Telangana

అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చిన రాజకీయ పార్టీలు

Submitted by arun on Mon, 11/19/2018 - 13:22

రాజకీయ పార్టీలన్నీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చాయని ఇప్పటివరకు జరిగిన టికెట్ల కేటాయింపు లెక్కలు చెపుతున్నాయి. ఒక్క బహుజన లెఫ్ట్‌ పార్టీ, సీపీఎం కూటమి బీఎల్‌ఎఫ్‌ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తాము ప్రకటించిన స్థానాల్లో అత్యధికం ఓసీలకే ఇచ్చాయి. అధికార టీఆర్‌ఎస్‌ 119 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, అందులో 58 అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇక, మహాకూటమి పక్షాన ప్రకటించిన 118 స్థానాల్లో 49 సీట్లు ఓసీలకు ఇచ్చారు. బీజేపీ కూడా 118 స్థానాల్లో 46 ఓసీలకే కేటాయించింది.

నామినేషన్ల ఘట్టం.. నేటితో సమాప్తం..

Submitted by arun on Mon, 11/19/2018 - 12:36

ఉత్కంఠను అంతకుమించి ఆసక్తిని రేపిన తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం అయిన నామినేషన్ల పర్వం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నెల 12 న మొదలైన నామినేషన్ల పర్వం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో ఇవాళ నామినేషన్లు దాఖలు చేయడానికి భారీగా అభ్యర్థులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

నిన్న రాత్రి వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధాన పార్టీలన్నీ తలమునకలయ్యాయి. ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఎవరిని దించాలన్న దానిపైనా ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. చివరి నిమిషంలో బీ ఫామ్స్‌ ఇచ్చే అవకాశాలుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. 

నేటి నుంచి కేసీఆర్ తుది ప్రచారం..

Submitted by arun on Mon, 11/19/2018 - 12:03

అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. ఇక మిగిలింది ప్రచారమే. ఇవాళ్టి నుంచి గులాబీ బాస్‌ కేసీఆర్‌ ప్రచార పర్వం షురూ కానుంది. ఇన్నాళ్లూ అభ్యర్థుల ఎంపిక, యాగ నిర్వహణలో బిజీగా ఉన్న కేసీఆర్‌ ఇక నుంచి ఎన్నికల కధన రంగంలోకి దూకనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచే ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మంలో జరిగే ప్రచార సభకు హాజరుకానున్నారు. ఖమ్మం మొదలు ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 

ఇబ్రహీంపట్నం సీటుపై వీడిన ఉత్కంఠ

Submitted by arun on Mon, 11/19/2018 - 11:49

ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ టికెట్‌‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అక్కడ టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సామ రంగారెడ్డికే బీఫాం దక్కింది. సామ రంగారెడ్డి అభ్యర్థిత్వాన్ని టీడీపీ రెండు రోజుల కిందట ప్రకటించినా ఆయనకు పార్టీ నిన్న బీఫాం ఇవ్వలేదు. ఇదే సమయంలో ఆయనను టీఆర్‌ఎస్‌ హైజాక్‌ చేసిందంటూ ఇదే సెగ్మెంట్‌ టికెట్‌ ఆశిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. సామను బరిలోకి దింపితే బలిపశువు అయినట్లేనని అన్నారు. 

అటు నామినేషన్లు.. ఇటు బుజ్జగింపులు..

Submitted by arun on Mon, 11/19/2018 - 11:41

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ హ‌డావుడి తారాస్థాయికి చేరుకుంది. టిక్కెట్లు రానివారంతా క‌వ్వింపు చ‌ర్య‌లకు దిగుతున్నారు. అసంతృప్తుల్లో చాలామంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగుతామంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో హుటాహుటిని వీరంద‌రినీ బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం రంగంలోకి దిగింది. శ‌నివారం రాత్రి మొద‌లైన ఈ బుజ్జ‌గింపులు ఇంకా కొనసాగుతున్నాయి. హైద‌రాబాద్ లోని పార్క్ హాయ‌త్ హోట‌ల్ ఈ బుజ్జగింపుల‌కు వేదిక‌గా మారింది.

కుకట్ పల్లిలో నందమూరి సుహాసిని గెలుస్తారా...సుహాసినిని నిలబెట్టడంలో చంద్రబాబుకు ప్రత్యేక వ్యూహముందా?

Submitted by arun on Mon, 11/19/2018 - 11:28

తెలంగాణలో పార్టీని బతికించుకోడానికి కొత్త రాజకీయ సమీకరణలకు దారి తీసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సెటిలర్ల  ఓట్లను అందుకు ఆయుధంగా వాడుకుంటున్నారు. తన వ్యూహానికి మరింత బలం చేకూర్చడానికి నందమూరి ఫ్యామిలీకి టిక్కెట్ ఇచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చారా?  

తెలంగాణలో నాయకులకి భారీ భద్రత...మహిళా మావోయిస్టుల నుంచి నాయకులకు పొంచి ఉన్న ముప్పు

Submitted by arun on Mon, 11/19/2018 - 11:14

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టులు గురి పెట్టారా…? మహిళా మావోయిస్టుల నుంచి నాయకులకు ముప్పు పొంచి ఉందా..? లేడీ సెక్యూరిటీ పోలీసులను నియమించడానికి కారణం ఇదేనా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి..

టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ...

Submitted by arun on Mon, 11/19/2018 - 10:37

అభ్యర్ధుల ప్రకటనలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో పార్టీలన్నీ తుది జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఇక అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పోటీగా అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తోన్న బీజేపీ దాదాపు అన్ని స్థానాల్లోనూ పోటీకి దిగుతోంది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో పార్టీలన్నీ ఫైనల్ లిస్టులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పోటీగా అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తోన్న బీజేపీ ఒకే రోజు ఐదు, ఆరు జాబితాలను అనౌన్స్ చేసింది. ఐదో జాబితాలో 19మందిని, ఆరో జాబితాలో ఆరుగురిని ప్రకటించింది.

కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ రిలీజ్‌..... బరిలో ఆర్‌. కృష్ణయ్య

Submitted by arun on Mon, 11/19/2018 - 10:20

కాంగ్రెస్‌ పార్టీ ఫైనల్‌ లిస్టును ప్రకటించింది. ఇప్పటివరకు 88మంది అభ్యర్ధులను అనౌన్స్ చేసిన కాంగ్రెస్‌ మిగిలిన ఆరుగురితో తుది జాబితా విడుదల చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌‌.కృష్ణయ్యకు మిర్యాలగూడ సీటును కేటాయించింది. ఇక ఫైనల్ లిస్ట్‌లోనైనా తమ పేరు ఉంటుందని ఆశించిన సీనియర్లకు మళ్లీ భంగపాటే ఎదురైంది.

మహాకూటమిలో మరో ట్విస్ట్

Submitted by arun on Mon, 11/19/2018 - 10:07

పొత్తు పొత్తే.. పోటీ పోటీయే అన్నట్లు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పార్టీలు.. బరిలో మాత్రం కత్తులు దూసుకుంటున్నాయి. ఏకైక లక్ష్యంతో బరిలో నిల్చిన కూటమి పార్టీలు కొన్ని స్థానాల్లో మాత్రం ఉమ్మడి అభ్యర్థులను కాకుండా ఎవరికి వారే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటు పొత్తు ధర్మం వీడలేక అటు అభ్యర్థులను కాదనలేక చివరకు ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ అంటూ కొత్త రాగాన్ని వినిపిస్తున్నాయి.