hello

క‌ల్యాణీకి `ఐ హేట్ యూ` మెసేజ్‌లు!

Submitted by arun on Mon, 12/25/2017 - 18:00

అఖిల్ హీరోగా ఈ నెల 22వ తేదీన 'హలో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ‌ల‌యాళ అగ్ర‌ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌, మాజీ హీరోయిన్ లిసిల ముద్దుల కూతురు క‌ల్యాణి. ఈ సినిమా ద్వారా కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో అఖిల్ సరసన మెరిసిన ఈ అమ్మాయికి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో అంతా "కల్యాణి.. ఐ హేట్ యూ" అంటూ వరుసగా మెసేజ్ లు పెట్టేస్తున్నారట.

అయ్యో.. నేను ఏడవలేదు: సమంత

Submitted by arun on Thu, 12/21/2017 - 14:37

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం హ‌లో. అఖిల్‌, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం నోవాటెల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు నాగ చైత‌న్య‌, స‌మంత‌లు కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. అయితే వేడుకలో నాగార్జున.. పెద్ద కుమారుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ‘చైకు ఉన్న మంచి మనసు నాకే కాదు ఎవ్వరికీ లేదు’ అన్నారు. అది విని అభిమానులు కేకలు వేశారు. ఆ సమయంలో సమంత కళ్లు చెమర్చాయట. ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ నిజమైన ప్రేమంటే ఇదేనని నాగ్‌ మాట్లాడుతున్న వీడియో పోస్ట్‌ చేశాడు.

అన్న బాట‌లో అఖిల్ వెళ‌తాడా?

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 17:24

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన అక్కినేని అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' ఆశించిన విజ‌యం సాధించలేదు. ప్ర‌స్తుతం 'హ‌లో' అంటూ రెండో సినిమా చేస్తున్నాడీ యంగ్ హీరో. 'ఇష్క్‌', 'మ‌నం', '24'వంటి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న విక్ర‌మ్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య తొలి చిత్రం 'జోష్' ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. రెండో చిత్రం 'ఏమాయ చేసావె' ప్రేమ‌క‌థ‌తో రూపొంది హిట్ చిత్రంగా నిలిచింది.

'మ‌నం' డైరెక్ట‌ర్ స్టైల్ మార్చాడు

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 11:25

'ఇష్క్‌', 'మ‌నం', '24'.. ఇలా ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని డిఫ‌రెంట్‌ స‌బ్జెక్ట్‌ల‌తో సినిమాలు చేసి ద‌ర్శ‌కుడిగా మెప్పించాడు విక్ర‌మ్ కుమార్‌. శ్రియ తొలి తెలుగు చిత్రం 'ఇష్టం'కి ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌లో ఒక‌రిగా వ్య‌వ‌హ‌రించిన విక్ర‌మ్‌.. ఆ త‌రువాత‌ త‌మిళ‌, హిందీ చిత్రాల వైపు దృష్టి పెట్టాడు. మ‌ళ్లీ 'ఇష్క్‌'తో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన‌ విక్ర‌మ్ కి ఓ అల‌వాటు ఉంది.