Congress Leaders

కాంగ్రెస్‌లో కట్టలు తెంచుకున్నఆశావహుల ఆగ్రహం...

Submitted by chandram on Fri, 11/09/2018 - 19:46

తలుపులు బద్దలవుతున్నాయి, దిష్టిబొమ్మలు దగ్ధమవుతున్నాయి, శాపనార్థాలు  హోరెత్తుతున్నాయి. ప్రళయం తప్పదన్న హెచ్చరికలు పెళ్లుమంటున్నాయి. భూకంపం సృష్టిస్తామన్న కేకలు కెవ్వుమంటున్నాయి. అభ్యర్థులపై కేవలం టీజర్‌ రిలీజ్‌ చేసిన కొన్ని గంటల్లోనే, హస్తం పార్టీ బాక్సాఫీసు అల్లకల్లోలమవుతోంది. మహాకూటమి జాబితా విడుదలైన తర్వాత మహా ప్రళయమేనా?

తెలంగాణ కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసంతృప్తులు

Submitted by arun on Fri, 11/09/2018 - 17:34

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తులు భగ్గుమన్నాయి. అభ్యర్థులను ప్రకటించక ముందే ఆశావహులు రోడ్డెక్కారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్‌లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు ఓ వైపు ప్రయత్నాలు చేస్తుండగానే  రాష్ట్రంలో పలు చోట్ల కార్యకర్తలు నిరనసలకు దిగారు. నకిరేకల్‌ టికెట్‌పై కోమటిరెడ్డి బ్రదర్స్‌ భగ్గుమంటున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే తాను కూడా నల్గొండ నుంచి పోటీ చేయనని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. కార్తకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటే ఎంతటి వారినైనా ఓడిస్తారని హెచ్చరించారు.   

అడుక్కుంటే నేనే నాలుగు సీట్లు ఇస్తాను : కేసీఆర్

Submitted by arun on Wed, 10/03/2018 - 18:06

నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభ వేదికగా గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేశారు. సిగ్గులేకుండా తెలంగాణను నాశనం చేసినవారితోనే కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రవాళ్లకు అధికారం అప్పగిస్తారని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శల వాడికి పదును పెట్టి ఎన్నికల ప్రచారంలో హీట్ రాజేశారు. తెలంగాణను నాశనం చేసినవాళ్లతో పొత్తు పెట్టుకోవడం కన్నా తనను అడిగితే, నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లమన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రజలు నమ్మోద్దన్నారు కేసీఆర్.

సీనియర్లకు సన్‌స్ట్రోక్‌...కాంగ్రెస్ నేతలకు వారసుల ఫీవర్

Submitted by arun on Fri, 09/28/2018 - 16:47

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల పుత్రుల రూపంలో  కష్టాలు వచ్చిపడ్డాయి. తండ్రులు రిటైర్మెంట్ కాకముందే కొడుకుల సీట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్టు నిబంధన ఉన్న కాంగ్రెస్‌లో ఇంటి పోరు అధికంగా ఉండడంతో కాకలు తీరిన నేతలు పైరవీలు చేయక తప్పడం లేదు. దీంతో పార్టీ అత్యంత సీనియర్ నేత ఢీల్లికి వెళ్లక తప్పలేదు. పైరవీలు నా నైజం కాదన్న ఆ నేత ఢిల్లీలో కొడుకు టిక్కెట్టు కోసం మకాం వేశారు. దీంతో కాంగ్రెస్ సీనియర్లంతా హస్తన బాట పడుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏమా కష్టాలు.

నిన్న జగ్గారెడ్డి... నేడు రేవంత్‌‌రెడ్డి... రేపు...

Submitted by arun on Fri, 09/28/2018 - 10:25

వరుస కేసులు, అరెస్టులు టీకాంగ్రెస్‌ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నిన్న జగ్గారెడ్డి... నేడు రేవంత్‌‌రెడ్డి... ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో కీలక నేతను... ఏదో ఒక కేసులో ఇరికిస్తున్నారని టీకాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్‌కి నష్టం చేస్తాయేమోనన్న భయం ఆ పార్టీని కలవరపెడుతున్నా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇంతకు ఇంత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ టీఆర్‌ఎస్‌ను హెచ్చరిస్తున్నారు.

ఆశావహులకు ఆజాద్‌ ఝలక్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 13:21

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్ లీడర్‌ గులాం నబీ ఆజాద్‌ను ఆ పార్టీ ఆశావహులు చుట్టుముట్టారు. గాంధీభవన్‌కు వచ్చిన ఆయన్ను టిక్కెట్లు తమకే ఇవ్వాలంటూ ఆయనకు దగ్గరగా వచ్చి అడగడంతో ఆజాద్‌ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. దీంతో తన దగ్గరకు వచ్చిన వారితో టిక్కెట్లు ఇంత త్వరగా ఇవ్వడం కుదరదని చెప్పారు. టిక్కెట్ల కోసం కాదు ముందు పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే గుర్తించి టిక్కెట్లిస్తామన్నారు. గాంధీభవన్‌ చుట్టూ తిరగడం కాదని ముందుగా నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. 

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు

Submitted by arun on Thu, 07/19/2018 - 12:37

ఎన్నికల వేళ ప్రత్యర్ధులపై కత్తి దూయాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ వారిపైనే గురిపెడుతున్నారా? పార్టీపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుంటే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్లు భగ్గుమంటున్నారు ఇంతకీ ప్రభుత్వం వారిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది?

జానారెడ్డి ఇక రిటైర్మెంట్‌ తీసుకోవాలి!

Submitted by arun on Mon, 07/16/2018 - 13:14

కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత జానారెడ్డి రాజకీయాల నుంచి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని ఆయన సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకున్న అజ్ఞానైతే, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చదువుకోని అజ్ఞాని అని విమర్శించారు. పీసీసీ చీఫ్‌ కుటుంబంలో ఇద్దరు, కోమటిరెడ్డి కుటుంబంలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారని, వీరిదంతా ఫ్యామిలీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమని...

ఉత్తమ్ ఒంటరి ?

Submitted by arun on Thu, 06/21/2018 - 10:55

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఒంటరవుతున్నారా.. సీనియర్లంతా ఏకమై.. అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో.. ఉత్తమ్ వెంట ఎవరూ కనిపించడం లేదా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు మాజీ మంత్రులంతా యాంటీ ఉత్తమ్ గ్రూపులో చేరినట్లేనా.. తాజా పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి.?

హస్తినకు చేరిన టీ.కాంగ్రెస్ పంచాయతీ...ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఫిర్యాదు చేయనున్న సీనియర్ల

Submitted by arun on Wed, 06/20/2018 - 07:58

తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ హస్తినకు చేరింది. గతకొంత కాలంగా పీసీసీ చీఫ్ వర్సెస్.. ఉత్తమ్‌ వ్యతిరేక వర్గం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు పార్టీలో వర్గపోరు తీవ్రం కావడంతో పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉత్తమ్ వ్యతిరేక వర్గం నేతలకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో ఆ నేతలంతా ఢిల్లీకి వెళ్లారు.