Nampally Court

ఊహించని షాక్‌ : నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

Submitted by arun on Fri, 01/19/2018 - 15:44

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ప్రదీప్ ‌...డ్రైవింగ్ లైసెన్స్ ను మూడేళ్ల పాటు రద్దు చేసింది. అంతేకాక ప్రదీప్‌కు రెండు వేల ఒక వంద రూపాయల జరిమానా విధించింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు విచారణ నిమిత్తం  ప్రదీప్‌ నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ఈ కేసును విచారించిన కోర్టు...  ప్రదీప్ డ్రెవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. 

నాంపల్లి కోర్టుకు యాంకర్‌ రవి

Submitted by arun on Wed, 01/10/2018 - 12:07

ప్రముఖ టీవీ యాంకర్ రవి బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ‘రారండోయ్ వేడుక చూద్దాం...’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను యాంకర్ రవి సమర్థించాడు. దీంతో ఆయనపై ఓ మహిళ గతంలో కేసు పెట్టింది. దీంతో కోర్టు వాయిదా బుధవారం ఉండడంతో రవి కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది. కాగా... రవి తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ... తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. అలాగే కేసు విషయాలను సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతానన్నారు.
 

గజల్‌ శ్రీనివాస్‌ కస్టడీ పిటిషన్‌ కొట్టేసిన నాంపల్లి కోర్టు

Submitted by arun on Thu, 01/04/2018 - 17:04

గజల్ శ్రీనివాస్‌ కస్టడీ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. వారం రోజులు గజల్ శ్రీనివాస్‌ను కస్టడీ కోరుతూ.. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. వేధింపుల కేసులో దర్యాప్తు పురోగతి కోసం గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు 4 రోజుల కస్టడీ కోరారు. పోలీసుల విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. రేడియో జాకీని వేధించిన కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. బాధితురాలు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది.