Babu Gogineni

కౌశల్ ఆర్మీపై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 08/31/2018 - 16:09

బిగ్ బాస్2 ఎంత రసవత్తరంగా సాగుతుందో అదేస్థాయిలో వివాదాలు కూడా మొదలవుతున్నాయి. కౌశల్ కు బయట కౌశల్ ఆర్మీ పేరుతో పెద్ద ఎత్తున మద్దత్తు లభిస్తోంది. దీనిపై బాబు గోగినేని తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. బిగ్ బాస్ జరుగుతున్న విధానంపై, కౌశలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. బిగ్ బాస్ లో కౌశల్ హాట్ ఫెవరెట్ గా కొనసాగుతున్నాడు. కౌశల్ ఫైనల్ చేరడం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఆర్మీ గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్మీ... కౌశల్ పాపులారిటీతో పుట్టింది కాదని వ్యాఖ్యానించారు.

మానవత్వాన్ని చాటుకున్న బాబు గోగినేని

Submitted by arun on Tue, 08/21/2018 - 08:46

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ బాబు గోగినేని మానవత్వాన్ని చాటుకున్నారు. బిగ్‌‌బాస్‌ షోలో పాల్గొనడం ద్వారా వచ్చిన డబ్బును కేరళ వరద బాధితులకు సాయం చేశారు. 20 లక్షల రూపాయల డబ్బును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి పంపారు. 

పోలీసులకు షాకిచ్చిన బాబు గోగినేని

Submitted by arun on Sat, 07/21/2018 - 14:27

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలోను .. టీవీ చానళ్లలోను బాబు గోగినేని విమర్శలు చేస్తున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రితం నెల 26వ తేదీన వీరనారాయణ ఫిర్యాదు చేశారు. దాంతో బాబు గోగినేనిపై దేశద్రోహం .. ఆధార్ చట్టంతో పాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం మాదాపూర్‌ పోలీసులు బాబుగోగినేనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాబు గోగినేని న్యాయవాదులు షాక్ ఇచ్చారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి తర్వాత బయటకు వచ్చేది ఆయనే: సినీ నటి అర్చన

Submitted by arun on Wed, 06/27/2018 - 18:01

బిగ్ బాస్ సీజన్-2లో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు నిష్క్రమించబోతున్నారనే విషయాన్ని సినీ నటి అర్చన తెలిపింది. తర్వాత ఎలిమినేట్ అయ్యేది హేతువాది బాబు గోగినేనేనని జోస్యం చెప్పారు. అయితే ఆయనొక్కరే అని కాదని... మరో ఐదుగురు కూడా ఉన్నారని... ఆ పేర్లు బయటపెట్టలేనన్నారు. ఇదిలా ఉంటే వ్యాఖ్యాతగా నాని చక్కగా చేస్తున్నారని కితాబిచ్చారు. తారక్ గొప్పగా చేశాడని... అందులో ఏమాత్రం సందేహం లేదన్నారు. ఈ షో జనంలోకి వెళ్లడానికి టైమ్ పడుతుందన్నారు. హౌజ్‌లో తనకిష్టమైన వాళ్లు ఉన్నారని చెప్పిన అర్చన.. ఆ పేర్లు చెప్పడానికి మాత్రం అయిష్టత వ్యక్తం చేశారు.

చిక్కుల్లో బాబు గోగినేని...ఆధార్ కార్డు డేటాను విదేశాలకు...

Submitted by arun on Wed, 06/27/2018 - 14:37

ప్రముఖ హేతువాది బాబు గోగినేని చిక్కుల్లో పడ్డారు. కొన్ని మతాలను కించపరిచేలా పోస్టులు పెట్టడంతో పాటు ఆధార్‌ నంబర్ల సమాచారాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణల మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 13 సెక్షన్ల కింద కేసు పెట్టారు.  

ఒక్కొక్కడికి మూడు చెరువుల నీళ్ళు తాగించా.. మీకు తాగించలేనా..

Submitted by arun on Tue, 06/19/2018 - 16:25

బిగ్‌బాస్ సీజన్ 2 ఎంతో  రసవత్తరంగా కొనసాగుతోంది. తొలి ఎలిమెనేషన్‌లో మిస్ హైదరాబాద్ సంజన చౌదరి షో నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆమె షో  నుంచి బయటకు వెళ్తూ బిగ్‌బాంబ్‌ను బాబు గోగినేనిపై వేసింది. దీంతో అతను వారం రోజులు ఇంట్లోని సభ్యుల్లో ఎవరికి మంచినీళ్లు అవసరం వచ్చినా ఆయనే తీసుకెళ్లి ఇవ్వాలి.  సంజన తనపై వేసిన బిగ్‌బాంబ్‌ను గోగినేని స్వీకరించడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ షోలోకి రాకముందు తాను అనేక టీవీ డిబేట్లలో పాల్గొన్నానని చెప్పారు. డిబేట్లలో ఒక్కొక్కరికి మూడు చెరువుల నీరు తాగించానని, అలాంటి తనకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదని తెలిపారు.

బాబు గోగినేనిని బ‌ద్నాం చేస్తున్న రాజ‌మౌళి

Submitted by arun on Thu, 01/04/2018 - 14:31

బాబు గోగినేని అతని పేరు వింటే కొంతమంది మాయగాళ్ళు తడుపుకుంటున్నారు. దొంగ‌స్వామీలు, దొంగ‌డాక్ట‌ర్ల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొద్దిరోజుల క్రితం జ్యోతిష్యం పేరుతో అమ‌యాక ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న ఓ పండితుడి బండారం లైవ్ షోలో బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఇక  ప్రాణ చికిత్స పేరుతో ఫోన్ కాల్ తో రోగం నయం చేస్తాం అన్న వాళ్ళని కూడా లైవ్ లోనే చుక్కలు చూపించిన బాబు గోగినేని ఇప్పుడు డైర‌క్ట‌ర్ జ‌క్క‌న్న తీరును ఎండ‌గ‌డుతున్నారు. తాను నాస్తికుడిని అని చెప్పుకుంటున్న రాజ‌మౌళి ఈజీగా చొక్కాలు మార్చి గుడికి వెళుతుంటారు.