Suicide

అత్తింటి ఆగడాలకు మగాడి బలి

Submitted by arun on Tue, 07/03/2018 - 14:53

భార్యతో కలిసి అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాలలేక ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకుముందు ఓ సెల్ఫీ వీడియో తీసి అందులో ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. 

ప్రేమించుకున్న అన్నాచెల్లెలు...పెద్దల మందలింపుతో...

Submitted by arun on Fri, 06/29/2018 - 13:27

మైనర్లైన వారు వరుసకు అన్నాచెల్లెలు. కానీ, ప్రేమించుకున్నామని వారు చెప్పడంతో పెద్దలు తీవ్రంగా మందలించారు. దీంతో రైలుకింద పడి వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుచ్చి జీయపురం, కీళ కారియపట్టికి చెందిన అశోక్ కుమార్‌ కుమార్‌ ప్రవీణ్‌(17) ప్లస్‌ టూ చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమించాడు. వీరిద్దరూ ఒకే కులానికి చెందిన వారు.. పైగా వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరిని మందలించారు.

ఉరేసుకున్న ప్రేమికులు...కలకలం సృష్టిస్తున్న మృతదేహాలు

Submitted by arun on Thu, 06/28/2018 - 12:29

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై రెండు ఆస్తిపంజరాలను పోలీసులు గుర్తించారు. ఆధారాలను బట్టి వీరు నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన పెద్దండి ప్రశాంత్‌, గౌతమిగా నిర్ధారించారు. ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవటంతో వీరిద్దరూ రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ప్రశాంత్, గౌతమి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి పెళ్లి జరిపించేందుకు నిరాకరించారు. అంతేకాకుండా గౌతమికి మరొకరితో వివాహం నిశ్చయించారు. విడిపోయి జీవించడం కన్నా చనిపోవడం మంచిందని ప్రేమికులు భావించారు.

సిద్దిపేటలో జర్నలిస్ట్‌ కుటుంబం ఆత్మహత్య

Submitted by arun on Thu, 06/21/2018 - 16:15

పెద్దలు చేసిన తప్పులకు చిన్నారులు శిక్ష అనుభవిస్తున్నారు. వందేళ్లు వర్దిల్లాలని ఆశీర్వదించాల్సిన చేతులే విషమిచ్చి చంపేస్తున్నాయ్. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న పిల్లలను కనికరం లేకుండా ప్రాణాలు తీస్తున్నారు. రక్షణగా ఉండాల్సిన కుటుంబసభ్యులే భక్షకులవుతున్నారు. 

Tags

విషాదం...ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Submitted by arun on Fri, 06/01/2018 - 12:33

గుంటూరు జిల్లాలోని పొన్నూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. అర్బన్‌ సీఐ నాగేశ్వరరావు కథనం ప్రకారం పొన్నూరు మండలం జూపూడి గ్రామానికి చెందిన బొనిగెల శారద(34) తన ఇద్దరు పిల్లలతో కలిసి కొంతకాలంగా పొన్నూరులోని 31వ వార్డులో నివాసం ఉంటోంది. గురువారం అర్థరాత్రి తనతో పాటు తన పిల్లలపై వంటనూనె, డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకుంది.

అన్నదాతను వెంటాడిన దురదృష్టం... రూ.33 వేలు ఎత్తుకెళ్లిన దొంగలు

Submitted by arun on Mon, 05/28/2018 - 14:56

ఖరీఫ్ సీజన్ వస్తున్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆ రైతు తల్లడిల్లిపోయాడు. ఇప్పటికే అప్పులు పెరిగిపోవడంతో పొలం బీడు కావాల్సిందేనంటూ కంటతడి పెట్టుకున్నాడు.  అయితే ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు  ఆ బక్కచిక్కిన రైతుకు కొండంత అండగా నిలిచింది.  కాని విధి వక్రీకరించి ... ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము దొంగల పాలు కావడంతో మహబూబ్ నగర్ జిల్లాలో ఓ పేద రైతు గుండె పగిలింది. తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివాహేతరం సంబంధం..యువకుడి ఆత్మహత్య

Submitted by arun on Fri, 03/30/2018 - 15:28

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయ్. విశాఖ జిల్లాకు చెందిన రాజశేఖర్‌కు రాణి అనే యువతితో వివాహామైంది. వీరికి పిల్లలు లేరు. ఈ క్రమంలోనే రాజశేఖర్‌ అశ్వినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్‌. చనిపోయే ముందు కారణాలను సెల్పీ వీడియోలో వివరించాడు.
 

భర్తకు ప్రియుడితో చేసిన పాడుపని వీడియోలు..

Submitted by arun on Fri, 03/16/2018 - 16:06

కట్టుకున్న భర్తను కాదని మరో యువకుడిని పెళ్లి చేసుకుంది ఓ యువతి. అంతేకాకుండా ప్రియుడితో కలిసి పెళ్లి దృశ్యాలను ఏకంగా భర్త మొబైల్‌కే వాట్సాప్‌లో పంపించి మానసికంగా వేధించింది. తీవ్రమనస్తాపానికి లోనైన భర్త.. పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడితో కలిసి భర్తకు పంపిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోనే జగిత్యాల మండలం ఖానాపూర్‌కు చెందిన నాగలక్ష్మితో ధర్మారావు పేటకు చెందిన ధర్మరాజు (27)కు పెళ్లయింది. కానీ, ఆ పెళ్లికి ముందే ఆమె తన పుట్టింటికి దగ్గర్లోని వెల్గటూరుకు చెందిన మంత్రి మహేశ్ అనే యువకుడితో ప్రేమాయాణం సాగించింది.

ఫీజుల భూతానికి బ‌లైన మరో చిట్టితల్లి

Submitted by arun on Fri, 02/02/2018 - 11:21

స్కూల్ యాజమాన్యం ధనదాహం మరో విద్యార్ధినిని బలి తీసుకుంది. ఫీజు కట్టలేదనే కారణంతో 9వ తరగతి విద్యార్ధినిని పరీక్ష రాసేందుకు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరి జేఎల్‌ఎస్‌ నగర్‌లో చోటుచేసుకుంది.

విజయవాడ సూర్యారావుపేటలో విషాదం..

Submitted by arun on Wed, 01/31/2018 - 12:35

విజయవాడ సూర్యారావుపేటలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో ఇటీవల చేరిన సత్యరాణి, ఆమె భర్త రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ పురుగుల మందు తాగారు. అక్కడ లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ దంపతుల మృతికి ఆర్థిక కారణాలే కారణమని భావిస్తున్నారు.