movies

బంపరాఫర్.. ఒకే రోజు 10 సినిమాలు!

Submitted by arun on Tue, 06/26/2018 - 16:26

 పండుగల సమయంలో లేదంటే స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో అని సమయం చూసుకొని సినిమాలు  విడుదల చేసే కాలం పోయింది . ఇపుడంతా శుక్రవారం  ట్రెండ్ కొనసాగుతుంది. శుక్ర‌వారం వ‌చ్చిందంటే మినిమం  రెండు, మూడు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డుతున్నాయి. అయితే, వచ్చే శుక్రవారం (జూన్ 29) పదికి పైగా చిన్న సినిమాలు తెరమీదకొస్తున్నాయి. వీటితోపాటు, చంద్ర సిద్ధార్థ్ ‘ఆటగదారా శివా’, ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రాలు విడుదలకు రెడీ అయినా, సినిమాల తాకిడి దృష్ట్యా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయి. అయితే ఈ 10 చిత్రాల్లో శంభో శంకరా, ఈ నగరానికి ఏమైంది? చిత్రాలు మినహా మిగిలినవి థియేటర్స్ వరకూ వస్తాయా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

అభిమానుల‌కు మెహ‌రీన్ స్వీట్ వార్నింగ్

Submitted by lakshman on Sun, 03/11/2018 - 13:03

హిరోయిన్ మొహ‌రీన్ అభిమానుల‌కు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది. హీరోయిన్ మెహరీన్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అది ఎంతలా అంటే ఒంటిపై పచ్చబొట్టు వేయించుకునేలా. అయితే ఇదే విష‌యం ఈ అమ్మ‌డుకు న‌చ్చ‌లేదట‌.  ఓ అభిమాని చేసిన ఈ పిచ్చి పనితో బాగా హర్టయ్యింది. ఇదేం పిచ్చి రా బాబూ అనుకుందో ఏమో... వెంటనే ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. ఈ ఫోటోను ట్వీట్ చేస్తూ స్పందించింది. 

అభిమానులకు పవన్‌ షాక్‌..సినిమాలకు ఇక గుడ్ బై

Submitted by arun on Mon, 01/22/2018 - 19:35

కరీంనగర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన పవన్‌.... భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. రేపు, ఎల్లుండి మరోసారి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కార్యకర్తల సమావేశంలో తెలంగాణలోని ప్రజాసమస్యలపై చర్చించనున్నట్టు పవన్‌ తెలిపారు. ఈ నెల 27 నుండి అనంతపురం కరవుపై యాత్ర చేపట్టనున్నట్టు జనసేన అధినేత పవన్‌ ప్రకటించారు. అనంతపురంలో పార్టీ ఆఫీస్‌ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ పాదయాత్రతో అనంతపురం కరవును కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

కోలుకోలేని దెబ్బ కొడుతున్న రజినీకాంత్

Submitted by arun on Thu, 01/11/2018 - 14:40

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇప్పుడు సౌత్ లో ఎవరూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నాడు. ఎవరూ ఊహించని షాక్ ఇస్తున్నాడు. పాలిటిక్స్ లోకి ఎంటరవ్వటం పెద్ద సర్ ప్రైజ్ కాకపోయినా, అంతకు మించే సర్ ప్రైజ్ తో అభిమానుల్ని ఆందోళనలోకి నెట్టాడు. ఇక సెలవుని ప్రకటిస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీ కాంత్, నడిస్తే స్టైలే, నడవకుండా నిలుచున్నా స్టైలే విజిలేసినా స్టైలే, సిగరెట్ కాల్చినా స్టైలే, ఆఖరికి గుండు తో కనపించినా, స్టైలే అసలు రజినీ అంటేనే స్టైల్ కాని ఇప్పుడు అవన్నీ మిస్సయ్యే పరిస్థితొచ్చింది

పవన్ కళ్యాణ్...బాలకృష్ణ మధ్య సైలెంట్ వార్

Submitted by arun on Tue, 01/02/2018 - 13:43

న్యూ ఇయర్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో సై అంటే సై అంటున్నాడు నటసింహం బాలయ్య. కొత్త ఏడాదికి ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు బాక్సాఫీస్ మీద దాడికి సిద్ధమయ్యారు. అస్సలు తగ్గేదిలేదంటున్నారు 
కొత్త ఏడాదికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అగ్నాత వాసిగా రాబోతున్నాడు నటసింహం బాలయ్యతో వార్ కి రెడీ అయ్యాడు. జనవరి 10  నే ముహుర్తం చూసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో పవన్ కళ్యాణ్ చేసిన మూడో మూవీ అగ్నాత వాసి జనవరి 10  న రిలీజ్ కాబోతోంది. అను ఇమాన్యుయెల్, కీర్తి సురేష్ తో జోడీ కట్టి పవన్ చేసిన ఈమూవీ యే తన చివరి సినమా అని ప్రచారం జరుగుతోంది.