Jr NTR

హరికృష్ణ విగ్రహం సిద్ధం.. రేపు ఎన్టీయార్‌కు అందజేత

Submitted by arun on Sat, 09/01/2018 - 15:34

తెలుగుదేశం సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో కన్నుముూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. కాగా, సెప్టెంబర్ 2న హరికృష్ణ జయంతి సందర్భంగా ఇద్దరు నందమూరి అభిమానులు ఆయన విగ్రహాన్ని రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి చెందిన ఏకేఆర్ట్స్ శిల్పులు డాక్టర్ పెనుగొండ అరుణ్ ప్రసాద్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్‌లు హరికృష్ణ మీద అభిమానంతో ఆయన విగ్రహాన్ని రూపొందించారు.

కన్నీటి పర్యంతం

Submitted by arun on Thu, 08/30/2018 - 15:44

నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఆయన చితికి నిప్పటించారు. ఇక తండ్రిని కడసారి చూస్తూ జూనియర్ ఎంటీఆర్ భావాద్వేగానికి లోనయ్యారు.. తండ్రిని చూస్తూ కంటతడి పెట్టుకున్నాడు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి హరికృష్ణ పార్థివ దేహం చేరుకున్న అనంతరం శాస్త్రోక్తమైన క్రతువు చేశారు ఇక హరికృష్ణ చివరి చూపు కోసం తరలి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు అంత్యక్రియల సందర్భంగా మెదట హరికృష్ణ భౌతికకాయానికి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. అనంతరం పోలీసులు గాలిలోకి మూడురౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం తండ్రికి కళ్యాణ్ రామ్ తలకొరువి పెట్టారు. 

టీజ‌ర్‌తో దుమ్మురేపిన ఎన్టీఆర్

Submitted by arun on Wed, 08/15/2018 - 10:32

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా ‘అర‌వింద స‌మేత‌’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను నేడు చిత్రబృందం విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్ చేసిన అదిరిపోయే యాక్షన్ సీన్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో జ‌గ‌ప‌తి బాబు డైలాగ్స్‌, ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. కంట ప‌డ్డావా క‌నిక‌రిస్తానేమో, వెంట‌ప‌డ్డానా న‌రికేస్తా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి.

జ్వరం డాన్స్.. జ్వరం డాన్స్..చేసిన బన్ని& ఎన్టీఆర్.

Submitted by arun on Tue, 08/14/2018 - 16:28

ఏమండి.. ఇది విన్నారా..? ఆర్య 2 లో "మై లవ్ లవ్ గాన్" పాట చేసేప్పుడు అల్లు అర్జున్ కి ,  అలాగే "మీ నాన్న టెంపెర్" పాట చేసేప్పుడు ఎన్టీఆర్ కి బాగా ఎక్కువ జ్వరం కలిగి ఉన్నారట. అయినప్పటికీ, వారు ఇద్దరు డాన్స్లో ఎక్కడ ఆ ఛాయలు కనబడకుండా చాల బాగా చేసారు, పాపం ప్రేక్షకులకు ఆనందం కోసం హీరోలు బాగానే కష్టపడతారు. శ్రీ.కో
 

భారీ ధర పలికిన 'అరవింద సమేత' శాటిలైట్ హక్కులు.. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్!

Submitted by arun on Tue, 08/07/2018 - 12:47

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో రూపొందుతోన్న చిత్రం 'అరవింద సమేత'.  ప్రకటన రోజు నుండే భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తొలిసారి త్రివిక్రమ్, తారక్ లు కలిసి సిసినిమా చేస్తుండటంతో బిజినెస్ సర్కిల్స్ లో కూడా చిత్రంపై హైప్ బాగానే ఉంది. ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ ఏకంగా రూ.23.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద శాటిలైట్ డీల్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏ చిత్ర శాటిలైట్ హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోలేదు.

మ‌రోసారి క‌లిసిన టాలీవుడ్ టాప్ స్టార్స్

Submitted by arun on Sat, 07/28/2018 - 11:08

టాలీవుడ్ టాప్ హీరోస్ మ‌హేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా క‌లిసి క‌నిపిస్తున్నారు. పార్టీస్‌లోనో లేదంటే ఏదైన అకేష‌న్‌లోనో ఈ ముగ్గురు హీరోల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఫ్యామిలీస్‌తో క‌లిసి మ‌రీ పార్టీల‌కి హాజ‌ర‌వుతున్న వీరు క‌లిసి ఫోటోల‌కి ఫోజులిస్తున్నారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండడంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోతున్నాయి. భ‌ర‌త్ అనే నేను మూవీ ఆడియో వేడుక త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల‌లో క‌లిసిన ముగ్గురు హీరోలు తాజాగా వంశీ పైడిప‌ల్లి బ‌ర్త్‌డే వేడుక‌లో క‌లిసారు. ఈ ముగ్గురి హీరోల‌తో వంశీ పైడిప‌ల్లి ఫోటో దిగాడు.

‘అరవింద సమేత’ స్టిల్‌ లీక్‌.. వైరల్‌

Submitted by arun on Mon, 07/23/2018 - 11:43

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబందించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చిత్రంపై నెలకొన్న భారీ అంచనాలకు ఇదే నిదర్శనం. తాజగా ఈ చిత్రం నుంచి లీకైన స్టిల్ ఒక సోషల్ మీడియాలో భిభత్సం సృష్టిస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోను బట్టి ఈ సినిమాలో ఎంతో ఎమోషన్‌ ఉండబోతుందనేది అర్థమవుతోంది. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా..

ఎన్టీఆర్‌ చిన్న కొడుకు పేరేంటంటే..!

Submitted by arun on Wed, 07/04/2018 - 12:26

గత నెల 14వ తేదీన హీరో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు పుట్టిన రెండో మగబిడ్డ నామకరణం జరిగిపోయింది. తన చిన్న కొడుకుకు భార్గవ రామ్ అని పేరు పెట్టినట్టు ఎన్టీఆర్ వెల్లడించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోని తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాల ద్వారా ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నాడు.
 

రెండో కొడుకుని పరిచయం చేసిన ఎన్టీఆర్..ఫోటో వైరల్!

Submitted by arun on Mon, 06/18/2018 - 12:33

గత వారంలో జన్మించిన తన రెండో కుమారుడిని ఎన్టీఆర్ తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశాడు. సోషల్ మీడియా ఫొటో షేరింగ్ ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల ఖాతా తెరిచిన ఎన్టీఆర్, దానిలో తొలి పోస్టుగా ఉంచిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అభయ్ రామ్ తన చేతుల్లో తమ్ముడిని ఎత్తుకుని ఓ కుర్చీలో కూర్చుని ఉండగా, ఎన్టీఆర్ తన స్మార్ట్ ఫోన్ లో దాన్ని చిత్రీకరిస్తున్నట్టు ఉన్న ఫోటో షేర్ చేశాడు.  ఈ ఫోటోకి మంచి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. 

జూనియర్ ఎన్టీఆర్ రెండో కుమారుడి.. ఫొటో చూడండి!

Submitted by arun on Fri, 06/15/2018 - 16:42

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు మరో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన భార్య మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చిందని... తన కుటుంబం మరింత పెద్దదయిందని చెప్పాడు. 2011లో ఎన్టీఆర్ దంపతులకు తొలి కుమారుడు జన్మించాడు. అతని పేరు అభయ్. ఇప్పుడు రెండో కుమారుడు పుట్టడంతో ఎన్టీఆర్ బంధుమిత్రులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తాజాగా ఎన్టీఆర్ రెండో కుమారుడి ఫొటో వెలుగు చూసింది. ముద్దులొలుకుతున్న చిన్నారిని మీరూ చూడండి.