mahesh babu

మహేశ్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడు?

Submitted by arun on Thu, 08/09/2018 - 12:42

43 ఏళ్లొచ్చిన పాతికేళ్ల కుర్రాడాలానే కనిపించే మహేశ్, అసలు టాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడు? పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికి నచ్చిన స్టార్ గా ఎలా ఎదిగాడు తండ్రిని మించిన స్టార్ గా ఎలా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు..? 19 ఏళ్లలో 25  సినిమాలే తీసినా, తనకే టాలీవుడ్లో, అలానే ఆల్ ఓవర్ ఇండియాలోనే అంత ఇమేజ్ ఎలా సొంతమైంది? 

బాలీవుడ్ జనం ఎక్కువ కోరుకునే టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ఎన్ని హిట్లున్నా, టాలీవుడ్ లో బాలీవడ్ హీరోకుండేన్ని ఫీచర్స్ ఉన్నా, బాలీవుడ్ వదులుకున్న హీరో కూడా మహేశే ఫ్యామిలీ, సినిమా తప్ప మరో ఆలోచనలేదు కంప్లీట్ ఫిల్మ్ స్టార్, ప్రొఫేషనల్ స్టార్ మహేశ్ బాబు. 

మ‌రోసారి క‌లిసిన టాలీవుడ్ టాప్ స్టార్స్

Submitted by arun on Sat, 07/28/2018 - 11:08

టాలీవుడ్ టాప్ హీరోస్ మ‌హేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా క‌లిసి క‌నిపిస్తున్నారు. పార్టీస్‌లోనో లేదంటే ఏదైన అకేష‌న్‌లోనో ఈ ముగ్గురు హీరోల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఫ్యామిలీస్‌తో క‌లిసి మ‌రీ పార్టీల‌కి హాజ‌ర‌వుతున్న వీరు క‌లిసి ఫోటోల‌కి ఫోజులిస్తున్నారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండడంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోతున్నాయి. భ‌ర‌త్ అనే నేను మూవీ ఆడియో వేడుక త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల‌లో క‌లిసిన ముగ్గురు హీరోలు తాజాగా వంశీ పైడిప‌ల్లి బ‌ర్త్‌డే వేడుక‌లో క‌లిసారు. ఈ ముగ్గురి హీరోల‌తో వంశీ పైడిప‌ల్లి ఫోటో దిగాడు.

ఇన్‌క్రెడిబుల్ లీడర్‌కి జన్మదిన శుభాకాంక్షలు: మహేష్

Submitted by arun on Tue, 07/24/2018 - 12:49

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఇటు సామాన్యులు, అటు సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ వేదిక‌గా యువ నాయకుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్‌బాబు మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో కేటీఆర్‌‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపిన మహేష్‌ ఇద్దరూ కలిసున్న ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. కేటీఆర్‌ తనకు మంచి ఫ్రెండ్ అన్న మహేష్‌బాబు డైనమిక్‌ లీడర్‌ అండ్‌ గ్రేట్‌ హ్యూమన్ బీయింగ్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
 

మహేశ్‌ బాబుని కలసిన సీఎం

Submitted by arun on Mon, 06/18/2018 - 16:33

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ కలిశారు. మహేశ్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 25వ చిత్రం షూటింగ్‌ కోసం డెహ్రాడూన్‌ వెళ్లారు. షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన త్రివేంద్రసింగ్‌ మహేశ్‌ని మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల భరత్‌ అనే నేను చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన  సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈ సినిమా షూటింగ్ ఈ రోజు (సోమ‌వారం) మొద‌లైంది.

టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలకు ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌!

Submitted by arun on Fri, 06/01/2018 - 14:44

సోషల్ మీడియాలో ఇపుడు 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ ట్రెండ్ వైరల్ అవుతోంది. సినీ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తూ ఇతరలకు ఛాలెంజ్ విసురుతుండటం అభిమానుల్లోనూ ఫిట్‌నెస్ మీద ఆసక్తి పెంచుతోంది. అలా సినీ నటుడు మోహన్ లాల్ నుండి ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్...మహేష్ బాబు, రామ్ చరణ్, నందమూరి కళ్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు ఈ ఛాలెంజ్ విసిరారు.
 

మ‌హేష్ ట్వీట్‌.. ర‌షీద్ రిప్లై!

Submitted by arun on Sat, 05/26/2018 - 13:31

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్వాలిఫయర్‌-2లో విజయం సాధించి ఐపీఎల్‌ ఫైనల్‌ చేరిందంటే అందుకు ప్రధాన కారణం రషీద్‌ ఖాన్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రషీద్‌ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. దీంతో మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో రషీద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్‌ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డే సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కూడా ర‌షీద్‌ను ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేశాడు. `హ్యాట్సాఫ్ ర‌షీద్ ఖాన్‌. అద్భుత‌మైన మ్యాచ్‌. ఆదివారం వ‌ర‌కు ఆగ‌లేక‌పోతున్నాను. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుకు నా అభినంద‌న‌లు. గో ఆరెంజ్ ఆర్మీ.. ఎస్ఆర్‌హెచ్‌` అంటూ ట్వీట్ చేశాడు.

భరత్ అనే నేను ఫస్ట్ డే కలెక్షన్స్

Submitted by arun on Sat, 04/21/2018 - 11:18

ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. భారీ ఓపెనింగ్స్ దక్కాయి. గురువారమే అమెరికాలో భారీగా ప్రీమియర్ షోలు వేశారు. ఇండియాలో విడుదలకు ముందు రోజే అక్కడ 2000 షోలు ప్రదర్శించారు. ఓవర్సీస్‌లో తొలి రోజే భరత్‌ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినట్టు సమాచారం. దీంతో బాహుబలి తర్వాత మహేశ్ మూవీకి ఓవర్సీస్ ప్రీమియర్ షోల ద్వారా భారీ కలెక్షన్లు వచ్చినట్టు టాక్. కాగా మొదటి రోజున భరత్ అనే నేను 58 కోట్ల భారీ వసూళ్ల ని సాధించింది .

‘భరత్ అనే నేను’పై కత్తి రివ్యూ

Submitted by arun on Fri, 04/20/2018 - 13:03

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి ఒక్క సినిమా..హై ఎక్స్ పెక్సేషన్స్ తోనే రిలీజవుతుంది. కానీ భరత్ అనే నేను సినిమా మాత్రం ఇంకాస్త ప్రత్యేకం. అందుకే ఈ సినిమా మహేశ్ కెరీర్ లోనే రికార్డు స్థాయిలో సందడి చేస్తోంది. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా నేడు పెద్ద ఎత్తున విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్‌ మరింత జోష్‌లో ఉన్నారు.

‘భరత్ అనే నేను’ ఆడియన్స్ రివ్యూ...బ్లాక్ బస్టర్ హిట్!

Submitted by arun on Fri, 04/20/2018 - 10:57

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన ‘భరత్ అనే నేను’ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 20న (ఈరోజు) థియేటర్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. టీజర్, ట్రైలర్స్ అదిరిపోవడంతో పాజిటివ్ బజ్‌తో ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్‌కి పైగా విడుదలైన ఈ మూవీ మహేష్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ యూఎస్ ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ఇరగదీశాడని.. ఫస్టాఫ్‌, సెకండాఫ్ అని కాకుండా ఓవరాల్‌గా ‘భరత్ అనే నేను’ మహేష్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వరుస ట్వీట్లు వస్తున్నాయి.

‘భరత్‌ అనే నేను’ రివ్యూ

Submitted by arun on Fri, 04/20/2018 - 10:49

చిత్రం: భరత్‌ అనే నేను 
నటీనటులు: మహేష్‌బాబు.. కైరా అడ్వాణీ.. ప్రకాష్‌రాజ్‌.. శరత్‌కుమార్‌.. రమాప్రభ.. దేవరాజ్‌.. ఆమని.. సితార.. పోసాని కృష్ణమురళి.. రవిశంకర్‌.. జీవా.. యశ్‌పాల్‌ శర్మ.. రావు రమేష్‌.. అజయ్‌.. బ్రహ్మాజీ తదితరులు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్‌, తిరు 
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌ 
కళ: సురేష్‌ సెల్వరాజన్‌ 
సాహిత్యం: రామ జోగయ్యశాస్త్రి 
నిర్మాత: డీవీవీ దానయ్య 
దర్శకత్వం: కొరటాల శివ 
సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 
విడుదల తేదీ:20-04-2018