ర‌భుత్వం ప‌నితీరు, అవినీతిపై ఆరోప‌ణ‌లు చేసిన పవ‌న్ ఏపీ రాజ‌ధాని ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారించారు. వాటిని ప‌రిష్కారం చేసే దిశాగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

వాళ్లేనా ప‌వ‌న్ ఇల్లు క‌ట్టించేది

Submitted by lakshman on Tue, 03/13/2018 - 15:30

జ‌న‌సేన అధినేత ప‌వ‌న క‌ల్యాణ్ పై క్రిటిక్ క‌త్తిమ‌హేష్ మండిప‌డ్డారు. చేతిలో చిల్లిగ‌వ్వ‌కూడా లేదు. నా ఇంట్లో ప‌నిచేసేవారికి శాల‌రీలు ఇచ్చే స్థితిలో నేను లేని అని చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్ కోట్ల రూపాయ‌ల‌తో ఇల్లు ఎలా క‌డుతున్నారంటూ  ప్ర‌శ్నించారు. 

ఏపీలో జోరందుకున్న ఐటీ రంగం

Submitted by lakshman on Fri, 02/16/2018 - 06:39

ఏపీలో మెల్లమెల్లగా ఐటీ రంగం జోరందుకుంటోంది... ఐటీ కంపెనీలతో పాటు... వాటిని పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు సమకూర్చే సంస్థలు, వాటిలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు... ఇలా అన్నింటితో కూడిన సమగ్రమైన ‘ఐటీ వాతావరణం’ వస్తోంది... రాజధాని అమరావతి ఏరియాలోని అమరావతి, మంగళగిరితోపాటు గన్నవరం ప్రాంతాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.. మంగళగిరిలో ఇప్పటికే ఏపీఐఐసీకి చెందిన 22 ఎకరాల్లో ఐటీ పార్కును నెలకొల్పి పై డాటా, పై కేర్‌, వీ సాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు రూపుదిద్దుకున్నాయి...

ఏపీ సెక్రటేరియట్ వద్ద సీపీఐ నారాయణ హల్‌చల్

Submitted by arun on Thu, 01/11/2018 - 14:20

సీపీఐ అగ్రనేత నారాయణ ఏపీ సెక్రటేరియట్ వద్ద ఎస్పీఎఫ్ సిబ్బందిని పరుగులు పెట్టించారు. వేకువజామునే సైక్లింగ్ చేసుకుంటూ వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన నారాయణ సైకిల్‌తో సహా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సచివాలయం చూద్దామంటూ మరో ఇద్దరు నేతలతో కలిసి వచ్చిన నారాయణ నేరుగా లోపలికి ప్రవేశించడాన్ని  గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది పరుగుపరుగున అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ సమయంలో లోపల ఎవరూ ఉండరంటూ నారాయణను బయటకు పంపించేశారు. ఇక చేసేది లేక అసెంబ్లీ బయట ఉన్న లాన్‌లో కాసేపు కూర్చొని నారాయణ వెనుతిరిగారు.
 

అమరావతి హైపర్‌లూప్ సాధ్యమయ్యేనా? 

Submitted by lakshman on Mon, 09/18/2017 - 19:08
అభివృద్ధ్ది చెందిన దేశాల్లో హైపర్‌లూప్ ప్రయాణాలకు ప్రధాన కారణాలు మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, మానవ వనరుల లభ్యత. అయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఇంతటి జనాభాకు దీటైన రవాణా వ్యవస్థను...

అక్టోబర్ 25న అసెంబ్లీ, హైకోర్టు నమూనా ఖరారు

Submitted by lakshman on Thu, 09/14/2017 - 19:49

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో ప్రతిష్టాత్మకమైన మార్పునకు నాంది పలకబోతున్నారు. ఏపీ శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుకు సంబంధించిన నమూనాకు సీఎం చంద్రబాబు అక్టోబర్ 25న అంతిమ ఆమోదం తెలపనున్నారు. లండన్‌కు చెందిన ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుకు సెప్టెంబర్ 13న నమూనాను సమర్పించారు. ఈ నమూనాను పరిశీలించిన ఆయన హైకోర్టు బాహ్య ఆకృతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆకర్షణీయంగా లేదని.. వెంటనే దాని డిజైన్‌ను మార్చాలని సూచించారు. అసెంబ్లీ డిజైనింగ్‌కు సంబంధించి ఫోస్టర్ ప్రతినిధులను చంద్రబాబు అభినందించారు.

కనీసం పది వేలు సంపాదించాలి: సీఎం

Submitted by lakshman on Wed, 09/13/2017 - 17:50

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ‘‘విజన్2022’’కు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో మొదటి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మార్చి 2019 నాటికి ఏపీలోని ప్రతీ కుటుంబం నెలకు 12వేలకు పైగా ఆదాయం సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. తద్వారా కుటుంబ వికాసం, సమాజ వికాసం అనే నినాదాలను నిజం చేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

man held on charge of forging ap minister signature

Submitted by admin on Sun, 09/10/2017 - 20:34

ఉద్యోగం కోసం ఓ వ్యక్తి మంత్రి అఖిల ప్రియ సంతకాన్ని ఫోర్జరీ చేయడం కలకలం రేపింది. అలీ అనే వ్యక్తికి వారం రోజుల్లో పర్యాటకశాఖలో ఉద్యోగం ఇవ్వాలంటూ అఖిల ప్రియ సిఫారసు చేసినట్లుగా ఆమె సంతకం (ఫోర్జరీ) ఉన్న లేఖ వచ్చినట్లు మంత్రి పేషీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. పెదకూరపాడుకు చెందిన అలీ అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. తన సంతకం ఫోర్జరీ కావడంపై మంత్రి అఖిల ప్రియ స్పందించారు. తన ఛాంబర్‌కు ఓ వ్యక్తి ఉద్యోగం కోసం వచ్చాడని, ఆయన తెచ్చిన లెటర్లలో తన సంతకం ఉండడంతో తనకు సందేహం కలిగిందని చెప్పారు.