social media

ఆంధ్ర యువకుడి పనికి కేటీఆర్‌ ఫిదా

Submitted by arun on Mon, 10/08/2018 - 13:55

టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారం చేపట్టాలని, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని తాజాగా కేసీఆర్‌పై అభిమానంతో ఓ యువకుడు  విజయవాడ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. నెలూరు జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి కేటీఆర్ వీరాభిమాని. తన గుండెపై కేటీఆర్ రూపాన్ని టాటూగా వేయించుకున్నాడు. గులాబీ దుస్తుల్లో విజయవాడ నుంచి కాలినడకన హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే ఆ యువకుడు చేసిన పనికి మంత్రి కేటీఆర్‌ ఫిదా అయ్యారు. ట్వీటర్‌ వేదికగా అతనికి ధన్యవాదాలు తెలిపారు.

భార్య సీక్రెట్ వీడియోలు ఫోన్‌లో.. ఫోన్ పోవడంతో..!

Submitted by arun on Fri, 08/17/2018 - 12:04

ఫోన్ పోయిన సంఘటన ఓ బాధితుడి కొంపముంచింది. ఫోన్‌లో దాచుకున్న భార్య, భర్తల సన్నిహిత దృశ్యాలు అశ్లీల వెబ్‌సైట్‌లోకి ఎక్కడంతో ఖంగుతిన్నాడు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. ఓ వ్యక్తి 2015లో భార్యతో సంభాషించిన విషయాలను వీడియో రికార్డు చేసి సేవ్‌ చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఫోన్‌ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి వ్యక్తిగత వీడియోలు పోర్న్‌ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. బాధితుడు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టి కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని విచారించగా..

పవన్ ఫ్యాన్స్ పై నటి అలేఖ్యా ఏంజెల్ ఆగ్రహం!

Submitted by arun on Fri, 07/27/2018 - 10:36

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో దాదాపు ఏడాదిన్నర క్రితం ఓ ఆడియో సీడీ ఆవిష్కరణ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నటి అలేఖ్యా ఏంజల్ మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, తనలోని ఆవేదనను వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసిన పని చాలా ఘోరమైన పాపమని, ఇదే పనిని మీ అక్క లేదా చెల్లెలు ఇమేజ్ పెట్టి, ఇలాంటి ప్రచారమే చేస్తే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవాలని మండిపడింది. ఓ అమాయకురాలైన అమ్మాయిపై, మరొకరి కూతురిపై, ఇంకొకరి సోదరిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి మనస్తాపానికి గురిచేయడం సరైనదేనా?

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సింగ‌ర్ సునీత‌

Submitted by arun on Fri, 07/20/2018 - 11:31

సుమధుర గానంతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయని సునీత మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు గురువారం సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అయింది. ఈ వార్తపై ఆమె స్పందించారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియోలో ఆమె స్పష్టం చేశారు. మీ ఆద‌ర‌ణ వ‌ల‌న ఇప్ప‌టికి హ్యాపీగా పాట‌లు పాడుకుంటూ ఉన్నాను. కాని నిన్న‌టి నుండి నేను రెండో పెళ్ళి చేసుకోబోతున్న‌ట్టు నా ఫోన్‌కి మెసేజ్‌లు వ‌స్తున్నాయి. దాదాపు అన్నీ వెబ్ సైట్స్ నేను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు రాసాయి. కాని ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మీ అంద‌రి ఆద‌ర‌ణ వ‌ల‌న హ్యాపీగా ఉన్నాను.

పెళ్లి చేసుకోబోతున్న సింగర్‌ సునీత?

Submitted by arun on Thu, 07/19/2018 - 11:15

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ సునీత. ప్రేక్షకులను మైమరిపించే గానం మాత్రమే కాదు, ఆకట్టుకునే రూపం కూడా ఆమె సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సునీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సుప్రీం వార్నింగ్....వదంతులు, పుకార్లతో జనాన్ని కొట్టి చంపడమేంటి?

Submitted by arun on Wed, 07/18/2018 - 13:49

గో సంరక్షణ పేరుతోనో, వాట్సాప్‌ వదంతులతోనో, జనాలపై దాడి చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు వార్నింగ్‌ ఇచ్చింది...అవును. గో సంరక్షణ పేరుతో బడుగులపై దాడి చేేసేవారి తాటతీయాలని సుప్రీంకోర్టు స్పష్టాతిస్పష్టంగా ఆదేశాలిచ్చింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వదంతులతో జనాన్ని కొట్టి, చంపేస్తున్న మూకలు కటకటాలు లెక్కించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అతి త్వరలో పార్లమెంటులో చట్టం చేయాలని స్పష్టం చేసింది.

కాబోయో భర్తతో రేణు దేశాయ్.. అకీరా తీసిన ఫోటో..

Submitted by arun on Sat, 07/14/2018 - 16:31

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో వివాహానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి ఆమె విడాకులు పొంది ఏడేళ్లు గడిచిపోతోంది. ఇన్నేళ్ళపాటు ఆమె పుణేలో తన పిల్లలతో గడిపింది. ఇటీవలే తాను రెండో వివాహం చేసుకోవాలని రేణు దేశాయ్ నిర్ణయించుకోవడం, ఎంగేజ్ మెంట్ చకచకా జరిగిపోయాయి. త్వరలో వివాహం జరగబోతోంది. కానీ ఇంత వరకు వరుడు ఎవరనే సంగతి బయట ప్రపంచానికి తెలియదు. తనకు కాబోయే భర్త వివరాలని రేణు ఇంకా గోప్యంగానే ఉంచుతోంది. సోషల్ మీడియలో ఫొటోలు పెడుతున్నా... కాబోయే భర్త ముఖం మాత్రం స్పష్టంగా కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు.

ప్రత్యర్థులపై ఎదురుదాడికి సిద్ధమైన టీఆర్‌ఎస్ పార్టీ...సొంత దళాన్ని రంగంలోకి...

Submitted by arun on Fri, 07/13/2018 - 10:57

సోషల్ మీడియాలో ఇక గులాబీ దళం ప్రవేశిస్తోంది. తమపై వస్తున్న విమర్శలకు దీటైన సమాధానం చెప్పేందుకు సొంత బలగాన్ని నియమించబోతుంది. నియోజకవర్గానికి  100 మంది చొప్పున సోషల్ మీడియా యాక్టివిస్టులను తయారు చేయబోతుంది. త్వరలోనే హైదరాబాద్‌లో వందలాది మందికి శిక్షణ ఇచ్చి రంగంలోకి దించబోతుంది టీఆర్ఎస్ పార్టీ. అయితే, ఈ దళం ఎందుకు..? ఎవరిపై దండయాత్ర చేస్తుంది..? 

‘మోదీకి అల్లుడు.. సోనియా గాంధీకి కోడలు దొరికారు’

Submitted by arun on Wed, 07/11/2018 - 14:26

నరేంద్ర మోదీకి అల్లుడు రావడమేంటి? సోనియాగాంధీకి కోడలు దొరకడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిత్యమూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న డిజిటల్ వార్ ఇది. కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా, డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌ దివ్యా స్పందన, ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తేజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గాలు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకుంటూ ట్విట్టర్ లో పెడుతున్న వీడియోలు చూస్తున్న వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.

నా ఫొటో షేర్ చేయకండి ప్లీజ్..!

Submitted by arun on Mon, 07/02/2018 - 17:53

కేరళలో ఇటీవల వెలుగులోకొచ్చిన ఓ కేసుకు, ఓ మహిళకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆమె ఫొటోను ఉపయోగిస్తూ.. ఓ ఫెక్‌ ఆడియో క్లిప్‌ను కొందరు విస్తృతంగా షేర్ చేశారు. చర్చిలో పాస్టర్లు తన భార్యను వేధిస్తున్నారంటూ ఓ భర్త మాట్లాడిన ఆడియో క్లిప్ అది. ఈ ఆడియో క్లిప్‌కు... ఆ మహిళాకు  ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఈమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా షేర్ అవుతూ.. ఆ మహిళ భర్త ఫోన్‌లో కూడా కనిపించింది. అది చూసిన ఆయన అవాక్కయ్యారు. తన భార్యతో విషయం చెప్పగా.. ఆమె కూడా షాక్‌కు గురైంది. ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గతంలో కూడా ఇలా నాలుగైదు సార్లు తన ఫొటోను దుర్వినియోగం చేశారని..